వీళ్లతో మాట్లాడటం దండగ.. మీడియాపై బొత్స దురుసు ప్రవర్తన
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా, అసలు వీళ్లతో మాట్లాడటం దండగ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు మార్లు బొత్స తన నోటి దురుసును, అందునా మీడియా మీద అక్కసును ప్రదర్శించారు.
శనివారం నాడు మళ్లీ మీడియాపై విరుచుకుపడ్డారు. ఇలా మాట్లాడటం సరికాదని కొంతమంది మీడియా ప్రతినిధులు అన్నా కూడా వేలు పెట్టి బెదిరించినట్లు చూపించి మరీ వ్యాఖ్యానాలు చేశారు. తమ ముఖ్యమంత్రితో తాము ఏమైనా మాట్లాడతామని, నా నోరు.. నా ఇష్టమని అన్నారు. మీకు ఇష్టం వచ్చినది రాసుకోండి అంటూ విసురుగా ప్రవర్తించారు.