India-US
-
Narendra Modi: మనమే ప్రపంచ సారథులం
న్యూయార్క్: ‘‘అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకుని గత పదేళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ప్రపంచ సారథిగా ఎదుగుతోంది. అవకాశాల ఇంకెంతమాత్రమూ కోసం ఎదురు చూడటం లేదు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోంది. అంతులేని అవకాశాలకు నెలవుగా మారింది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఇతర దేశాలను ముందుండి నడిపిస్తోంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రగతిలో విదేశాల్లోని భారతీయులది అత్యంత కీలక పాత్ర అంటూ కొనియాడారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని అభిప్రాయపడ్డారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లో భారతీయ అమెరికన్లతో ప్రధాని భేటీ అయ్యారు. స్థానిక నాసౌ వెటరన్స్ కొలోజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నారైలు పోటెత్తారు. న్యూయార్క్, పరిసర న్యూజెర్సీ నుంచేగాక మొత్తం 42 రాష్ట్రాలనుంచి 13,000 మందికి పైగా సభకు హాజరయ్యారు. సమావేశం ఆద్యంతం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన వేదికపైకి చేరుకున్న తర్వాత కూడా నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా కొనసాగాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ వారి అభిమానం తనను కదిలించివేసిందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన భారతీయులు నాపై ఇలా చెప్పలేనంతటి ఆదరాభిమానాలు, ఆప్యాయత కురిపిస్తూనే ఉన్నారు. దీనికి శాశ్వతంగా రుణపడిపోయాను’’ అని చెప్పారు. భారత, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండయన్ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగం గంటా పది నిమిషాల పాటు సాగింది. ప్రసంగం పొడవునా సభికులు పదేపదే చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ సందడి చేశారు. అంతకుముందు వేదికపై ‘ద ఎకోస్ ఆఫ్ ఇండియా – అ జర్నీ త్రూ ఆర్ట్ అండ్ ట్రెడిషన్’ పేరిట 382 మంది జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. గ్రామీ అవార్డు విజేత చంద్రికా టాండన్, గాయక సంచలనం రెక్స్ డిసౌజా, తెలుగు సినీ దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు వీటిలో పాల్గొన్నారు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టడాన్ని మోదీ ప్రస్తావించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందన్నారు. భారత ప్రగతి కోసం ఈసారి అత్యంత భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ‘‘విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచి్చంది. అనుకోకుండా గుజరాత్‌కు సీఎం అయ్యాను. ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు సేవలందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాను. తర్వాత దేశ ప్రజలు నన్ను ప్రధానిని చేసి మరింత పెద్ద బాధ్యత కట్టబెట్టారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘దేశ ప్రగతికి, సుపరిపాలనకు నా జీవితాన్ని అంకితం చేశాను. అధ్యక్షుడు జో బైడెన్ శనివారం నన్ను దగ్గరుండి ఆహా్వనించి మరీ తన ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆయన చూపిన గౌరవం నన్నెంతగానో కదిలించింది. అది 140 కోట్ల పై చిలుకు భారతీయులకు దక్కిన గౌరవం. