క్వార్టర్స్‌లో స్నేహ, సాయిశరణ్
ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్నేహ పడమట, సాయిశరణ్ రెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సికింద్రాబాద్ క్లబ్ టెన్నిస్ కోర్టుల్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో నగరానికి చెందిన వీరిద్దరూ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో స్నేహ 1-6, 6-1, 6-3తో సహచర క్రీడాకారిణి తీర్థ ఇస్కాపై, నిహారిక (ఏపీ) 6-3, 6-2తో కర్ణాటకకు చెందిన ఉజ్జినిపై గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల్లో ఈతి మెహతా (గుజరాత్) 6-0, 6-0తో రేష్మ (తమిళనాడు)పై, ఆర్తి (తమిళనాడు) 6-4, 6-1తో సాన్యా మదన్ (ఉత్తరప్రదేశ్)పై నెగ్గారు.
అక్షర ఇస్కా (ఏపీ) 7-6, 2-6, 3-6తో వానియా దంగ్వాల్ (ఢిల్లీ)పై, పళని వాలే (తమిళనాడు) 7-6, 6-3తో మాన్య నాగ్‌పాల్ (ఢిల్లీ)పై గెలుపొందారు. పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిశరణ్ రెడ్డి 6-2, 6-4తో రోహన్ భాటియా (మహారాష్ట్ర)ను ఓడిం చగా, అబ్దుల్లా (ఏపీ) 6-4, 6-2తో పుంగ్లియా జయేశ్ (మహారాష్ట్ర)పై గెలిచాడు. విఘ్నేశ్ (ఏపీ) 2-6, 4-6తో రోనిత్ (ఢిల్లీ) చేతిలో పరాజయం చవిచూడగా, జయప్రకాశ్ (తమిళనాడు) 6-3, 6-4తో విశ్వకర్మ (యూపీ)పై నెగ్గాడు.