India Development Report
-
PM Modi Egypt Tour: ఇండియా హీరో మోదీ
కైరో: ‘ఇండియా హీరో నరేంద్ర మోదీ’ అంటూ ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ చరిత్రాత్మక ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం ఈజిప్టులో అడుగుపెట్టారు. గత 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడంఇదే మొదటిసారి. రాజధాని కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇండియా హీరో(కథానాయకుడు) మీరేనంటూ వారు ప్రశంసించగా మోదీ ప్రతిస్పందించారు. అందరికీ హీరో ఇండియా అని బదులిచ్చారు. ప్రజలంతా కష్టపడి పనిచేస్తున్నారని, అందుకే మన దేశం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశ విజయంలో వారికి సైతం వాటా దక్కుతుందన్నారు. అనంతరం దావూదీ బోహ్రా వర్గం ముస్లింలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్‌లోని దావూదీ బోహ్రా ముస్లింలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈజిప్టులో ప్రవాస భారతీయులు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారి ఆప్యాయత తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఈజిప్టువాసులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తనకు స్వాగతం పలికారని వెల్లడించారు. భారత్–ఈజిప్టు దేశాలు సంప్రదాయాలను సైతం పంచుకుంటున్నాయని వివరించారు. అల్–హకీం మసీదు, గ్రేట్ పిరమిడ్ల సందర్శన ఈజిప్టులో 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక అల్–హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించిన హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈజిప్టులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 3,799 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గిజా గ్రేట్ పిరమిడ్లను మోదీ సందర్శించారు. కైరో నగర శివార్లలో గిజా నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో ఈ పిరిమిడ్లు ఉన్నాయి. ‘‘కైరో అల్–హకీం మసీదును సందర్శించడం ఆనందంగా ఉంది. ఈజిప్టు ఘనమైన వారసత్వానికి, సంస్కృతికి ఈ మసీదు దర్పణం పడుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనే దిశగా భారత్, ఈజిప్టు మరో అడుగు వేశాయి. భారత ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రాచీన, పురావస్తు కట్టడాల పరిరక్షణ, ‘కాంపిటీషన్ లా’కు సంబంధించిన మరో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపారు. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ ప్రదానం ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్టు సహా ఇప్పటిదాకా 13 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, రష్యా, బహ్రెయిన్, పపువా న్యూగినియా, ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ, భూటాన్ తదితర దేశాల నుంచి ఆయన ఈ పురస్కారాలు స్వీకరించారు. తనకు ఆర్డర్ ఆఫ్ ద నైలు పురస్కారం ప్రదానం చేసిన ఈజిప్టు ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ పట్ల ఈజిప్టు ప్రజల ఆప్యాయత అనురాగాలకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. -
ఇక పదేళ్లే మిగిలింది
ముంబై: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందేందుకు కేవలం పదేళ్ల కాలమే ఉందని, ఇందుకోసం అంతా విద్యపై దృష్టి సారించాలని ఎస్బీఐ నివేదిక అభిప్రాయపడింది. లేకపోతే అధిక జనాభాయే ప్రతికూలమవుతుందని హెచ్చరించింది. ‘‘భారత్ అభివృద్ధి చెందిన దేశం అనే ట్యాగ్‌ను సొంతం చేసుకోవటానికింకా దశాబ్ద కాలమే మిగిలి ఉంది. దీన్ని సాధించలేకపోతే ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. విధాన నిర్ణేతలు మేల్కోవాలి’’ అని ఎస్బీఐ పరిశోధక బృందం రూపొందించిన అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. ఇంకా ఈ నివేదిక ఏం సూచించిందంటే... ►యువ జనాభాపై ప్రభుత్వం, విధాన నిర్ణేతలు దృష్టి పెట్టాలి. అధిక జనాభా నుంచి లబ్ధి పొందేందుకు విద్యపై ఇన్వెస్ట్ చేయాలి. ► అధిక జనాభా అనుకూలత కాస్తా 2030 నాటికి ప్రతికూలంగా మారుతుంది. ► అధిక జనాభా వృద్ధి గత రెండు దశాబ్దాలుగా ఒకే విధంగా 18 కోట్లుగా ఉంది. ►సంతానోత్పత్తి రేటు రాష్ట్రాల మధ్య చాలా భిన్నంగా ఉంది. కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాల్లో జననాల రేటు తగ్గింది. దీంతో ఆ రాష్ట్ర వాటా 1971లో 6.1 శాతంగా ఉంటే, 2011 నాటికి 9.5 శాతానికి చేరింది. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి ‘‘తక్కువ జనాభా వృద్ధితో ప్రజలు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు బదులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను మెరుగు పరచాలి. ఇందుకోసం కొన్ని మార్పులు చేపడితే చాలు. ప్రైవేటు పాఠశాలలకు విద్యా హక్కు చట్టం కింద ఇస్తున్న నిధుల్ని నిలిపివేసి వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల మెరుగునకు వెచ్చించాలి. తరగతి గదులు మెరుగ్గా ఉంచడం, ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, మంచి పారితోషికంతో అర్హత కలిగిన టీచర్లను నియమించడం’’ వంటి సూచనలను ఈ నివేదిక చేసింది. -
భారత్ వృద్ధి ఇకపైనా పరుగే
► 2017–18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి ► ప్రపంచ బ్యాంకు నివేదిక న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇకముందూ తన ప్రయాణం సాగిస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2017–18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. అంతేకాదు 2019–20 నాటికి 7.7 శాతం వద్ధి రేటుకు చేరుకుంటుందని వివరించింది. బలమైన ఫండమెంటల్స్, పెట్టుబడుల తీరు మెరుగుపడుతుండడం, సంస్కరణల వాతావరణాన్ని సానుకూలతలుగా పేర్కొంది. మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచితే రెండంకెల వృద్ధి రేటు సాధన దిశగా సాగిపోవచ్చనీ సూచించింది. ఈ మేరకు ‘ఇండియా డెవలప్మెంట్ రిపోర్ట్’ను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. గతేడాది చక్కని వర్షపాతం తర్వాత పరిస్థితులు మెరుగుపడుతుండగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం భారత వృద్ధికి విఘాతం కలిగించిందని ప్రపంచ బ్యాంకు వివరించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా జీడీపీ రేటు ఉండొచ్చని తెలిపింది. ‘‘భారత్ ఇకపైనా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీఎస్టీ అమలు ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది’’ అని బ్యాంకు దేశీయ డైరెక్టర్ జునైద్ అహ్మద్ తెలిపారు. మహిళల పాత్ర పెరగాలి దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరాన్ని ప్రపంచ బ్యాంకు ప్రముఖంగా ప్రస్తావించింది. వారి పాత్ర ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు సీనియర్ ఆర్థికవేత్త ఫ్రెడరికో గిల్ శాండర్ తెలిపారు. ‘‘భారత్‌లో డిగ్రీ చదివిన మహిళల్లో 65 శాతం మంది పని చేయడం లేదు. ఈ రేటు బంగ్లాదేశ్‌లో 41 శాతం, ఇండోనేషియా, బ్రెజిల్లో 25 శాతంగానే ఉంది. భారత్ మరిన్ని ఉద్యోగాలు కల్పించాలి. వేతన ఉద్యోగాలను విస్తృతం చేయాలి. అలాగే, భద్రతతో కూడిన పరిస్థితులను కల్పించడం ద్వారా పని ప్రదేశాల్లో లింగ అసమానత్వాన్ని తగ్గించాలి’’ అని శాండర్ సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం: ఎస్బీఐ జీడీపీ వృద్ధి రేటును గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సవరించే అవకాశం ఉందని ఎస్బీఐ తెలిపింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతం, 2016–17లో 7.6 శాతానికి సవరించొచ్చని ‘ఎకోవ్రాప్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మే 31న విడుదల కానున్న జీడీపీ గణాంకాలు బావుంటాయన్న అభిప్రాయాన్ని వినిపించింది. నూతన ఐఐపీ, డబ్ల్యూపీఐ సిరీస్ 2013–14 నుంచి అన్ని జీడీపీ గణాంకాలపైనా ప్రభావం చూపొచ్చని తెలిపింది. ‘‘2013–14లో 6.5గా ఉన్న జీడీపీ రేటును 7.3 శాతానికి సవరించొచ్చు. అలాగే, 2015–16 జీడీపీని 7.9 నుంచి 8.3 శాతానికి, 2016–17 వృద్ధి రేటును 7.1 నుంచి 7.6 శాతానికి సవరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం’’ అని నివేదికలో ఎస్బీఐ పేర్కొంది. మే 19 నాటికి వ్యవస్థలోకి నగదు తిరిగి ప్రవేశపెట్టడం (రీమోనిటైజేషన్) 80 శాతానికి చేరిందని తెలిపింది. ‘‘గతేడాది నవంబర్ 8 నుంచి ఈ ఏడాది మే 12 వరకు వ్యవస్థలోకి రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయని అంచనా వేస్తున్నట్టు వివరించింది. మెరుగైన జీడీపీ గణాంకాలకు తోడు సరిపడా లిక్విడిటీ, నెమ్మదించిన ద్రవ్యోల్బ ణంతో ఆర్బీఐకి ద్రవ్య విధాన నిర్వహణ క్లిష్టంగా మారిందని ఈ నివేదికను రూపొందించిన ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ పేర్కొన్నారు.