మోడీకి విదేశీ మీడియా విస్తృత కవరేజీ | Foreign media checks out 'Narendra Modi factor' | Sakshi
Sakshi News home page

మోడీకి విదేశీ మీడియా విస్తృత కవరేజీ

Published Wed, May 28 2014 3:50 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోడీకి విదేశీ మీడియా విస్తృత కవరేజీ - Sakshi

మోడీకి విదేశీ మీడియా విస్తృత కవరేజీ

బీజింగ్/వాషింగ్టన్: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ మీడియా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా చైనా, అమెరికా పత్రికలు విస్తృత కవరేజీ ఇస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) నేతలను ముఖ్యంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడాన్ని భారత్ విదేశీ వ్యవహారాల్లో సానుకూల పరిణామంగా అభివర్ణించాయి. అలాగే కొత్త ప్రభుత్వం సారథ్యంలో భారత్ మంచి మార్పుతో ఆర్థిక ప్రగతి వైపు దూసుకెళ్తుందని అమెరికాలోని లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక పేర్కొంది. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లవద్దంటూ స్వదేశీ నిఘా సంస్థ (ఐఎస్‌ఐ) హెచ్చరించినా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం హాజరుకావడాన్ని స్వాగతించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement