India Prime Minister
-
Republic Day 2024: అలా అనకూడదని తెలుసా?
Republic Day Celebrations 2024: ఇవాళ జెండా పండుగ. గణతంత్ర దినోత్సవం. అయితే ఇవాళ జెండా ఎగరేయడం అనొద్దు అంట. అది ముమ్మాటికీ తప్పంట. ఆవిష్కరించడం అనలాట. ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పైగా ఇవాళ జెండా ఆవిష్కరించబోయేది రాష్ట్రపతి. ఈ వేడుకలకు ప్రధాని హాజరైనా జెండా మాత్రం ఆవిష్కరించరు. ప్రధాని కేవలం స్వాత్రంత్య దినోత్సవం నాడు ప్రధాని జెండా ఎర్రకోటపై ఎగరేయడానికి.. జనవరి 26న రాష్ట్రపతి జెండా ఆవిష్కరించడానికి గల కారణం.. ఆ ఆనవాయితీ ఎన్నేళ్ల నుంచి కొనసాగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.. జనవరి 26 రిపబ్లిక్ డే, ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే.. ఈ రెండు తేదీలలో దేశవ్యాప్తంగా జెండాను రెపరెపలాడిస్తారు. పంద్రాగష్టున ప్రధాని ఎర్రకోటలో జెండా ఎగరేస్తారు. అయితే ఈ రోజు జనవరి 26న రాష్ట్రపతి న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టే దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాం. అదే ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగుతారు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాబట్టే.. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేశారు. అది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక. అదలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. నేడు రాష్ట్రపతి.. ఆరోజున ప్రధాని.. కారణం ఇదే.. ఇక్కడ గమనించాల్సిన మరో వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఘనంగా పరేడ్ నిర్వహిస్తారు. ఇక.. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి ప్రత్యేకంగా కారణం చెప్పనక్కర్లేదు. ఎర్రకోటపై జెండా ఎగరేశారక ఆయన ప్రసంగం ఇస్తారు. -
ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్'
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చేరుకున్న మోదీకి దేశ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. కాగా ప్రధాని మోదీ నోటి వెంట ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్.. జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే పేరు రావడం ఆసక్తి కలిగించింది. పారిస్‌లోని లా సినేలో భారతీయ సంఘంతో సమావేశమయ్యారు. భారతీయ సంఘానికి తన సందేశాన్ని వినిపిస్తూ ఎంబాపె గురించి ప్రస్తావించారు. విదేశీ ఆటగాళ్లపై భారత్‌లో రోజురోజుకు అభిమానం పెరుగుతుందని పేర్కొన్నారు. '' ఇవాళ ఫ్రాన్స్ ఫుట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న కైలియన్ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మా దేశంలో ఎంబాపెకు మస్తు క్రేజ్ ఉంది. అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. #WATCH | French football player Kylian Mbappe is superhit among the youth in India. Mbappe is probably known to more people in India than in France, said PM Modi, in Paris pic.twitter.com/fydn9tQ86V — ANI (@ANI) July 13, 2023 ఇక 2018లో ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలవడంలో ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లోనూ ఎంబాపె సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి మెస్సీ జట్టుకు వణుకు పుట్టించాడు. పెనాల్టీ షూటౌట్లో ఓడి ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలిచినప్పటికి ఎంబాపె తన ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ ఒక్క ప్రదర్శనతో మెస్సీ, రొనాల్డో తర్వాత అత్యధిక అభిమానగనం సంపాదించిన ప్లేయర్‌గా ఎంబాపె చరిత్రకెక్కాడు. 2017లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించిన ఎంబాపె అనతికాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. 24 ఏళ్ల వయసులోనే సంచలన ఆటతో అదరగొడుతున్న ఎంబాపె ఇప్పటివరకు ఫ్రాన్స్ తరపున 70 మ్యాచ్‌లాడి 40 గోల్స్ చేశాడు. చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
ప్రధాని మోదీని కలుసుకున్న నిఖత్ జరీన్.. ఫోటోలు వైరల్
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్జరీన్ బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. నిఖత్ జరీన్‌తో పాటు యువ బాక్సర్లు మనీష్ మౌన్, పర్వీన్ హుడాలు కూడా ఉన్నారు. మోదీని కలిసిన నిఖత్ జరీన్ తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపిస్తూ ప్రధానితో సెల్ఫీ దిగింది. ఆ తర్వాత మనీష్ మౌన్, పర్వీన్ హుడా, నిఖత్ జరీన్‌లతో కలసి ఫోటో దిగిన మోదీజీ వారితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిఖత్ జరీన్ తన ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.''ప్రధాని మోదీ జీ.. మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.. థాంక్యూ సర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇటీవలే టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణం సాధించి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 52 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో నిఖత్ జరీన్.. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పోంగ్ జుట్మస్ను 5-0(30-27, 29-28, 29-28,30-27, 29-28)తో పంచ్‌ల వర్షం కురిపించింది. 