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు, వారి నిరంతర కృషికి దక్కిన గౌరవం’’ అన్నారు. దశాబ్దాల క్రితం తొలిసారి తాను అమెరికాకు వచ్చిన రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర అంతర్జాతీయంగా ఆధిపత్యం సాగించడం భారత అభిమతం కాదని మోదీ అన్నారు. అయితే ప్రపంచ ప్రగతిలో, శాంతి సాధనలో కీలక పాత్ర పోషించేందుకు మాత్రం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ‘అందరికీ సమ దూరం’ అన్నది పాత విధానం. ‘అందరితోనూ సమాన సాన్నిహిత్యం’ అన్నదే నవభారత నినాదం’ అని వివరించారు. ఇది యుద్ధాలకు సమయం కాదని పునరుద్ఘాటించారు. ‘‘భారత్ అంటే ఫైర్ కాదు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు’’ అన్నారు. బోస్టన్, లాస్ ఏంజెలెస్ నగరాల్లో నూతనంగా కాన్సులేట్లను ప్రారంభించనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన సియాటెల్ కాన్సులేట్ ఇప్పటికే ప్రారంభమైందని గుర్తు చేశారు. అమెరికాకు ఫార్మా, విద్యా రంగాల్లో రాజధానిగా బోస్టన్‌కు పేరుంది. ఇక లాస్ ఏంజెలెస్ హాలీవుడ్‌కు పుట్టిల్లన్నది తెలిసిందే.పుష్ప... వికసిత భారత్! ‘‘వికసిత భారత్ అంటే ‘పుష్ప’. ప్రోగ్రెసివ్, అన్‌స్టాపబుల్, స్పిరిచ్యువల్, హ్యుమానిటీ, ప్రాస్పరస్’’ అంటూ మోదీ కొత్త నిర్వచనమిచ్చారు. దీనికి సభికుల నుంచి బ్రహా్మండమైన స్పందన వచి్చంది. అలాగే, ‘‘ఏఐ అంటే కూడా ఆస్పిరేషనల్ ఇండియా. ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్’’ అని కొత్త నిర్వచనాలిచ్చారు.అమెరికాను మించిన భారత 5జీ మార్కెట్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తూ దూసుకెళ్తోందని మోదీ అన్నారు. ఫలితంగా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారత 5జీ మార్కెట్ అమెరికాను కూడా మించిపోయిందని వివరించారు. మేడిన్ ఇండియా 6జీ టెక్నాలజీపై కూడా భారత్‌లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్లన్నీ దాదాపుగా భారత్‌లోనే తయారవుతున్నాయి. భారత సెమీ కండక్టర్ చిప్‌లను అమెరికా దిగుమతి చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రపంచమంతా మేడిన్ ఇండియా చిప్‌ల మీదే ఆధారపడి నడవనుంది. ఇది మోదీ గ్యారెంటీ’’ అన్నారు. -
త్వరలోనే ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం
న్యూఢిల్లీ: ఎక్కువసేపు గాల్లో చక్కర్లు కొడుతూ క్షిపణులతో దాడి చేయగల అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ రకం 31 సాయుధ డోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో భారత్ వచ్చే ఏడాది మార్చికల్లా ఒప్పందాన్ని ఖరారుచేసుకోనుంది. కొనుగోలు కోసం భారత్ పంపిన ‘అభ్యర్థన లేఖ’ను అమెరికా రక్షణ శాఖ ఆమోదించిన నేపథ్యంలో త్వరలోనే అమెరికా, భారత ఉన్నతాధికారులు తుది దశ చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో గగనతలంలో నిరంతర నిఘా, మెరుపు దాడుల కోసం ఈ డ్రోన్లను భారత్ వినియోగించనుంది. ఈ భారీ డ్రోన్ సరిహద్దులతోపాటు శత్రు దేశాల సైనిక వాహనాలపై నిఘాతోపాటు వాటిని వెంటాడి క్షిపణులతో దాడిచేయగలదు. ఏకబిగిన 35 గంటలపాటు గాల్లోనే ఉండగలదు. 450 కేజీల బరువైన బాంబులు అమర్చిన క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇంతటి అత్యాధునికమైన డ్రోన్లను త్రివిధ దళాల్లో దశలవారీగా ప్రవేశపెట్టాలని భారత్ తలపోస్తోంది. అందులోభాగంగానే ఈ డీల్ కుదుర్చుకుంటోంది. అమెరికా రక్షణరంగ దిగ్గజ సంస్థ జనరల్ ఆటమిక్స్ ఈ డ్రోన్లను తయారుచేస్తోంది. 31 డ్రోన్లకు మొత్తంగా రూ.25,000 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఒక్కో డ్రోన్‌ను ఎంతకు కొనాలనే ధర, ఇతరత్రా విషయాలు ఇంకా ఖరారుకాలేదు. తుది చర్చల్లో వీటిపై నిర్ణయాలు తీసుకునే వీలుంది. డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన తొలి అనుమతిని లోని రక్షణరంగ కొనుగోళ్ల మండలి ఆమోదించిన విషయం విదితమే. -
India-US Relations: అంకురాలకు దన్ను
న్యూఢిల్లీ: అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్, అమెరికా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నవకల్పనలకు ఊతమిచ్చేందుకు, నిధుల సమీకరణలో ఎంట్రప్రెన్యూర్లు పాటించే విధానాలను పరస్పరం పంచుకునేందుకు, నియంత్రణపరమైన సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇది తోడ్పడనుంది. ఇరు దేశాల పరిశ్రమవర్గాల రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా ఎంవోయూ కుదిరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశమ్రల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ఇది సానుకూల ప్రభావం చూపగలదని వివరించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో నేతృత్వం వహించిన ఈ సమావేశంలో పలువురు భారతీయ వ్యాపారవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాల సీఈవోలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చల కింద రూపొందించిన ఇండియా–యూఎస్ ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ కాన్సెప్టును ఈ సందర్భంగా గోయల్, రైమండో ఆవిష్కరించారు. డీప్ టెక్నాలజీ, క్రిటికల్ టెక్నాలజీ వంటి విభాగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాల నిబద్ధతకు ఎంవోయూ నిదర్శనంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. దీని కింద వచ్చే ఏడాది తొలినాళ్లలో భారత్, అమెరికాలో ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ ఈవెంట్లను నిర్వహించనున్నారు. -
స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ హవా.. ఎక్కువ ఆ దేశానికే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి యూఎస్‌కు జరుగుతున్న స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో కొత్త రికార్డు నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలలో దేశీయంగా తయారైన రూ.6,679 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు యూఎస్‌కు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.758 కోట్లుగా ఉంది. భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో విలువ పరంగా యూఎస్ మూడవ స్థానంలో ఉంది. ఇక మొత్తం ఎగుమతులు ఏప్రిల్–మే నెలలో అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 158 శాతం అధికమై రూ.19,975 కోట్లు నమోదయ్యాయి. యూఏఈకి రూ.3,983 కోట్లు, నెదర్లాండ్స్‌కు రూ.1,685 కోట్లు, యూకే మార్కెట్‌కు రూ.1,244 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు సరఫరా అయ్యాయి. ఇటలీ, చెక్ రిపబ్లిక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2022–23లో భారత్ నుంచి వివిధ దేశాలకు చేరిన స్మార్ట్ఫోన్ల విలువ రూ.90,009 కోట్లు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ప్రకటించడం, యుఎస్‌కు చెందిన ఆపిల్ దేశీయంగా తయారీలోకి ప్రవేశించిన తర్వాత స్మార్ట్ఫోన్లకు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా భారత్ అవతరిస్తోంది. -
‘మీకేం వీటో పవర్ ఇవ్వలేదు’.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి 100 కిలోమీటర్ల దూరంలో భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ విడత ‘యుద్ధ అభ్యాస్’ సైనిక ప్రదర్శనను చైనా వ్యతిరేకించటాన్ని తిప్పికొట్టింది భారత్. ఇలాంటి విషయంలో మూడో దేశానికి తాము ‘వీటో’ అధికారం ఇవ్వలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్-అమెరికా ప్రతిపాదనకు చైనా ‘వీటో’ పవర్ ఉపయోగించి అడ్డుకున్న విషయాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘యుద్ధ అభ్యాస్’ మిలిటరీ ప్రదర్శనను బుధవారం వ్యతిరేకించింది చైనా విదేశాంగ శాఖ. భారత్-చైనా మధ్య 1993,1996లో జరిగిన సరిహద్దు నిర్వహణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నట్లు పేర్కొంది. దానికి కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి. 1993, 96 ఒప్పందాలు ఈ మిలిటరీ ప్రదర్శనకు వర్తించవని స్పష్టం చేశారు. 2020, మేలో చైనా బలగాలు చేసిన ఉల్లంఘనలను గుర్తు చేసుకోవాలన్నారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించటం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇదీ చదవండి: వీడియో: గుజరాత్ భారీ రోడ్‌షో మధ్యలో ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్! ఎందుకంటే.. -
మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
-
అమెరికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీకి రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా బుధవారం(సెప్టెంబర్ 22వ తేదీ)న అమెరికా పర్యటనకు బయల్దేరారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 24న ఇరువురు నేతలు అమెరికా రాజధాని వాషింగ్టన్లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో అఫ్గానిస్తాన్ తాజా పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలపై పోరాటం, భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించబోతున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మంగళవారం చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ భారత ప్రధానితో భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురూ చర్చించనున్నట్లు శ్రింగ్లా వెల్లడించారు. మోదీ బుధవారం అమెరికాకు పయనమవుతారని, ఈ నెల 26న భారత్‌కు తిరిగి వస్తారని చెప్పారు. బైడెన్‌తో సమావేశం కావడంతోపాటు ఈ నెల 24న వాషింగ్టన్లో ‘క్వాడ్’ నేతల సదస్సులో పాల్గొంటారని, 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 76వ సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. గురువారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో చర్చలు జరుపుతారని వివరించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వాతావరణ మార్పులు తదితర అంశాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులతోనూ ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేపట్టాల్సిన సంస్కరణలు బైడెన్–మోదీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందన్నారు. అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంటుందని అన్నారు. ఈ పర్యటనలో పలువురు వ్యాపారవేత్తలతో మోదీ సమావేశమవుతారని శ్రింగ్లా పేర్కొన్నారు. -
వాతావరణ పోరుపై పటిష్ట కార్యాచరణ
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పులపై పోరాటానికి వేగవంతమైన పటిష్ట కార్యాచరణ అవసరమని భారత ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతటా ఈ కార్యాచరణ పెద్ద ఎత్తున సాగాలని సూచించారు. ఈ సవాలును ఎదిరించే విషయంలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులపై అగ్రరాజ్యం అమెరికా గురువారం నిర్వహించిన వర్చవల్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 40 దేశాల అధినేతలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. కరోనా అనంతరం ఆర్థిక రథం మళ్లీ పట్టాలెక్కాలంటే మూలాలకు మళ్లడం (బ్యాక్ టు బేసిక్స్)అవసరమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, తాను కలిసి ‘ఇండియా–యూఎస్ క్లైమేట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్నర్షిప్’ను ప్రారంభించినట్లు తెలిపారు. వాతావరణ మార్పులు అందరినీ భయపెడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రకృతి మాత ఇక ఎంతో కాలం వేచి చూడలేదని, మనకు హరిత గ్రహం (గ్రీన్ ప్లానెట్) కావాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సదస్సులో వ్యాఖ్యానించారు. -
విబేధాలు రాజేయడం మానుకోవాలి: చైనా
