Indian American student
-
గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు మృతి
వాషింగ్టన్: శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి దూకి 16 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వంతెన వద్ద బాలుడి సైకిల్, మొబైల్ ఫోన్, బ్యాగు కనిపించినట్లు తల్లిదండ్రులు, అమెరికా కోస్టల్ గార్డ్ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 4.58 నిమిషాలకు గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి నదిలోకి ఎవరో దూకినట్లు అందిన సమాచారం మేరకు కోస్టల్ గార్డ్స్ సుమారు రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవటంతో బాలుడు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలుడు 12వ తరగతి చదువుతున్నట్లు కోస్టల్ గార్డ్ అధికారులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునేందుకు భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన వారు గోల్డెన్ గేట్ పైనుంచి దూకటం ఇది నాలుగో సంఘటనగా తెలిపారు కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భుటోరియా. బ్రిడ్జ్ రైల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద ఆత్మహత్యలను నిరోధించే విషయంలో పని చేస్తోంది. గతేడాది ఇక్కడ 25 మంది ఆత్మహత్య చేసుకున్నారని, 1937లో వంతెన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,000 ఆత్మహత్య ఘటనలు జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు.. బ్రిడ్జ్‌పై ఆత్మహత్యలను నిరోధించేందుకు ఇరువైపులా 20 అడుగుల ఎత్తులో ఇనుప కంచెను కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే, ఈ ఏడాది జనవరిలోనే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణ వ్యయం పెరగడంతో జాప్యం జరిగింది. ఇదీ చదవండి: బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లే! -
టైమ్ ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ఇండో అమెరికన్ బాలిక
న్యూయార్క్: 15 ఏళ్ల ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత టైమ్ మేగజీన్ ఆ బాల శాస్త్రవేత్తను ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తించింది. తాగునీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు.. తదితర సమస్యలకు గీతాంజలి రావు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని ‘టైమ్’ ప్రశంసించింది. 5 వేల మందితో పోటీ పడి ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ తొలి ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గుర్తింపును ఆమె సాధించింది. టైమ్ మేగజీన్ కోసం ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఆంజెలినా జోలి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేశారు. ‘గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం’ ఇదే తన ప్రయోగ విధానమని జోలీకి ఆమె వివరించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సృజనాత్మక, శాస్త్రీయ దృక్పథం గల యువతతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్న తన ఆశయాన్ని వెల్లడించారు. ‘కనిపించిన ప్రతీ సమస్యను పరిష్కరించాలనుకోవద్దు. మిమ్మల్ని బాగా కదిలించిన సమస్యపై దృష్టిపెట్టండి’ అని ఆమె సహచర యువతకు పిలుపునిచ్చారు. ‘నేను చేయగలిగానంటే.. ఎవరైనా చేయగలరు’ అని స్ఫూర్తినిచ్చారు. పాత తరం ఎదుర్కొన్న సమస్యలతో పాటు కొత్త సమస్యలను తన తరం ఎదుర్కొంటోందని ఆమె వివరించారు. అందరినీ సంతోషంగా చూడాలనుకోవడం తన ఆశయమన్నారు. మార్పు కోసం సైన్స్‌ను ఎలా వాడాలన్న ఆలోచన తనకు రెండో, లేదా మూడో తరగతిలో ఉండగానే వచ్చిందని తెలిపారు. -
సచిన్ కుమార్ కు ఐదేళ్ల జైలు
న్యూయార్క్: అమెరికాలో ఆన్ లైన్ మోసానికి పాల్పడిన భారతీయ విద్యార్థి ఒకరు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించనున్నాడు. నిందితుడు సచిన్ కుమార్(22) స్టబ్ హబ్ వెబ్ సైట్ లో మారు పేర్లతో నకిలీ ఈవెంట్ టికెట్లు అమ్మి సొమ్ములు చేసుకున్నట్టు విచారణలో రుజువైంది. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ తంపాలో ప్రీ-డెంటల్, బయాలజీ చదువుతున్న కుమార్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మడం ద్వారా అతడు 49,121 డాలర్లు దక్కించుకున్నాడు. బాధితులకు న్యాయం చేసేందుకు స్టబ్ హబ్ 172,047 డాలర్లు చేయాల్సివచ్చింది. ఈ కేసులో తెర వెనుక మరికొందరి హస్తం ఉందని, కుమార్ కేవలం పాత్రధారుడు మాత్రమేనని అతడి లాయర్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అతడిని కోర్టు దోషిగా తేల్చింది. కారు ప్రమాదంలో అతడు గాయపడడంతో అతడికి జైలు శిక్ష అమలు చేయలేదు. కోలుకున్న తర్వాత జైలు శిక్ష గురించి చెప్పనున్నారు. -
అదృష్యమైన భారతీయ విద్యార్ధి ఆచూకీ తెలిపితే15 వేల డాలర్లు
న్యూయార్క్: అమెరికా రాష్ట్రం ఇల్లినాయిస్ లో ఫిబ్రవరి 12 తేదిన అదృష్యమైన భారతీయ విద్యార్ధి ఆచూకీని తెలిపితే 15 వేల డాలర్లను బహుమతిగా ఇస్తామని బాధిత కుటుంబం ప్రకటించింది. సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో క్రిమినల్ జస్టిస్ విద్యను అభ్యసిస్తున్న ప్రవీణ్ ఎం వర్గీస్ ఫిబ్రవరి 12 తేదిన రాత్రి 11 గంటల తర్వాత కనిపించకుండా పోయినట్టు షికాగో ట్రిబ్యున్ కథనంలో వెల్లడించింది. తన సోదరుడు ఫిబ్రవరి 13 తేది మధ్యాహ్నం 12.30 గంటలకు షికాగో నగరంలోని తన స్నేహితుడికి పోన్ చేసినట్టు కాల్ డేటా వెల్లడించిందని ప్రియావర్గీస్ తెలిపింది. ఎవరితోనో గొడవ పెట్టుకుంటూ పరిగెత్తినట్టు తన సోదరుడు స్నేహితుడొకరు తెలిపారని ప్రియా చెప్పారు. ' జరుగుతుందో అర్ధం కావడం లేదు' అనే సందేశాలు ఫిబ్రవరి 12 తేది 11.06 నిమిషాలకు ట్విటర్ లో పోస్ట్ చేసినట్టు తెలుసుకున్నామని ప్రియా తెలిపింది.