యూఎస్‌ కాంగ్రెస్‌ బరిలో మంగ అనంతత్ములా | Indian American Woman Will Run For US Congress From Virginia | Sakshi
Sakshi News home page

యూఎస్‌ కాంగ్రెస్‌కు భారత సంతతి మహిళ పోటీ

Published Sat, Feb 8 2020 6:51 PM | Last Updated on Sat, Feb 8 2020 8:09 PM

Indian American Woman Will Run For US Congress From Virginia - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా చట్ట సభ బరిలో భారత సంతతికి చెందిన అమెరికన్‌ మహిళ నిలిచారు. ఐవీ లీగ్‌ పాఠశాలలో అసియా ప్రజలపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మంగ అనంతత్ములా వర్జీనియా స్టేట్‌ నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన ఆమె ఇప్పటికే రక్షణ సంబంధిత కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సెనేట్ పోటీకి సంబంధించి మంగ ఇప్పటికే 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి రిపబ్లిక్ పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. తద్వారా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు పోటీ చేస్తున్న మొదటి భారత సంతతి అభ్యర్ధిగా నిలిచారు. ఈమె ఇటీవలే హెర్న్‌డన్‌ నుంచి తన ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. 

సంపన్న జీవితాన్ని విడిచి..
ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన మంగ.. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించంచారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం భర్త ఉన్నత చదువుల నిమిత్తం  కుమారుడితో కలిసి అమెరికాకు  వెళ్లారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంపన్న కుటుంబంలో జన్మించిన తాను.. భర్త చదువుల కోసం విలాసవంతమైన జీవితాన్ని వదిలి అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. 

ప్రతినిధుల సభకు ఎన్నికైతే అమెరికా ఇండియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ట్యాక్స్‌లను తగ్గించేందుకు, మహిళల హక్కుల కోసం పోరాడుతానని తెలిపారు. ఆరోగ్య రంగాన్ని మెరుగు పరుస్తానని, చిన్న, మధ్య తరహ పరిశ్రయలను అభివృద్ధి పరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  సమాజానికి, ముఖ్యంగా అమెరికాలోని హిందువుల తరఫున పోరాడుతానని తెలిపారు. 

అదే విధంగా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్‌ మహళ ప్రమీలా జయపాల్‌ను అనంతత్ములా విమర్శించారు. కాంగ్రెస్‌లో కశ్మీర్‌ అంశంపై తీర్మానం చేసినందుకు ఆమెపై మండిపడ్డారు. ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు జెర్రీ కొన్నోలీని నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓడిస్తానని అనంతత్ములా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారులు ఈ సారి పెద్ద సంఖ్యలో రిపబ్లికన్ పార్టీలోకి మారుతున్నారు. వర్జీనియాలోని హెర్న్‌ డన్‌ డెమొక్రాటిక్ కంచుకోట కోట అని చెప్పవచ్చు. హెర్న్‌డన్‌ దాదాపు 17 శాతం ఆసియా ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ఏడు శాతం భారతీయ సంతతికి చెందినవారు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement