మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు.. ప్రతిఘటనతో ఉక్రెయిన్ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది ఉక్రెయిన్. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ భారత్ సాయం కోరారు.
శనివారం సాయంత్రం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ Volodymyr Zelenskyy ఫోన్ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ, ప్రధాని మోదీని కోరారు. వీలైనంత త్వరగా ఈ సంక్షోభం ముగిసేలా చూడాలంటూ ఆయన ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం.
అంతేకాదు ఈ మేరకు జెలెన్‌స్కీ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. లక్షకు పైగా చొరబాటుదారులు తమ భూభాగంలోకి ప్రవేశించారని, ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో రాజకీయ మద్దతు ఉక్రెయిన్‌కు ప్రకటించాలని జెలెన్‌స్కీ కోరినట్లు సమాచారం. ప్రతిస్పందన గురించి సమాచారం అందాల్సి ఉంది.
Spoke with 🇮🇳 Prime Minister @narendramodi. Informed of the course of 🇺🇦 repulsing 🇷🇺 aggression. More than 100,000 invaders are on our land. They insidiously fire on residential buildings. Urged 🇮🇳 to give us political support in🇺🇳 Security Council. Stop the aggressor together!
— Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
Comments
Please login to add a commentAdd a comment