indian american woman
-
కాబోయే డాక్టర్‌కు ‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’ కిరీటం (ఫొటోలు)
-
Miss India USA 2023: కాబోయే డాక్టరమ్మకు అందాల కిరీటం
‘అందమే ఆనందం’ అనుకోవడంతో పాటు ‘ఆనందమే అందం’ అనుకునే రిజుల్ మైని మిచిగాన్ (యూఎస్)లో మెడికల్ స్టూడెంట్. ఈ ఇండో– అమెరికన్ స్టూడెంట్ ‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’ కిరీటాన్ని గెలుచుకుంది... ‘మిస్ ఇండియా యూఎస్ఏ’ టైటిల్ గెలుచుకోవడానికి 25 రాష్ట్రాల నుంచి 57 మంది పోటీ పడ్డారు. ‘వినయంతో, ఒకింత గర్వంతో నేను మిస్ ఇండియా యూఎస్ఏ 2023 అని చెబుతున్నాను. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయం సాధ్యం అయ్యేది కాదు. నా ప్రయాణంలో అడుగడుగునా స్నేహితులు అండగా నిలిచారు. విలువైన సూచనలు ఇచ్చారు’ అంటుంది రిజుల్ మైని. ఇరవై నాలుగు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ రిజుల్ మైని తనను తాను మెడికల్ స్టూడెంట్, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. సర్జన్ కావాలనేది తన లక్ష్యం. స్కూలు రోజుల నుంచి చదువుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో, కళలు, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు అంతే ప్రాధాన్యత ఇచ్చేది రిజుల్. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ‘హ్యుమన్ సైకాలజీ’లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన రిజుల్‌కు ఖాళీ సమయం అంటూ ఉండదు. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. ఆమె హాబీల జాబితాలో పెయింటింగ్, కుకింగ్, గోల్ఫింగ్... ఇలా ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛంద కార్యక్రమాలలోనూ ముందుంటుంది. వైద్యానికి సంబంధించిన సరికొత్త విషయాలు, పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోవడం అంటే ఇష్టం. ‘కళ అనేది మనసులోని మాలిన్యాన్ని శుభ్రం చేస్తుంది’ అనే మాట రిజుల్ మైనికి ఇష్టం. అందుకేనేమో ఆమెకు కళలు అంటే అంత ఇష్టం. కళలు ఉన్నచోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే అందం. ఆనందం. -
గూగుల్‌తో పోటీ: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. సీవీపీగా అపర్ణ చెన్నప్రగడ
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ అమెరికన్ మహిళ అపర్ణ చెన్నప్రగడ (Aparna Chennapragada) నియమితులయ్యారు. టెక్ పరిశ్రమలో విశేష అనుభవమున్న ఆమెకు కీలకమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన అపర్ణకు ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది. గూగుల్‌లో సుమారు 12 ఏళ్లు పనిచేశారు. స్టాక్ ట్రేడింగ్ యాప్ రాబిన్‌హుడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన ఆమె మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ డిజైనర్లో జెనరేటివ్ ఏఐ ప్రయత్నాలకు నాయకత్వం వహించనున్నారు. (TCS Headcount Drops: టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..) లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అపర్ణ చెన్నప్రగడ ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో టీటెక్ చేశారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని, మిట్ నుంచి మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని పొందారు. ప్రముఖ ఈబే (eBay) సంస్థలో కన్స్యూమర్ షాపింగ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ఏఆర్, విజువల్ సెర్చ్ ప్రోడక్ట్‌లకు లీడ్‌గా, బోర్డు మెంబర్‌గా కూడా అపర్ణ పనిచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అపర్ణకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా యూఎస్ చెందిన బిజినెస్ పబ్లికేషన్ ‘ఇన్ఫర్మేషన్’ నివేదించింది. అపర్ణ నియామకానికి ముందు మరో భారతీయ-అమెరికన్ రోహిణి శ్రీవత్స సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియాలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. పునీత్ చందోక్ ఆగస్టులో భారతదేశం, దక్షిణాసియాకు మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. -
కన్సాస్ సెనేటర్‌గా ఉషా రెడ్డి
హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు. మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది. -
అమెరికా: మరో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత సంతతి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న అధ్యక్షుడు జో బైడెన్.. మరో ఇండియన్ అమెరికన్ మహిళకు అరుదైన గౌరవం ఇచ్చారు. సర్య్కూట్ కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వహిస్తున్న భారత సంతతి మహిళ షాలినా డీ కుమార్‌ను మిచిగాన్ తూర్పు ప్రాంత ఫెడరల్ కోర్టు చీఫ్ జస్టిస్‌గా జో బైడెన్ నియమించారు. ఆమె 2007 సంవత్సరం నుంచి ఓక్లాండ్ కౌంటీ ఆరవ కోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. 2018లో సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా ఆమెను మిచిగన్ సుప్రీం కోర్టు నియమించింది. మిచిగాన్‌లో దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి ఫెడరల్ న్యాయమూర్తి షాలినా అని వైట్ హౌస్ తెలిపింది. షాలినా ప్రధాన న్యామూర్తి విధుతో పాటు సివిల్, క్రిమినల్ విషయాలను కూడా పరిశీలిస్తారని వైట్ హైస్ తెలిపింది. షాలినా 1993లో మిచిగాన్ విశ్వవిద్యాలయం, 1996లో డెట్రాయిట్ మెర్సీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయమూర్తి జీన్ష్నెల్జ్ పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి మిచిగాన్‌లోని ఓక్లాండ్ కౌంటీలోని 6వ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా 2007లో షాలినా నియమితులయ్యారు. చదవండి: బైడెన్ టీమ్ మరో భారతీయ మహిళా కిరణం -
ట్వీట్లతో సీటుకి చేటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. బడ్జెట్ చీఫ్‌గా భారతీయ అమెరికన్ నీరా టాండన్(50) నియామకంపై మద్దతు కూడగట్టడంలో అధికార పార్టీ , ఆయన కేబినెట్ విఫలమైంది. నీరా టాండన్ నియామకాన్ని ధ్రువీకరించడానికి అవసరమైన ఓట్లు సెనేట్‌లో పొందడం అసాధ్యమని తేలిపోవడంతో ఆమె నియామకంపై బైడెన్ వెనక్కి తగ్గారు. చేసేదేమిలేక నీరా టాండన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) డైరెక్టర్ పదవికి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా మంగళవారం బైడెన్‌కు లేఖ రాశారు. టాండన్ గతంలో ఎందరో ప్రజాప్రతినిధులపై ట్వీట్ల దాడి చేశారు. వారిని వ్యక్తిగతంగా కించపరుస్తూ ఎన్నో ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు ఆమె అదవికి ఎసరు తెచ్చిపెట్టాయి. ఆమె మాటల దాడిని ఎదుర్కొన్న వారిలో రిపబ్లికన్లతో పాటుగా సొంత పార్టీకి చెందిన డెమొక్రాట్లు ఉన్నారు. దీంతో నీరా వెయ్యికి పైగా ట్వీట్లను తొలగించి సెనేటర్లకి క్షమాపణ చెప్పినప్పటికీ వారి ఆగ్రహం చల్లారలేదు. మొత్తం 23 కేబినెట్ హోదా పదవులకుగాను 11 పదవులకి అధ్యక్షుడి