బీజింగ్: భారత్-అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై డ్రాగన్ దేశం స్పందించింది. బీజింగ్‌తో పాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మధ్య విబేధాలు రాజేయడం మానుకోవాల్సిందిగా అమెరికాని కోరింది. చైనా బెదిరింపుల నేపథ్యంలో మైక్ పాంపీయో, భారత్‌తో పాటు ఇతర దక్షిణాసియా దేశాల్లో పర్యటించడం గురించి చైనా స్పందన ఏంటని బీజింగ్ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్‌ని ప్రశ్నించగా.. చైనాపై ఆరోపణలు చేయడం మైక్ పాంపియోకు కొత్త కాదని తెలిపారు. ఆయన పదే పదే వాటిని పునరావృతం చేశాడన్నారు. (చదవండి: అమెరికా ‘వ్యూహాత్మక’ చెలిమి) ఈ సందర్భంగా వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. ‘పాంపియో ఆరోపణలు నిరాధరమైనవి. ఆయన వ్యాఖ్యలు చూస్తే ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, సైద్ధాంతిక పక్షపాతం భావజాలానికి అతుక్కుపోతున్నట్లు తెలుస్తోంది. కానీ మేం మాత్రం ఆయన ప్రచ్ఛన్న యుద్ధం, జీరో సమ్ గేమ్ మనస్తత్వాన్ని విడనాడాలని కోరుతున్నాము. చైనా, ప్రాంతీయ దేశాల మధ్య అసమ్మతిని రగల్చడం, శాంతి, స్థిరత్వాలను అణగదొక్కాలని చూస్తున్నారు’ అని మండి పడ్డారు. భారత్, అమెరికా రెండు దేశాల మధ్య మైలురాయిగా నిలిచే బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) పై సంతకం చేసిన తర్వాత వాంగ్ వెన్బిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బెకా ఉన్నత స్థాయి సైనిక సాంకేతిక పరిజ్ఞానం, వర్గీకృత ఉపగ్రహ డేటా మరియు ఇరు దేశాల మధ్య క్లిష్టమైన సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. (చదవండి: భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు) ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోన్న సంగతి తెలిసిందే. భారత పర్యటన తరువాత, పాంపియో శ్రీలంక, మాల్దీవులను సందర్శించనున్నారు. -
నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య నేడు ఒక కీలకమైన రక్షణ రంగ ఒప్పందం కుదరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ సహా ఇరుదేశాల సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందం ఇది అని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ టీ ఎస్పర్ మధ్య సోమవారం జరిగిన చర్చల సందర్భంగా దీనిపై ఒక అంగీకారం కుదిరినట్లు తెలిపాయి. ఇరుదేశాల మధ్య రక్షణ సహా వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సహకారం పెంపొందించుకోవడం మొదలైన అంశాలపై ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరిపారని, చైనాతో సరిహద్దు వివాదం అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చిందని వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)’ ఒప్పందం కుదరడంపై రాజ్‌నాథ్, ఎస్పర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపాయి. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం పరస్పర విస్తృత ప్రయోజనకర అంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్(నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా(ఎయిర్‌ఫోర్స్), డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులున్నారు. భారత్, అమెరికాల మధ్య నేడు(మంగళవారం) ప్రారంభం కానున్న 2+2 కీలక మంత్రిత్వ స్థాయి చర్చల కోసం మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ 2+2 చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, జైశంకర్ పాల్గొననున్నారు. ద్వైపాక్షిక సహకారంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతం విషయంలో పరస్పర సహకారం అంశంపై కూడా వారు చర్చించనున్నారు. అమెరికా మంత్రులు పాంపియో, ఎస్పర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌ను కూడా కలవనున్నారు. యూఎస్ రక్షణ మంత్రి ఎస్పర్‌కు రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద త్రివిధ దళాలు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భార త్, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ 2+2 చర్చలు జరుగుతుండటం గమనార్హం. భారత్‌తో సరిహద్దు ఘర్షణలు, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి ప్రయత్నాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఎదుర్కొన్న తీరు.. తదితర అంశాలపై అమెరికా ఇప్పటికే పలుమార్లు చైనాను తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటనకు ముందు.. ‘ప్రాంతీయ, ప్రపం చ శక్తిగా భారత్ ఎదగడాన్ని అమెరికా స్వాగతిస్తోంది’ అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. 