యువ భారత్‌ జయభేరి  | India U-19 crush Sri Lanka by innings and 147 runs | Sakshi
Sakshi News home page

యువ భారత్‌ జయభేరి 

Published Sat, Jul 28 2018 1:42 AM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

India U-19 crush Sri Lanka by innings and 147 runs - Sakshi

హంబన్‌టోటా: శ్రీలంక అండర్‌–19 జట్టుతో జరిగిన రెండో యూత్‌ టెస్టులోనూ భారత అండర్‌–19 జట్టు జయభేరి మోగించింది. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో యువ భారత్‌... ఇన్నింగ్స్‌ 147 పరుగుల తేడాతో గెలుపొంది 2–0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 47/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన లంక భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 62.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది.

పెర్నాండో (28) టాప్‌స్కోరర్‌. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ (4/40), బదోని (2/17), మంగ్వాని (2/9)లు చెలరేగడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక పరాజయం పాలైంది.  భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 613/8 వద్ద డిక్లేర్డ్‌ చేయగా... శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 316లకే పరిమితమై ఫాలోఆన్‌ ఆడిన విషయం తెలిసిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement