indian citizen
-
పూంచ్‌లో మరణించిన బాధిత కుటుంబాలకు రాజ్‌నాథ్ సింగ్ పరామర్శ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై బుధవారం సమీక్షించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ అధికారుల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను కలిశారు. ఈ సంఘటనపై దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా రాజ్‌నాథ్ వెంట ఉన్నారు. అలాగే రాజౌరీ జిల్లాలో సైనికుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పౌరులను పరమర్శించారు. కాగా డిసెంబర్ 21న జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సైనికులతో కూడిన రెండు వాహనాలు వెళుతుండగా.. ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. వెంటనే సైనికులు ప్రతిదాడి చేయగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. అనంతరం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిర్బంధ తనిఖీలతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఉగ్రదాడిపై దీనిపై విచారణ జరపడానికి సైన్యం ఘటనాస్థలి వెళ్లింది. సమీపంలోని గ్రామం నుంచి 8 మంది పౌరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ముగ్గురు తోపాపీర్ ప్రాంతంలో చనిపోయి కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఆర్మీ అంతర్గత విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్ములో పర్యటించారు. పూంచ్, రజౌరీలో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అధికారులు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.అయితే వీరు ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి ముందు పౌరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆర్మీకి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భారత పౌరులను బాధపెట్టే ఏ పొరపాట" ఆర్మీ చేయలేదని అన్నారు. ‘మీరు దేశ రక్షకులు. అయితే దేశ భద్రతతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకునే బాధ్యత కూడా మీపై ఉందని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేశ పౌరులను బాధపెట్టే తప్పులు మీరు చేయకూడదు’ అని తెలిపారు. -
చెన్నమనేని భారత పౌరుడు కాదు
-
భారతదేశ ద్రోహికి అమెరికాలో శిక్ష
రెనో: భారతీయుడై ఉండి అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందిన ఓ సిక్కు వ్యక్తి అమెరికాలో కటకటాల పాలయ్యాడు. అతడు భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు సహాయపడ్డాడని అక్కడి జిల్లా కోర్టు నిర్ధారించడంతో దాదాపు 15 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించనున్నాడు. బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతడిది వాస్తవానికి పంజాబ్. ఖలిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పంజాబ్‌లో పేలుళ్లకు పాల్పడే కుట్రతోపాటు భారత అధికారులను హత్య చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అందుకు కావాల్సిన సామాగ్రిని కూడా అతడే పంపిణీ చేశాడు. తమ ప్రణాళిక అమలుకు సంబంధించి ఫోన్ ద్వారా మాట్లాడాడు. అయితే, కొన్నాళ్లుగా అతడి చర్యలను గమనించిన అమెరికా అధికారులు.. 2013 డిసెంబర్లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. దానికి సంబంధించి చివరి వాదోపవాదాలు మంగళవారం కోర్టు ముందుకు రాగా అతడు నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ‘భారత్ వంటి విదేశాల్లో ఉగ్రవాద దాడులతో హింసకు పాల్పడేందుకు, జన జీవితాన్ని చెదరగొట్టేందుకు బల్వీందర్ సింగ్ సహాయపడ్డాడు’ అని ఈ సందర్భంగా జడ్జీ స్పష్టం చేశారు. -
గ్రేటర్ 'ఓటరు నమోదు'లో విచిత్రం..
- భారతీయురాలు కాదంటూ దరఖాస్తు తిరస్కరణ - కుషాయిగూడ మీ సేవా కేంద్రం తీరుతో విస్తుపోయిన మహిళ హైదరాబాద్: 'ఓటు మీ హక్కు.. ఆ హక్కు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి' అంటూ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఈసీ చేసిన ప్రచారానికి జాగృతురాలైన ఓ మహిళ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె పుట్టి పెరిగింది ఈ గడ్డపైనే. విదేశాలు కాదుకదా పక్క రాష్ట్రం వెళ్లొచ్చిన దాఖలాలూ లేవు. కానీ మీ సేవా వెబ్ పోర్టల్ మాత్రం ఆమెను భారతీయురాలిగా గుర్తించలేదు. హైదరాబాద్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడ, నాగార్జున నగర్ కాలనీకి చెందిన నేరళ్ల అనిత గత నవంబరు 17న కుషాయిగూడలోని మీసేవా కేంద్రంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. ఓటరుగా నమోదయింది లేనిది తెలుసుకునేందుకు సోమవారం అదే మీసేవా కేంద్రానికి వెళ్లింది. అయితే దరఖాస్తు తిరస్కరణకు గురైందని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయింది. ‘మీరు భారతీయురాలు కానందున దరఖాస్తును తిరస్కరిస్తున్నం’ అని కంప్యూటర్ లో కనిపించడంతో ఆశ్చర్యపోయింది. 'నేను భారతీయురాలు కాకపోవడమేంటి?' అని అక్కడి సిబ్బందిని ప్రశ్నించింది. సిస్టమ్ ఓకే చెప్పనిదే తామేమీ చేయలేమని వారు బదులిచ్చారు. చేసేదేమీలేక మీసేవ వాళ్లిచ్చిన జిరాక్స్ కాపీతో అక్కడి నుంచి వెళ్లిపోయిందా మహిళ. -
లాహోర్ జైల్లో... ఈ రమేష్ ఎవరు ?
ఖమ్మం : పాకిస్థాన్‌లోని లాహోర్ జైలులో మగ్గుతున్న రమేష్ (20) వివరాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పాక్ సరిహద్దు రేఖ దాటి పాకిస్థాన్ భూభాగంపై అడుగిడిన నేరానికిగాను అతడిని అక్కడి సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని లాహోర్ జైలులో నిర్బంధించారు. ఖైదీలను ఇచ్చిపుచ్చుకునే విషయమై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అక్కడి జైలులో ఉన్న రమేష్ వివరాలను పాక్ ప్రభుత్వం మన దేశ కేంద్రం హోంమంత్రిత్వశాఖకు అందజేసింది. ఆ వివరాలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు కేంద్రం పంపింది. రమేష్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అని ఉంది. కానీ, అతని వివరాలు అక్కడ లభించలేదు. దీందో అతడి ఫొటోలను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పోలీసు శాఖ పంపించింది. ఇతడి ఎత్తు ఐదు అడుగులు ఏడు అంగుళాలు ఉన్నాడని, మెడపై పుట్టు మచ్చ ఉందని పాక్ పంపిన వివరాల్లో ఉంది. ఇతనిని ఎవరైనా గుర్తించినట్లుయితే తన సెల్ సెంబర్ ((94407 95318)కు తెలపాలని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ తెలిపారు.