2016లో అమెరికా భారత్‌ను ‘ప్రధాన రక్షణ రంగ భాగస్వామి’గా ప్రకటించి, రక్షణ రంగ సహకారంలో విశ్వసనీయ మిత్రదేశం హోదా కల్పించింది. ఎస్పర్‌కు స్వాగతం పలుకుతున్న రాజ్‌నాథ్ -
పెట్టుబడులకు భారత్ అత్యుత్తమం: మోదీ
న్యూఢిల్లీ: కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ సుస్ధిరత, విధాన కొనసాగింపు భారత్‌ను పెట్టుబడిదారులకు అత్యుత్తమ కేంద్రంగా రూపొందించిందన్నారు. అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని (యూఎస్– ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్) ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. సంస్కరణల రంగంలో ఇటీవలి కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలను ఈ సందర్భంగా ప్రధాని వారికి వివరించారు. ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సులభతర వాణిజ్యం దిశగా, అనుమతుల్లో అనవసర జాప్యం లేని విధంగా సంస్కరణలు చేపట్టామన్నారు. ప్రస్తుత కరోనా ముప్పు పరిస్థితిని ఎదుర్కొనేందుకు వినూత్నంగా, మానవ సంక్షేమం కేంద్రంగా ఆలోచించాలన్నారు. భారత్ అలాగే ఆలోచించి.. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రికార్డు సమయంలో దేశంలో వైద్య వసతులను సమకూర్చుకోగలిగిందన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఉద్యమంలా ప్రచా రం చేసిన తొలి దేశాల్లో భారత్ ఒకటని మోదీ గుర్తు చేశారు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న దేశంలోని పేద ప్రజల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ను ప్రారంభించామన్నారు. ఈ పథకంలో భాగంగా, దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామన్నారు. -
ఆయన అమెరికా- భారత్‌ల మధ్య బంధానికి కెప్టెన్
వాషింగ్టన్: భారత రాయబారి హర్షవర్దన్ ష్రింగ్లాకు అమెరికా ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అందులో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని శ్వేతసౌధంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం వేగవంతం చేయడానికి సహకరించినందుకు ట్రంప్‌కు ష్రింగ్లా కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు భారత రాయబారికి అక్కడి విదేశాంగశాఖలోని దక్షిణ, మధ్య ఆసియా విభాగం అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్ ప్రత్యేకంగా వీడ్కోలు పలికారు. ఉభయ దేశాల మధ్య బంధానికి ష్రింగ్లా కెప్టెన్‌గా వ్యవహరించారని కొనియాడారు. భారత విదేశాంగశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ష్రింగ్లా.. ఉభయ దేశాల మైత్రి బలోపేతానికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. అంతకుముందు అమెరికా ప్రొటోకాల్ చీఫ్ హ్యాండర్సన్.. బ్లెయిర్ హౌజ్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విదేశాంగశాఖ కార్యదర్శి ఉన్న విజయ్ గోఖలే పదవీకాలం జనవరి 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 23న ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 29న విదేశాంగశాఖ కార్యదర్శిగా ష్రింగ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1984 బ్యాచ్‌కు చెందిన హర్షవర్ధన్ ష్రింగ్లా అనేక పదవులను అధిరోహించారు. ఆయన 35 ఏళ్ల సర్వీసులో బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలలో భారత హైకమిషనర్‌గా సేవలందించారు. A final goodbye! pic.twitter.com/AMvqROEaL2 — Harsh V Shringla (@HarshShringla) January 12, 2020 -
