India U-19
-
గ్రూప్ టాపర్ యువ భారత్
బ్లూమ్‌ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): అండర్–19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత జట్టు 6 పాయింట్లతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 115 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో 21 ఓవర్ల అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ 4 గంటలకుపైగా ఆగిపోయింది. వాన తగ్గాక అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), దివ్యాన్ష్ సక్సేనా (52 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం డక్‌వర్త్ లూయీస్ పద్దతి ద్వారా న్యూజిలాండ్‌కు 23 ఓవర్లలో 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనకు దిగిన కివీస్ జట్టు 21 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటై ఓడింది. భారత లెగ్ స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవి బిష్ణోయ్ (4/30)తో ప్రత్యర్థిని కట్టడి చేయగా... అతనికి అథర్వ అన్కోలేకర్ (3/28) చక్కటి సహకారం అందించాడు. జనవరి 28న జరిగే సూపర్ లీగ్ తొలి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. -
యువ భారత్‌దే సిరీస్
కొలంబో: ఓపెనర్ యశస్వి జైస్వాల్ (114 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక అండర్–19 జట్టుతో జరిగిన చివరి యూత్ వన్డేలో భారత అండర్–19 జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను యువ భారత్ 3–2తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మోహిత్ జాంగ్రా రెండు... హైదరాబాద్ క్రికెటర్ అజయ్ దేవ్‌గౌడ్, సిద్ధార్థ్ దేశాయ్, హర్‡్ష త్యాగి, ఆయుష్ బదోని, సమీర్ చౌదరి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత యువ భారత్ 42.4 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి తొలి వికెట్‌కు దేవ్‌దత్ పడిక్కల్ (38; 6 ఫోర్లు)తో 71 పరుగులు... పవన్ షా (36)తో రెండో వికెట్‌కు 72 పరుగులు, కెప్టెన్ ఆర్యన్ జుయల్ (22 నాటౌట్)తో మూడో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జతచేసి భారత్‌కు విజయాన్నందించాడు. -
యువ భారత్ జయభేరి
హంబన్‌టోటా: శ్రీలంక అండర్–19 జట్టుతో జరిగిన రెండో యూత్ టెస్టులోనూ భారత అండర్–19 జట్టు జయభేరి మోగించింది. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో యువ భారత్... ఇన్నింగ్స్ 147 పరుగుల తేడాతో గెలుపొంది 2–0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 47/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన లంక భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 62.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. పెర్నాండో (28) టాప్‌స్కోరర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ (4/40), బదోని (2/17), మంగ్వాని (2/9)లు చెలరేగడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక పరాజయం పాలైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 613/8 వద్ద డిక్లేర్డ్ చేయగా... శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 316లకే పరిమితమై ఫాలోఆన్ ఆడిన విషయం తెలిసిందే. -
క్రికెట్ జట్టు: సచిన్ కొడుకుకు పిలుపు!
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను భారత అండర్-19 క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. వచ్చేనెల శ్రీలంకతో జరగనున్న అండర్-19 సిరీస్‌లో అర్జున్ టెండూల్కర్ భారత జట్టు తరఫున ఆడనున్నాడు. జూలైలో శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్‌లో భాగంగా భారత అండర్-19 జట్టు రెండు ఫోర్ డే మ్యాచులు, ఐదు వన్డే మ్యాచులు ఆడనుంది. 18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఫోర్డే మ్యాచుల్లో భారత జట్టుకు అతను ప్రధాన ఆటగాడు కానున్నాడు. అయితే, ఐదు వన్డే మ్యాచులకు ప్రకటించిన జట్టులో మాత్రం అతన్ని తీసుకోలేదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉనాలోని జోనల్ క్రికెట్ అకాడమీ (జెడ్‌సీఏ)లో ఏర్పాటుచేసిన క్యాంపులోని ప్రధాన అండర్-19 ఆటగాళ్లలో ఒకడిగా అర్జున్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. -
భారత్‌కు రెండో విజయం
రాణించిన రిషబ్ పంత్ అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్‌కతా: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత యువ జట్టు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 33 పరుగుల తేడాతో అఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (88 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. మహిపాల్ (62 బంతుల్లో 43; 6 ఫోర్లు), కెప్టెన్ రికీ భుయ్ (27) ఫర్వాలేదనిపించారు. అమన్‌దీప్ ఖరే (24)తో కలిసి రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించిన పంత్... భుయ్‌తో మూడో వికెట్‌కు 75 పరుగులు సమకూర్చాడు. ఓ దశలో 201/6 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న భారత్... 35 పరుగుల తేడాలో చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. రషీద్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్తాన్ 47.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (43) టాప్ స్కోరర్. మహ్మద్ సర్దార్ (33), ముస్లిం మూసా (27), ఇసానుల్లా (25) ఓ మాదిరిగా ఆడారు. పేసర్ కలీల్ అహ్మద్ (4/41) ధాటికి అఫ్ఘాన్ టాప్ ఆర్డర్ విఫలమైంది. చివర్లో రషీద్, సర్దార్లు ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జోడించి గెలిపించే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు సమర్థంగా అడ్డుకున్నారు. ప్రమాణిక్, మహిపాల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో మొత్తం 9 పాయింట్లు ఉన్నాయి. -
భారత కుర్రాళ్ల శుభారంభం
విశాఖపట్టణం, న్యూస్‌లైన్: దీపక్ హుడా (55 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు; 5 సిక్స్‌లు, 2/37)ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో అండర్-19 నాలుగు దేశాల వన్డే సిరీస్‌లో భారత కుర్రాళ్లు శుభారంభం చేశారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించిన భారత్ 148 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఓపెనర్ అంకుశ్ బెయిన్స్ (62 బంతుల్లో 49; 7 ఫోర్లు; 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (55 బంతుల్లో 55; 4 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన హుడా జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. ప్రతీ బౌలర్‌పై ఎదురుదాడికి దిగడంతో చివర్లో స్కోరు బోర్డు పరుగులెత్తింది. రికీ భుయ్ (19)తో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన హుడా... 15 ఏళ్ల సర్ఫరాజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 35 బంతుల్లోనే 72 పరుగులు జత చేశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వే 41.2 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటయ్యింది. బుర్ల్ (55 బంతుల్లో 46; 4 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే ఆకట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్‌కు నాలుగు వికెట్లు దక్కగా హుడా బౌలింగ్‌లోనూ రాణించి రెండు వికెట్లు సాధించాడు. సోమవారమే జరిగిన మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అండర్ -19 జట్టు 17 పరుగుల తేడాతో ఆసీస్ అండర్-19 జట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 44 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఆసీస్ 44.2 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఓడింది.