రాణించిన భార్గవానంద్, వెల్‌ఫ్రెడ్
జింఖానా, న్యూస్‌లైన్: పోస్టల్ జట్టు బౌలర్లు భార్గవానంద్ (5/17), లెస్లీ వెల్‌ఫ్రెడ్ (4/18) చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఎఫ్‌సీఐ జట్టుపై గెలుపొందింది. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎఫ్‌సీఐ 68 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ రెండే వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. చంద్రకాంత్ 30 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో ఇండియన్ ఎయిర్‌లై న్స్ జట్టు 5 వికెట్ల తేడాతో నేషనల్ ఇన్సూరెన్స్ జట్టుపై విజయం సాధించింది.
మొదట బరిలోకి దిగిన నేషనల్ ఇన్సూరెన్స్ 101 పరుగులకే చేతులెత్తేసింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ బౌలర్లు సత్యనారాయణ 4 వికెట్లు తీసుకోగా... ప్రభు కిరణ్, సతీష్ కుమార్ తలా మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నేషనల్ ఇన్సూరెన్స్ 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. దీపక్ (37 నాటౌట్), జతిన్ మెహతా (34) మెరుగ్గా ఆడారు. నేషనల్ ఇన్సూరెన్స్ బౌలర్ సిద్ధు 3 వికెట్లు తీసుకున్నాడు.
మరో మ్యాచ్‌లో వీఎస్టీ జట్టు 3 వికెట్ల తేడాతో ఏపీ హైకోర్ట్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. మొదట వీఎస్టీ 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. పాల్ సింగ్ 33 పరుగులు చేశాడు. ఏపీ హైకోర్ట్ బౌలర్ విజయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఏపీ హైకోర్ట్ 7 వికెట్లకు 108 పరుగులు చేసింది. పండరీనాథ్ (43) ఫర్వాలేదనిపించాడు. వీఎస్టీ బౌలర్ అనీసుద్దీన్ 3 వికెట్లు పడ గొట్టాడు.