దేశం విడిచి వెళ్లండి: అమెరికా
వీసా కేసులో దేవయానికి అమెరికా ఆదేశం భారత్ ప్రతిచర్య.. అమెరికా దౌత్యవేత్త ‘బహిష్కరణ’ ఖోబ్రగడేపై నేరాభియోగాలు నమోదు చేసిన అమెరికా కోర్టు యూఎన్ మిషన్‌కు దేవయూని బదిలీకి ఎట్టకేలకు యూఎస్ ఆమోదం న్యూయూర్క్/న్యూఢిల్లీ: భారత్-అమెరికా దౌత్య సంబంధాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత దౌత్యవేత్త దేవయూని ఖోబ్రగడే (39) ‘వీసా కేసు’లో.. తాజాగా చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలతో ఈ పరిస్థితి తలెత్తింది. దేవయూనిని అమెరికా బహిష్కరించడం, ఇందుకు ప్రతిచర్యగా భారత్ సీనియర్ అమెరికా దౌత్యవేత్త ఒకరిని బహిష్కరించడం.. తదితర పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయూరుు. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిం దిగా దేవయూని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన అమెరికా కోర్టు.. తాజాగా శుక్రవారం ఆమెపై ఈ కేసుకు సంబంధించిన నేరాభియోగాలు నమోదు చేసింది. దీనికిముందు.. అరెస్టు నేపథ్యంలో భారత్ దేవయూనిని ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేయడాన్ని అమెరికా ఎట్టకేలకు ఆమోదించింది. తద్వారా ఆమెకు పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయూల్సిందిగా కోరిన అమెరికా.. భారత్ అందుకు నిరాకరించడంతో ఖోబ్రగడేను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయూని న్యూ యూర్క్ నుంచి భారత్‌కు పయనమయ్యూరు. రాత్రి 9.40 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రతి చర్య చేపట్టింది. న్యూఢిల్లీలోని పేరు తెలియని డెరైక్టర్ స్థారుు (దేవయూని హోదాతో సమానమైన హోదా) అమెరికా దౌత్యవేత్తను బహిష్కరించింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఆయన పేరు వెల్లడి కానప్పటికీ పనిమనిషి రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి అమెరికాకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన దౌత్యవేత్తపైనే బహిష్కరణ వేటు పడినట్లు సమాచారం. అరుుతే ‘బహిష్కరణ’ అనే పదాన్ని ఉపయోగించేందుకు భారత అధికారులు నిరాకరించారు. అమెరికా ఎంబసీలోని ఓ దౌత్యవేత్తను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కార్యాలయూన్ని కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించారుు. భారత్ ఈ విధంగా ‘దెబ్బకు దెబ్బ’ వంటి చర్య తీసుకోవడం ఇది రెండోసారి. 33 ఏళ్ల క్రితం అమెరికా ప్రభాకర్ మీనన్ అనే భారత దౌత్యవేత్తను బహిష్కరించినప్పుడు.. ఇండియూ కూడా ఢిల్లీలోని అమెరికా పొలిటికల్ కాన్సులర్‌ను బహిష్కరించింది. దేవయూనిపై అమెరికా కోర్టు నేరారోపణలు నమోదు చేయడాన్ని భారత్ ఓటమిగా బీజేపీ అభివర్ణించింది. అమెరికాలో కేసు పెండింగ్‌లోనే ఉంటున్నందున ఇది మన ఓటమేనని, విజయం కాదని బీజేపీ నేత, మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. అభియోగాలు అలాగే ఉంటారుు: యూఎస్ అటార్నీ పూర్తిస్థారుు దౌత్యరక్షణ ఉన్న నేపథ్యంలో దేవయూని భారత్ తిరిగి వెళ్తున్నప్పటికీ దేవయూనిపై మోపిన అభియోగాలు అలాగే ఉంటాయని అమెరికా కోర్టు విస్తృత ధర్మాసనం (గ్రాండ్ జ్యూరీ) స్పష్టం చేసింది. దౌత్య రక్షణ లేకుండా దే వయూని కనుక అమెరికా తిరిగివచ్చిన పక్షంలో విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని యూఎస్ అటార్నీ ప్రీత్ బరారా చెప్పారు. జిల్లా జడ్జి షీరా షీండ్లిన్కు రాసిన లేఖలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా దరఖాస్తుకు సంబంధించిన