indian badminton stars
-
తొలి టైటిల్ లక్ష్యంగా సింధు, సైనా
బాసెల్: కొత్త సీజన్లో తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంగా భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నారు. నేడు మొదలయ్యే ఈ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో సింధుకు సులువైన ‘డ్రా’ ఎదురుకాగా... సైనాకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. రెండో సీడ్‌గా పోటీపడుతున్న ప్రస్తుత ప్రపంచ చాంపియన్ సింధు తొలి రౌండ్లో టర్కీ క్రీడాకారిణి, ప్రపంచ 29వ ర్యాంకర్ నెస్లిహాన్ యిజిట్తో ఆడునుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. పదేళ్ల క్రితం నెస్లిహాన్తో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ జూనియర్ చాలెంజ్ టోర్నీలో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు వరుస గేముల్లో గెలిచింది. మరోవైపు ప్రపంచ 19వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో థాయ్‌లాండ్ అమ్మాయి, ప్రపంచ 31వ ర్యాంకర్ ఫిటాయాపోర్న్ చైవాన్‌తో తలపడుతుంది. 2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో చైవాన్‌తో ఆడిన సైనా వరుస గేముల్లో నెగ్గింది. సైనా తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో తలపడే అవకాశముంది. ఒకే పార్శ్వంలో సింధు, సైనా ఉండటంతో క్వార్టర్ ఫైనల్‌ను దాటితే ఈ ఇద్దరు భారత స్టార్స్ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎనిమిది మంది పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రణయ్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్, పారుపల్లి కశ్యప్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ధ్రువ్ కపిల –అర్జున్... మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప –సాత్విక్ సాయిరాజ్... సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు బరిలో ఉన్నాయి. -
సత్తాకు పరీక్ష
అద్వితీయ ప్రదర్శనతో విశ్వవిజేతగా అవతరించి... అన్ని వర్గాల నుంచి ఆత్మీయ సత్కారాలు, స్వాగతాలు అందుకొని... కొత్త చరిత్ర మధుర క్షణాలను ఆస్వాదించి... మూడు వారాలుగా బిజీబిజీగా గడిపిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనుంది. నేడు మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఈ తెలుగు తేజం టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం పక్కాగా సిద్ధమై అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న సింధు... చైనా గడ్డపై రెండోసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఇక నుంచి సింధు ఆటతీరును ఆమె ప్రత్యర్థులు నిశితంగా గమనించే అవకాశం ఉంది. సరికొత్త వ్యూహాలతో ఈసారీ తన ప్రత్యర్థులకు సింధు చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి. చాంగ్జౌ (చైనా): భారత బ్యాడ్మింటన్ స్టార్స్ మరో సమరానికి సిద్ధమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, మాజీ రన్నరప్ సైనా నెహా్వల్... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్, కశ్యప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్విట్జర్లాండ్‌లో గత నెలలో ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొంటున్న తొలి టోర్నమెంట్ ఇదే కానుంది. కాస్త కఠినమే... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో సీడ్‌గా, సైనా నెహ్వాల్ ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌తో సింధు... ప్రపంచ 19వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫన్ (థాయ్‌లాండ్)తో సైనా ఆడతారు. లీ జురుయ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 3–3తో సమంగా ఉండగా... సైనా 3–1తో బుసానన్‌పై ఆధిక్యంలో ఉంది. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన లీ జురుయ్ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయతి్నస్తోంది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్ టోరీ్నలో లీ జురుయ్‌తో ఆడిన సింధు మూడు గేమ్‌లపాటు పోరాడి గెలిచింది. గత నెలలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు పక్కా ప్రణాళికతో సిద్ధమైన సింధు చైనా ఓపెన్‌లోనూ సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉంది. 2016లో ఈ టోరీ్నలో విజేతగా నిలిచిన సింధు అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయాలని భావిస్తోంది. తొలి రౌండ్ గట్టెక్కితే సింధుకు క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ చెన్ యుఫె (చైనా), సెమీస్‌లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా సైనా ఎదురయ్యే అవకాశముంది. గాయం నుంచి కోలుకున్న రెండుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ ఈ టోరీ్నలో ఆడుతోంది. గతవారం వియత్నాం ఓపెన్‌లో మారిన్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో మారిన్ ఆడుతుంది. ఇదే పార్శ్వంలో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్), మాజీ విశ్వవిజేత రచనోక్ (థాయ్‌లాండ్) ఉన్నారు. కోచ్ కిమ్ జీ హ్యున్ లేకుండానే... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత మహిళల సింగిల్స్ కోచ్ కిమ్ జీ హ్యున్ (దక్షిణ కొరియా) చైనా ఓపెన్‌కు జట్టు వెంట వెళ్లడం లేదు. తన భర్త ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె స్వదేశం వెళ్లిపోయింది. ఆమె తిరిగి జట్టుతో ఎప్పుడు చేరుతుందనే అంశంపై స్పష్ట మైన సమాచారం లేదు. కనీసం రెండు వారాలపాటు ఆమె తన కుటుంబంతో ఉండే అవకాశముంది. సాయిప్రణీత్ జోరు కొనసాగేనా... పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి నలుగురు ఎంట్రీలు పంపించినా... మోకాలి గాయం కారణంగా కిడాంబి శ్రీకాంత్... డెంగీ జ్వరంతో ప్రణయ్ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో భారత్ ఆశలన్నీ సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌పై ఆధారపడ్డాయి. పురుషుల సింగిల్స్‌లో 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్య పతకం నెగ్గిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సాయిప్రణీత్ ఈ టోర్నీలో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. తొలి రౌండ్లో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్ ఆడతాడు. తొలి రౌండ్లో గెలిస్తే రెండో రౌండ్లో మూడో సీడ్ షి యు కి (చైనా)తో సాయిప్రణీత్ ఆడే చాన్స్ ఉంది. కశ్యప్ తొలి రౌండ్లో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో తలపడతాడు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సుమీత్ రెడ్డి–మను అత్రి జోడీలు పోటీ పడనున్నాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ జంటలు బరిలో ఉన్నాయి. -
సైనా, కశ్యప్ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ పారిస్: చైనా అడ్డంకిని అధిగమించడంలో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ విఫలమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో కశ్యప్ 15-21, 21-13, 13-21తో ఐదో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో; ఐదో సీడ్ సైనా 19-21, 21-19, 15-21తో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 15-10తో ఆధిక్యంలో ఉన్నా... అనూహ్యంగా తడబడి షిజియాన్‌కు వరుసగా 11 పాయింట్లు కోల్పోయి చేజేతులా ఓడటం గమనార్హం. అంతకుముందు గురువారం జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 21-19, 21-18తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హువీ తియాన్ (చైనా)ను ఓడించడం విశేషం. మరోవైపు శ్రీకాంత్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ఆరో సీడ్ క్రిస్టియన్ విటిన్‌గస్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 20-22, 14-21తో ఓడిపోయాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో ఐదో సీడ్ సైనా 21-19, 21-16తో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)ను ఓడించింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 6-21, 8-21తో ఏడో సీడ్ జియోలి వాంగ్-యాంగ్ యు (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. ఏడు స్థానాలు ఎగబాకి... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్, కశ్యప్ ఏడేసి స్థానాల చొప్పున పురోగతి సాధించారు. తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ 23 నుంచి 16వ స్థానానికి... కశ్యప్ 28 నుంచి 21వ స్థానానికి చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంక్‌కు చేరుకోగా... సింధు 10వ స్థానంలోనే ఉంది. -
ఫైనల్ ‘షాట్’
ముంబై: ఒకరిదేమో నిలకడ.. మరొకరిదేమో సంచలనం. అంతర్జాతీయ యవనికపై భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్... పి.వి.సింధుల నేపథ్యం ఇది. అలాంటి వీరిద్దరు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తొలి ట్రోఫీ కోసం మరోసారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. శనివారం ఇక్కడి ఎన్ఎస్సీఏ స్టేడియంలో జరిగే ఫైనల్లో హైదరాబాద్ హాట్‌షాట్స్, అవధ్ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఓవరాల్‌గా ఈ పోటీలో హాట్‌షాట్స్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... సింధు బృందం నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సైనా... మరో విజయంపై దృష్టిపెట్టింది. అలాగే కీలకమైన సమయంలో సహచరులను ప్రోత్సహిస్తూ జట్టును ముందుండి నడిపిస్తోంది. ఆగస్టు 15న సింధుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ప్రపంచ నాలుగో ర్యాంకర్ సులువుగా గెలిచినా... ఈసారి మాత్రం ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన తప్పకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచస్థాయి క్రీడాకారిణిలను ఓడించిన సింధు కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. గతంలోలాగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ గెలుపుపైనే హైదరాబాద్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రెండో సింగిల్స్‌లో తనోంగ్సుక్ సత్తా చాటేందుకు సిద ్ధంగా ఉన్నాడు. డబుల్స్‌లో షెమ్ గో, వాహ్ లిమ్; మిక్స్‌డ్‌లో తరుణ్ కోనా-ప్రద్న్యా గాద్రె ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోవైపు సింధు కూడా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. సైనాను ఓడిస్తే మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి గెలుపే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగుతోంది. అయితే సింధు నిరాశపర్చినా... మిగతా మ్యాచ్‌ల్లో గెలిచే ఆటగాళ్లు ఉండటం అవధ్‌కు లాభిస్తోంది. శ్రీకాంత్ సంచనలం సృష్టిస్తే.. గురుసాయిదత్ రెండో సింగిల్స్‌లో ఓడినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డబుల్స్, మిక్స్‌డ్‌లో మార్సిస్ కిడో విశేషంగా రాణిస్తున్నాడు. ఇతనికి మథియాస్ బోయే, పియా బెర్నాడెత్ల నుంచి మంచి సహకారం అందుతోంది. ఏదేమైనా ఇరుజట్లలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండటంతో పోటీ రసవత్తరంగా జరగడం ఖాయం. ఫైనల్‌కు చేరారిలా హాట్‌షాట్స్ 3-2తో అవధ్‌పై గెలుపు 2-3తో ఢిల్లీ చేతిలో ఓటమి 4-1తో పుణేపై గెలుపు 3-2తో ముంబైపై గెలుపు 2-3తో బంగాబీట్స్ చేతిలో ఓటమి 3-0తో పుణేపై గెలుపు (సెమీస్) అవధ్ వారియర్స్ 2-3తో హాట్‌షాట్స్ చేతిలో ఓటమి 1-4తో బంగా బీట్స్ చేతిలో ఓటమి 4-1తో ఢిల్లీపై గెలుపు 3-2తో ముంబైపై గెలుపు 3-2తో పుణేపై గెలుపు 3-2తో ముంబైపై గెలుపు (సెమీస్)