నామినేషన్‌తో పాటుగా కాంగ్రెస్‌లో ఉభయ సభల అనుమతి ఉండాలి. ఆమె నియామకంపై సొంత పార్టీలో వ్యతిరేకత రావడంతో బైడెన్ వెనక్కి తగ్గారు. ‘నీరా టాండన్ విజ్ఞప్తి మేరకు నామినేషన్ బడ్జెట్ చీఫ్‌గా ఆమె నామినేషన్‌ను ఉపసంహరణకు అంగీకరిస్తున్నా’ అంటూ బైడెన్ ప్రకటన విడుదల చేశారు. అయితే నీరా ప్రతిభ, అనుభవంపై తనకు ఎనలేని గౌరవం ఉందన్న బైడెన్ ఆమెకు మరో పదవి ఇస్తామని చెప్పారు. అంతకు ముందు నీరా టాండన్ అధ్యక్షుడికి రాసిన లేఖలో ‘‘నా మీద మీరు ఉంచిన నమ్మకం జీవితంలో నాకు దక్కిన అపురూపమైన గౌరవం’ అని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో వివాదాల్లో నీరా నీరా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఏ అంశంపైన అయినా సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. అదే ఆమెకు ఎందరు అభిమానుల్ని తెచ్చిపెట్టిందో అంత మంది శత్రువుల్ని చేసింది. ఒబామా హయాంలో ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన ఒబామా హెల్త్ కేర్ రూపకర్తల్లో నీరా ముఖ్యభూమిక పోషించారు. బిల్ క్లింటన్, హిల్లరీల తరఫున ఎన్నికల ప్రచారాన్ని చేశారు. హిల్లరీ క్లింటన్ సహాయకురాలిగా ఉన్నారు. నీరా తల్లిదండ్రులు భారతీయులు. ‘ప్రభుత్వం పంపిణీ చేసే ఆహార కేంద్రాల్లో తినీ తినక నా తల్లి నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు అలాంటి ప్రభుత్వ పథకాల అమలు నా చేతుల మీదుగా జరుగుతుంది’ అని ఆమె ట్వీట్ చేశారు. గత నాలుగేళ్లలో నీరా టాండన్ తనకి నచ్చని వారిపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రిపబ్లికన్ సెనేటర్ కాలిన్స్ని ‘ది వరస్ట్’ అని, మరో సెనేటర్ మిచ్ మెక్‌కన్నెల్‌ను ‘మాస్కో మిచ్’, ‘వోల్డ్‌మార్ట్’ అని నిందిస్తూ ట్వీట్లు చేశారు. 100 సీట్లు ఉండే సెనేట్‌లో చెరి 50 స్థానాలతో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సరిసమానమైన బలంతో ఉండడం, సొంత పార్టీకి చెందిన డెమొక్రాట్లు ఆమెకు మద్దతు తెలపడానికి నిరాకరించడంతో పదవి అందలేదు. -
బైడెన్ టీమ్ మరో భారతీయ మహిళా కిరణం
అమెరికాలో 20 లక్షల 80 వేల మంది ‘ఫెడరల్’ ఉద్యోగులు ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు కొత్త బాస్ మన భారతీయ మహిళ కిరణ్ అహూజా! స్వయంగా బైడెనే తన ఎంపికగా ఆమెను నియమించారు. ‘ఉద్యోగుల ప్రియబాంధవి’ గా ఆమెకు ఎంత మంచి పేరుందంటే యూఎస్‌లోని అన్ని వర్గాల ఉద్యోగులూ ‘ఈ తరుణంలో జరగవలసిన నియామకం’ అని బైడెన్‌ని అభినందిస్తున్నారు. కిరణ్ అహూజాకైతే ఈ అభినందనలు ఆమె ‘లా’ డిగ్రీ పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటినుంచీ పుష్పగుచ్చంలా చేతికి అందుతూ ఉన్నవే! పాలనలోని అన్ని విభాగాలు, చట్టసభలు, రక్షణ రంగంలోని సిబ్బంది అంతా యూఎస్‌లో ఫెడరల్ సిబ్బందే. ఉద్యోగులుగా అభ్యర్థుల నియామకం మొదలు, పదవీ విరమణ వరకు వారి జీతాలు, సర్వీసులు, పదోన్నతులు, సంక్షేమ సదుపాయాలు, సౌకర్యాలు.. వీటన్నిటినీ యూ.ఎస్.లోని ఒ.పి.ఎం. చూస్తుంటుంది. ఒ.పి.ఎం. అంటే ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్మెంట్. సిబ్బంది నిర్వహణ కార్యాలయం. ప్రధాన కేంద్రం వాషింగ్టన్ డీసీలో ఉంది. ఆ ఒ.పి.ఎం. కే ఇప్పుడు భారత సంతతికి చెందిన కిరణ్ అర్జున్‌దాస్ అహూజా డైరెక్టర్‌గా వెళ్లబోతున్నారు. సెనెట్ ఆమె నియామకాన్ని ఆమోదించగానే ఒ.పి.ఎం. ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక అమెరికన్ ఉద్యోగుల బాగోగులన్నీ కిరణ్‌వే. కిరణ్‌నే ఈ పదవిలో నియమించడానికి తగినన్ని కారణాలే ఉన్నాయి. అధికార శ్రేణిలోని పదోన్నతి అంచెలలో భాగంగా చూస్తే.. కిరణ్ రెండున్నరేళ్ల పాటు 2015 నుంచి 2017 వరకు ఒ.పి.ఎం. డైరెక్టర్‌కు ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా పని చేశారు కాబట్టి పై అంచెగా ఆమె డైరెక్టర్ అయ్యారని అనుకోవాలి. అయితే అది మాత్రమే ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లిందని చెప్పడానికి లేదు. 49 ఏళ్ల కిరణ్.. పౌరహక్కుల న్యాయవాది. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవల సంస్థలకు నేతృత్వం, నాయకత్వం వహించిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం ఆమె యూఎస్‌లోని పరోపకార సంస్థల ప్రాంతీయ యంత్రాంగం అయిన ప్రసిద్ధ ‘ఫిలాంథ్రోఫీ నార్త్‌వెస్ట్’ కు సీఈవోగా ఉన్నారు. ఒబామా అధ్యక్షుడిగా, బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆరేళ్లపాటు ఏషియన్ అమెరికన్లకు ప్రాధాన్యం ఇచ్చి, వారికి మెరుగైన అవకాశాలను కల్పించే ‘వైట్ హౌస్ ఇనీషియేటివ్’ కార్యక్రమానికి కిరణ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆనాటి ఆమె పని తీరును బైడెన్ ప్రత్యక్షంగా చూడటం కూడా ఇప్పుడీ అత్యంత కీలకమైన ఒ.పి.ఎం. డైరెక్టర్ పదవికి ఆమె నామినేట్ అయేందుకు దోహదపడింది. 2003–2008 మధ్య నేషనల్ ఏషియన్ పసిఫిక్ ఆమెరికన్ ఉమెన్స్ ఫోరం వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె అందించిన సేవలూ ఈ కొత్త పదవికి అవసరమైనవే. పౌరహక్కుల న్యాయవాదిగా కిరణ్ కెరీర్ ఆరంభం కూడా అత్యంత శక్తిమంతమైనది. స్కూల్ సెగ్రెగేషన్ మీద (బడులలో పిల్లల్ని జాతులవారీగా వేరు చేసి కూర్చొబెట్టడం), జాతివివక్ష వేధింపుల మీద ‘యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్’లో కేసు వేసిన తొలి న్యాయ విద్యార్థిని ఆమె. ∙∙ కిరణ్ అహూజా జార్జియా రాష్ట్రంలోని సవానాలో పెరిగారు. ఆమె తల్లిదండ్రులు డెబ్బైలలో ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడినవారు. జార్జియా యూనివర్సిటీలోనే ఆమె ‘లా’ లో పట్టభద్రురాలయ్యారు. ఒ.పి.ఎం.లో ట్రంప్ చేసి వెళ్లిన అవకతవకల్ని సరిచేసేందుకే బైడెన్ ఈ పోస్ట్‌లో ఆమెను నియమించారని ‘వాషింగ్టన్ పోస్ట్’ రాసింది. అమెరికాకు మరొక ఆశా కిరణం అనే కదా అర్థం. కిరణ్ అర్జున్‌దాస్ అహూజా -
బైడెన్ బృందంలో మరో కశ్మీరీ మహిళ
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్ మూలాలు ఉన్న సమీరా ఫాజిలికి జాతీయ ఆర్థిక మండలి(ఎన్ఈసీ)లో చోటు లభించింది. ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమె కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆమె నియామకానికి సంబంధించి గురువారం బైడెన్ బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌కు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా, వినయ్ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా బైడెన్ టీంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా గౌతమ్ రాఘవన్, కశ్మీరీ మహిళ ఈషా షా(వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్) కూడా కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు సమీర కూడా ఈ జాబితాలో చేరారు. (చదవండి: జో బైడెన్ కీలక ప్రతిపాదన, 100 రోజుల్లోనే..) ఒబామా అనుచరురాలిగా గుర్తింపు న్యూయార్క్‌లోని విలియమ్స్‌విల్లేలో సమీరా ఫాజిలి జన్మించారు. ఆమె తల్లిదండ్రులు యూసఫ్, రఫీకా ఫాజిలూ. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె.. హార్వర్డ్ కాలేజీ, యేల్ లా స్కూల్ నుంచి ఉన్నత విద్య పూర్తిచేశారు. యేల్ లా స్కూళ్లో లెక్చరర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె కన్జూమర్, హౌజింగ్, చిరు వ్యాపారాలు, మైక్రోఫైనాన్స్ తదితర విభాగాల్లో పనిచేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుచరురాలిగా గుర్తింపు పొందారు. ఇక సమీర ఫాజిలి గతంలో.. అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఆర్థికాభివృద్ధి డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఎన్ఈసీ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించారు. అదే విధంగా ఒబామా హయాంలో డొనెస్టిక్ ఫినాన్స్, విదేశీ వ్యవహారాల సీనియర్ అడ్వైజర్‌గా బాధ్యతలు నెరవేర్చారు. ఇక ఇప్పుడు అమెరికాలో కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులు కానున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సతీమణి, కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్ బృందంలో భారతీయ మహిళకు కీలక పదవి దక్కింది. భారత సంతతికి చెందిన గరీమా వర్మను జిల్ బైడెన్ డిజిటల్ డైరెక్టర్‌గా నియమించినట్లు సమాచారం -
బైడెన్ డిజిటల్ టీంలోకి కశ్మీరి మహిళ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మరో భారతీయురాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌గా మరో భారతీయురాలిని నియమించారు. కశ్మీర్లో జన్మించిన ఈషా షాను ఈ పదవికి ఎంపికచేశారు. డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్‌గా రాబ్ ప్లాహెర్టీ నేతృత్వం వహించనున్నట్లు బైడెన్ ట్రాన్సిషన్ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. లూసియానాలో పెరిగిన షా గతంలో బైడెన్-హారిస్ ప్రచారంలో డిజిటల్ భాగస్వామ్య నిర్హాకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అడ్వాన్స్మెంట్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు జాన్ఎఫ్ కెన్నడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కార్పోరేట్ ఫండ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గాను, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సంస్థ బ్యూరు కమ్యూనికేషన్ స్పెషలిస్ట్‌గానూ పనిచేశారు. (చదవండి: భారత్‌తో చెలిమికే బైడెన్ మొగ్గు!) ఇక ఇప్పటికే బైడెన్ తన టీంలో కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌లకు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా, వినయ్ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమించగా.. గౌతమ్ రాఘవన్‌కి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి జాబితాలో ఈషా షా కూడా చేరారు. -
కమల మీడియా కార్యదర్శిగా ఇండో అమెరికన్
వాషింగ్టన్: డెమొక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమాలా హ్యారిస్ ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన కమల తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మీడియా కార్యదర్శిగా ఇండో-అమెరికన్ సంతతికి చెందిన సబ్రినా సింగ్ (32)ను నియమించుకున్నారు. సబ్రినా గతంలో ఇద్దరు డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షిల్ అభ్యర్థుల వద్ద అధికార ప్రతినిధిగా పనిచేశారు. న్యూజెర్సీ సెనేటర్ కోరీ బుకర్, న్యూయార్క్ మాజీ మేయర్ మైక్ బ్లూమింగ్ వద్ద ఆమె పనిచేశారు. కాగా, డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. ఆమె తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). (కమలా గెలిచినట్టే.. తమిళనాడులో వెలసిన పోస్టర్లు) -
సియాటిల్‌లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం
వాషింగ్టన్/లండన్: అమెరికాలో మరోసారి జాతివివక్షకు నిరసగా ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో చివరకు ఇద్దరు నల్లజాతీయులు జార్జ్ ఫ్లాయిడ్, రేషార్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిరసనలు ఎక్కువయ్యాయి. సియాటిల్‌లో జరుగుతున్న ‘బ్లాక్‌లైవ్స్ మ్యాటర్’ ఆందోళనలకు 46 ఏళ్ల భారతీయ అమెరికన్ క్షమా సావంత్ నేతృత్వం వహిస్తున్నారు. సియాటెల్ డౌన్‌టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్‌పై ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణేలో పుట్టి ముంబైలో చదువుకున్న క్షమా సావంత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను గమనించిన తాను ఆర్థిక శాస్త్రాన్ని చదివానని అందులోనే పీహెచ్డీ చేశానని ఆమె తెలిపారు. 2006లో సోషలిస్ట్ ఆల్టర్నేటివ్‌లో చేరి 2013లో సిటీ కౌన్సిల్ ఉమెన్‌గా ఎన్నికయ్యారు. బ్రిటన్‌లో జాతివివక్షపై కమిషన్.. బ్రిటన్‌లో జాతివివక్ష సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జాతివివక్షకు ఫుల్స్టాప్ పెట్టే విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.. జార్జి ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ అమెరికాలోని లాస్ఏంజెలెస్లోని హాలీవుడ్లో ‘ఆల్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులు -
యూఎస్ కాంగ్రెస్ బరిలో మంగ అనంతత్ములా
వాషింగ్టన్ : అమెరికా చట్ట సభ బరిలో భారత సంతతికి చెందిన అమెరికన్ మహిళ నిలిచారు. ఐవీ లీగ్ పాఠశాలలో అసియా ప్రజలపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మంగ అనంతత్ములా వర్జీనియా స్టేట్ నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన ఆమె ఇప్పటికే రక్షణ సంబంధిత కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సెనేట్ పోటీకి సంబంధించి మంగ ఇప్పటికే 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి రిపబ్లిక్ పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. తద్వారా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు పోటీ చేస్తున్న మొదటి భారత సంతతి అభ్యర్ధిగా నిలిచారు. ఈమె ఇటీవలే హెర్న్‌డన్ నుంచి తన ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. సంపన్న జీవితాన్ని విడిచి.. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన మంగ.. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించంచారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం భర్త ఉన్నత చదువుల నిమిత్తం కుమారుడితో కలిసి అమెరికాకు వెళ్లారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంపన్న కుటుంబంలో జన్మించిన తాను.. భర్త చదువుల కోసం విలాసవంతమైన జీవితాన్ని వదిలి అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతినిధుల సభకు ఎన్నికైతే అమెరికా ఇండియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ట్యాక్స్‌లను తగ్గించేందుకు, మహిళల హక్కుల కోసం పోరాడుతానని తెలిపారు. ఆరోగ్య రంగాన్ని మెరుగు పరుస్తానని, చిన్న, మధ్య తరహ పరిశ్రయలను అభివృద్ధి పరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమాజానికి, ముఖ్యంగా అమెరికాలోని హిందువుల తరఫున పోరాడుతానని తెలిపారు. అదే విధంగా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ మహళ ప్రమీలా జయపాల్‌ను అనంతత్ములా విమర్శించారు. కాంగ్రెస్‌లో కశ్మీర్ అంశంపై తీర్మానం చేసినందుకు ఆమెపై మండిపడ్డారు. ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్ సభ్యుడు జెర్రీ కొన్నోలీని నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓడిస్తానని అనంతత్ములా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారులు ఈ సారి పెద్ద సంఖ్యలో రిపబ్లికన్ పార్టీలోకి మారుతున్నారు. వర్జీనియాలోని హెర్న్ డన్ డెమొక్రాటిక్ కంచుకోట కోట అని చెప్పవచ్చు. హెర్న్‌డన్ దాదాపు 17 శాతం ఆసియా ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ఏడు శాతం భారతీయ సంతతికి చెందినవారు ఉన్నారు. -
'భారత్‌లోనే పుట్టాను.. వీడలేని బంధం నాది'
వాషింగ్టన్: భారత్ తనకు చాలా ముఖ్యమైన దేశమని భారతీయ సంతతికి చెందిన మహిళ ప్రమీల జయపాల్ అన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఆమె ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ హౌజ్‌కు ఎన్నికైన తొలి భారతీయ మహిళ కూడా ఆమెనె. ఈ సందర్భంగా ఆమె తొలిసారి భారత్‌తో అమెరికాకు ఉండబోయే సంబంధాల విషయంలో మాట్లాడారు. తాను మహాత్మా గాంధీ జన్మించిన నేలలో జన్మించానని, భారత్‌కు తనకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. భారత్‌కు పేదరికం నుంచి క్లీన్ ఎనర్జీ వరకు అన్ని రకాలుగా అమెరికా మద్దతు ఉంటుందని అన్నారు. 'నేను భారత్ లోనే జన్మించాను. నాకు భారత్ కు చాలా గాఢ సంబంధం ఉంది. మా అమ్మనాన్నలు అక్కడే ఉన్నారు. బెంగళూరులో ఉంటారు. నా కుమారుడు అక్కడే జన్మించాడు. భారత్ కు అమెరికాకు మధ్య ఉంది కేవలం రాజకీయ సంబంధమే కాదు.. చాలా వ్యక్తిగత సంబంధం కూడా' అని ఆమె అన్నారు. చెన్నైలో జన్మించిన ప్రమీల ఐదేళ్లప్పుడే ఇండోనేషియాకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ ఆ తర్వాత పదహారేళ్లకు అమెరికాకు వచ్చారు. ప్స్తుతం ఆమె వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు. -
అత్తగారి హత్యకేసు.. ఎన్నారై మహిళకు విముక్తి
తన అత్తగారిని హత్యచేసిన కేసులో ఎన్నారై మహిళను అమెరికా జైలు నుంచి విడుదల చేశారు. 2012లో జరిగిన ఈ హత్య.. కేవలం మొదటి డిగ్రీ హత్య మాత్రమేనని భావించడంతో ఆమెను కాలిఫోర్నియాలోని సట్టర్ కౌంటీ జైలు నుంచి విడుదల చేశారు. తన గర్భంలో ఉన్నది ఆడ శిశువని తెలియడంతో తన అత్త బల్జీత్ కౌర్ అబార్షన్ చేయించాలని చూసిందని, అందుకే ఆమెను హత్య చేయాల్సి వచ్చిందని నిందితురాలు బల్జీందర్ కౌర్ తన న్యాయవాది మని సిద్ధు ద్వారా కోర్టుకు తెలిపారు. 2012 అక్టోబర్ 24న ఈ హత్య జరిగింది. తన అత్తగారు తనకు అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లిందని, అయితే అక్కడ తాను నిరాకరించానని బల్జీందర్ కౌర్ చెప్పారు. లింగవివక్షతో తన గర్భస్థ శిశువు అంతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కౌర్ పోరాడారని, లేనిపక్షంలో పదికోట్ల మంది భారతీయ గర్భస్థ శిశువుల్లాగే ఈమె శిశువు కూడా మరణించి ఉండేదని సిద్ధు వాదించారు. ఏప్రిల్ 25న బల్జీందర్ కౌర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో ఉండగానే ఆమె తన రెండో కుమార్తెకు జన్మనిచ్చారు. ఆమెను తాము నిర్దోషిగా కాక.. నేరం చేయలేదని భావించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 15న విచారణ ప్రారంభమై ఏడు రోజుల్లో ముగిసింది.