indian american doctor
-
అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్
వాషింగ్టన్: అమెరికా ఆరోగ్య శాఖ (సెక్రెటరీ ఆఫ్ హెల్త్), హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియర్ బసెరా ఎంపికయ్యారు. అలాగే, భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేసుకున్నారు. కోవిడ్–19 విషయంలో అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా డాక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధుల నియంత్రణ కేంద్రాల డైరెక్టర్‌గా డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ, కోవిడ్–19 ఈక్విటీ టాస్క్‌ఫోర్స్ అధినేతగా డాక్టర్ మార్సెలా నూనెజ్ స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరోగ్య రంగంలో కరోనా మహమ్మారి రూపంలో అమెరికా అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జో బైడెన్ పేర్కొన్నారు. మహమ్మారిని అదుపు చేసి, జన జీవనం ఎప్పటిలాగే కొనసాగే వాతావరణం కల్పించాల్సి ఉందన్నారు. హెల్త్ కేర్ టీమ్‌లోని నిపుణుల సూచనల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తిని కచ్చితంగా నియంత్రిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెడతామని కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వెల్లడించారు. హావియర్ బసెరా ప్రస్తుతం కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక డాక్టర్ వివేక్ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికాస్ డాక్టర్ అనే పదవిలో ఉన్నారు. జో బైడెన్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్–19 ట్రాన్సిషన్ అడ్వైజరీ బోర్డు కో–చైర్మన్‌గా ఉన్నారు. -
డబ్బు కోసం భారత బిలియనీర్ ఏం చేశాడంటే...
వాషింగ్టన్: భారత అమెరకన్ ఫార్మా బిలియనీర్ జాన్ నాథ్ కపూర్ (74)ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. క్యాన్సర్ రోగులకు వాడే నొప్పి నివారణ ఓపియడ్‌ను ప్రిస్కైబ్ చేయాలని డాక్టర్లకు ముడుపులు ముట్టచెప్పడం,కుట్ర అభియోగాలను కపూర్‌పై నమోదు చేశారు. అమృత్‌సర్‌లో జన్మించిన కపూర్ 1960లో భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆయన ప్రస్తుతం ఫార్మా కంపెనీ ఇన్సిస్ థెరాప్యుటిక్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది 20,000 మంది పైగా అమెరికన్లు ఒపియడ్ ఓవర్‌డోస్‌లు తీసుకోవడం వల్ల మరణించడంతో కపూర్ నిర్వాకంపై అమెరికా అధికారులు సీరియస్‌గా ఉన్నారు. లక్షలాది అమెరికన్లు ఈ ప్రమాదకర డ్రగ్‌కు అడిక్ట్ అయ్యారు. దీనికి బాధ్యులైన వీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఒపియడ్ విక్రయాలపై యూఎస్ ఉక్కుపాదం మోపడంతో కపూర్ బృందం వైద్యులకు లంచాలు ఆఫర్ చేసి ఈ డ్రగ్‌ను ప్రిస్కైబ్ చేసేలా వ్యవహరించింది. లాభాల కోసం బీమా కంపెనీలనూ రీఎంబర్స్మెంట్ వచ్చేలా వీరు ఒత్తిడి తీసుకువచ్చినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. డబ్బు కోసం నీచానికి ఒడిగట్టే ఈ ఇండియన్ అమెరికన్ న్యూయార్స్ స్టేట్ యూనివర్సిటీ నుంచి మెడిసినల్ కెమిస్ర్టీలో పీహెచ్డీ పొందాడు. బాంబే వర్సిటీ నుంచి ఫార్మసీలో బీఎస్ చేశాడు. -
అన్నవాహిక పునర్నిర్మాణం
వాషింగ్టన్: బాగా దెబ్బతిన్న అన్నవాహికను తొలిసారిగా అమెరికా వైద్యులు పునర్నిర్మించారు. మెటల్ స్టెంట్స్, చర్మ కణజాలాలను వాడి బాగు చేశారు. ఈ వైద్య బృందంలో భారత సంతతి వైద్యుడు కుల్విందర్ దువా కూడా ఉన్నారు. మెటల్ స్టెంట్స్‌ను తాత్కాలిక అన్నవాహికగా మార్చి, దీనికి చర్మం నుంచి సేకరించిన కణజాలాన్ని జోడించి 5 సెం.మీల మందంతో రోగి అన్నవాహికలో అమర్చారు. ఇందులోని కణజాలం పెరుగుతూ అన్నవాహికను పూర్తిగా పునర్నిర్మిస్తుంది. దీనికోసం రోగి శరీరంలో తగిన ఏర్పాట్లు చేశారు. -
లంచం కేసులో ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలు
అమెరికాలో డయాగ్నస్టిక్ సెంటర్ నడిపిస్తున్న ఓ ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలుశిక్ష పడింది. న్యూజెర్సీలో ల్యాబ్ నడుపుతున్న డాక్టర్ అశోక్ కుమార్ బబారియా (64) రోగులను తన వద్దకు పంపేందుకు కొంతమంది వైద్యులకు లంచాలు ఇచ్చిన కేసులో ఈ శిక్ష పడింది. అమెరికా జిల్లా జడ్జి క్లైర్ సి సెచి ఎదుట వాదనలు జరగగా, అందులో అశోక్ కుమార్ నేరం నిరూపితమైంది. దీంతో ఆయనకు 46 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు విడుదలైన తర్వాత మరో మూడు నెలల పాటు ఆయన్ను పరిశీలిస్తూ ఉండాలని జడ్జి ఆదేశించారు. అశోక్ కుమార్ బబారియాకు 25వేల డాలర్ల జరిమానా విధించి, మరో 2 మిలియన్ డాలర్లు జప్తుచేయాల్సిందిగా ఆదేశించారు. లైసెన్సు గల రేడియాలజిస్టు అయిన అశోక్ కుమార్.. న్యూజెర్సీలో ఆరంజ్ కమ్యూనిటీ ఎంఆర్ఐ సెంటర్ నడిపిస్తున్నారు. ఆ సెంటర్‌కు రోగులను పంపినందుకు గాను వైద్యులకు లంచాలు చెల్లించి, దాదాపు 2 మిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించినట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు ఆరోపించాయి. ఒక ఎమ్మారై కేసు పంపితే ఒక్కో డాక్టర్‌కు సుమారు 100 డాలర్ల వరకు లంచం ఇచ్చేవారన్నాయి.అలాగే అల్ట్రా సౌండ్ లేదా డెక్సా స్కాన్ కేసు పంపితే 25 డాలర్లు ఇచ్చేవారట. -
ఒబామాకు ప్రధాన వైద్యునిగా భారతీయుడు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఇంకో భారతీయుడికి పెద్దపీట వేశారు. డాక్టర్ వివేక్ హళ్లెగెరె మూర్తిని తన ప్రధాన వైద్యుడిగా నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు. డాక్టర్స్ ఫర్ అమెరికా అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన డాక్టర్ మూర్తి.. ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మహిళల ఆస్పత్రిలో అధ్యాపక వృత్తిలో ఉన్నారు. అసమాన ప్రతిభాపాటవాలు కలిగిన డాక్టర్ మూర్తి అమెరికన్లకు తన సేవలు సమర్ధంగా అందించగలరన్న విశ్వాసం తనకుందని, ఆయన తన కొత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోతారని ఒబామా అన్నారు. ఈ నిర్ణయాన్ని ఎన్నారై వైద్యులు సాదరంగా స్వాగతించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ పూర్తి చేశారు. డాక్టర్ మూర్తిని ప్రధాన వైద్యునిగా నియమించడం ద్వారా ఒబామా సరైన నిర్ణయం తీసుకున్నారని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) అధ్యక్షుడు డాక్టర్ జయేష్ బి.షా అన్నారు.