2018లో మేరీకోమ్ తర్వాత ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో ఒక భారత బాక్సర్ స్వర్ణం గెలడవం మళ్లీ ఇదే. కాగా నిఖత్ జరీన్ భారత్ తరపున ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళగా రికార్డులకెక్కింది. నిఖత్ జరీన్ కంటే ముందు మేరీకోమ్(ఐదుసార్లు), సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీలు ఉన్నారు. ఇక 57 కేజీల విభాగంలో మనీషా మౌన్.. 63 కేజీల విభాగంలో పర్వీన్ హుడాలు కాంస్య పతకం సాధించారు. 73 దేశాల నుంచి 310 మంది బాక్సర్లు పాల్గొన్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 12 మంది భారత మహిళా బాక్సర్లు పాల్గొన్నారు. వీరిలో 8 మంది కనీసం క్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో భారత్ సాధించిన మూడు పతకాలతో మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. ఇందులో 10 స్వర్ణాలు, 8 రజతాలు, 21 కాంస్యాలు ఉన్నాయి. ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో రష్యా(60), చైనా(50) తర్వాతి స్థానంలో భారత్(39) ఉండడం విశేషం. చదవండి: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా An honour to meet our Hon’ble PM @narendramodi sir. Thank you sir😊🙏🏻 pic.twitter.com/8V6avxBG9O — Nikhat Zareen (@nikhat_zareen) June 1, 2022 Prime Minister Narendra Modi meets the women boxers Nikhat Zareen, Manisha Moun and Parveen Hooda who won medals in the World Boxing Championships.#PMModi #nikhat_zareen pic.twitter.com/4dSmhvgmcV — Omprakash Narayana Vaddi (@omprakashvaddi) June 1, 2022 -
Sakshi Cartoon: అధికారం పోతుందనే డిప్రెషన్లో ఏవేవో అంటున్నాడు..!
అధికారం పోతుందనే డిప్రెషన్లో ఏవేవో అంటున్నాడు... పట్టించుకోకండి సార్! -
భారత్ సాయం కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు.. ప్రతిఘటనతో ఉక్రెయిన్ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది ఉక్రెయిన్. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భారత్ సాయం కోరారు. శనివారం సాయంత్రం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ Volodymyr Zelenskyy ఫోన్ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీ, ప్రధాని మోదీని కోరారు. వీలైనంత త్వరగా ఈ సంక్షోభం ముగిసేలా చూడాలంటూ ఆయన ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం. అంతేకాదు ఈ మేరకు జెలెన్స్కీ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. లక్షకు పైగా చొరబాటుదారులు తమ భూభాగంలోకి ప్రవేశించారని, ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో రాజకీయ మద్దతు ఉక్రెయిన్‌కు ప్రకటించాలని జెలెన్స్కీ కోరినట్లు సమాచారం. ప్రతిస్పందన గురించి సమాచారం అందాల్సి ఉంది. Spoke with 🇮🇳 Prime Minister @narendramodi. Informed of the course of 🇺🇦 repulsing 🇷🇺 aggression. More than 100,000 invaders are on our land. They insidiously fire on residential buildings. Urged 🇮🇳 to give us political support in🇺🇳 Security Council. Stop the aggressor together! — Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022 -
మోడీకి విదేశీ మీడియా విస్తృత కవరేజీ
బీజింగ్/వాషింగ్టన్: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ మీడియా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా చైనా, అమెరికా పత్రికలు విస్తృత కవరేజీ ఇస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) నేతలను ముఖ్యంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడాన్ని భారత్ విదేశీ వ్యవహారాల్లో సానుకూల పరిణామంగా అభివర్ణించాయి. అలాగే కొత్త ప్రభుత్వం సారథ్యంలో భారత్ మంచి మార్పుతో ఆర్థిక ప్రగతి వైపు దూసుకెళ్తుందని అమెరికాలోని లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక పేర్కొంది. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లవద్దంటూ స్వదేశీ నిఘా సంస్థ (ఐఎస్ఐ) హెచ్చరించినా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం హాజరుకావడాన్ని స్వాగతించింది. -
మన్మోహన్ సింగ్‌కు సమస్యల స్వాగతం
విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం స్వదేశం తిరిగొస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కొత్త సమస్యలు స్వాగతం పలకనున్నాయి. దౌత్య సంబంధాలు, సరిహద్దు సమస్యల గురించి వివిధ దేశాధినేతలతో చర్చించిన ప్రధానికి భారత్ రాగానే సొంత పార్టీ నుంచే సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేరచరిత చట్టసభ్యుల ఆర్డినెన్స్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనను ఇరుకున పెట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం అర్థంలేని విషయమని రాహుల్ విమర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలను ప్రధానిని అవమానించే విధంగా ఉన్నాయని, మన్మోహన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వివాదాస్పద ఆర్డినెన్స్‌ను కేంద్రం రద్దు చేసే అవకాశముంది. కాగా ఈ మొత్తం పరిణామం మన్మోహన్‌కు ఇబ్బందికర పరిణామమే. దీనికి తోడు సరిహద్దు సమస్యలపైనా విపక్షాలు దాడి చేసే అవకాశముంది. విదేశీ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాకిస్థాన్ ప్రధాని మంత్రి నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ కీలక అంశాలపై చర్చలు జరిపారు.