వ్యవహారంలో.. మోసం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి రెండు నేరాలు కోర్టు దేవయూనిపై మోపినట్టు బరారా వివరించారు. దేవయూనికి దౌత్య రక్షణ హోదా ఇటీవలే కల్పించిన విషయం తమకు తెలుసునని చెప్పారు. పనిమనిషి రిచర్డ్ వీసా దరఖాస్తులో తప్పుడు ధ్రువీకరణలు ఇవ్వడంతో పాటు దేవయూని ఆమెకు తగిన వేతనం చెల్లించడం లేదని, ఇతర ఆరోపణలతో మొత్తం 21 పేజీలతో ఖోబ్రగడేపై చార్జిషీట్ దాఖలైంది. తప్పుడు, ఆధారరహిత అభియోగాలు: దేవయూని తనపై మోపిన అభియోగాలు తప్పు, ఆధార రహితమని 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అరుున ఖోబ్రగడే పేర్కొన్నారు. భారత్‌కు విమానం ఎక్కేముందు ఆమె పీటీఐతో మాట్లాడారు. ఈ పరిణామాలు తన కుటుంబంపై, ముఖ్యంగా ఇప్పటికీ అమెరికాలోనే ఉన్న తన పిల్లలపై ఎలాంటి దుష్ర్పభావాన్నీ చూపబోవని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన భారత విదేశాంగ శాఖ మంత్రికి, సహచరులకు, రాజకీయ నాయకత్వానికి, మీడియూకు.. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన దేశ ప్రజానీకానికి ఆమె కృతజ్ఞత లు తెలిపారు. పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించిన నేపథ్యంలో దేవయూని అమెరికా బయ ట కూడా పర్యటించవచ్చని, ఈ నేపథ్యంలోనే భారత్ వెళుతున్నారని ఆమె తరఫు న్యాయవాది డేనియల్ అర్షాక్ చెప్పారు. మౌనం వీడిన సంగీత దేవయూని ఇటు ఇండియూ విమానమెక్కగానే పనిమనిషి సంగీత రిచర్డ్ మౌనం వీడారు. దౌత్యవేత్త వద్ద పనిచేస్తుండగా తానెన్నో బాధలు పడ్డట్టు చెప్పారు. తనలా బాధలకు గురికాకుండా చూసుకోండంటూ ఇతర పని మనుషులకు సూచించారు. కుటుంబం కోసం కొన్నాళ్లు అమెరికాలో పనిచేసి తిరిగి ఇండియూ వెళ్లిపోవాలనుకున్నట్టు సంగీత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక సంస్థ ‘సేఫ్ హారిజాన్’ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాజీ నిరాకరించిన దేవయూని దేశ సార్వభౌమాధికారాన్ని సమున్నత స్థారుులో నిలిపేందుకు పోరాటం కొనసాగిస్తున్న తన కుమార్తె.. కేసులో రాజీ పడి అమెరికాలోనే ఉండాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనను నిరాకరించినట్లు దేవయూని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శుక్రవారం ఢిల్లీలో తెలిపారు. పనిమనిషికి పరిహారం చెల్లించడం, జరిమానా కట్టడం, దర్యాప్తు చేసిన వ్యక్తికి కూడా చెల్లింపులు చేస్తే ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటామని, తద్వారా అమెరికాలోనే ఉండవచ్చని చెప్పారన్నారు. ఈ రాజీ ప్రతిపాదనను దేవయూని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు. పరిణామాల క్రమం.. వీసా కేసులో డిసెంబర్ 12న దేవయూనిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. దుస్తులు విప్పి మరీ ఆమెను సోదా చేశారు. నేరగాళ్లతో కలిపి లాకప్‌లో ఉంచారు. అరెస్టు నేపథ్యంలో ఆమె పాస్‌పోర్టును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటిన్నర రూపాయల పూచీకత్తుతో ఖోబ్రగడే విడుదలయ్యూరు. దేవయూని అరెస్టు భారత్, అమెరికాల మధ్య వివాదం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఆమెను ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేసింది. తద్వారా ఆమెకు డిప్యూటీ కాన్సులర్ హోదాలో పాక్షిక దౌత్య రక్షణ కాకుండా పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే అమెరికా ఈ విధమైన యూఎన్ గుర్తింపునకు ఆమోదం తెలపకుండా తాత్సారం చేసింది. ఎట్టకేలకు భారత్, అమెరికా ప్రధాన కార్యాలయూల ఒప్పందాన్ని అనుసరించి ఈ నెల 8న దేవయూనికి పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. ఈ నెల 9న ఆ హోదాను రద్దు చేయూల్సిందిగా అమెరికా భారత్‌ను కోరింది. తద్వారా ఖోబ్రగడేను కోర్టులో విచారించేందుకు వీలవుతుందని ఆ దేశం ఆశించింది.