indian grandpa attacked
-
భారతీయ వృద్ధుడిపై దాడి కేసు చెల్లదట
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వృద్ధుడిపై ఇద్దరు పోలీసులు అత్యంత దారుణంగా దాడిచేసిన కేసును స్థానిక కోర్టు కొట్టిపారేసింది. దాంతోపాటు ఈ కేసును చెల్లని విచారణగా పేర్కొనడం గమనార్హం. గతేడాది ఫిబ్రవరిలో సురేష్ భాయ్ పటేల్ (57) అనే వృద్ధుడిని ఇద్దరు పోలీసు అధికారులు అడ్డుకుని ప్రశ్నించగా... ఆయన ఇంగ్లీష్‌లో సమాధానం ఇవ్వలేకపోయారు. ఆగ్రహించిన పోలీసులు వృద్ధుడిపై దాడిచేయగా, ఓ వ్యక్తి ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. వీడియోతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో దాడికి పాల్పడిన వారిలో ఎరిక్ పార్కర్ అనే అధికారిని సస్పెండ్ చేసి, అరెస్టు చేసి అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. మాడిసన్ నగర పోలీసు చీఫ్ లారీ మున్సీ బాధితుడికి క్షమాపణలు కూడా చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానం చెప్పలేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. ఫెడరల్ చట్టాలను ఏమైనా ఉల్లంఘించారేమో తేల్చేందుకు ఈ విచారణ జరిపారు. అమెరికన్ కోర్టు ఈ చెల్లని కేసును చెల్లని రెండు సార్లు విచారణ చేశామని తాజాగా పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారి, నవంబర్ నెలలో రెండోసారి ఈ కేసు చెల్లదంటూ కింది స్థాయి కోర్టు తీర్పు ఇచ్చింది. తనకు ఇంగ్లీష్ రాదంటూ ఆ వృద్ధుడు చెబుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గతేదాడి ఈ వీడియో యూట్యూబ్‌లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మనవడు పుట్టడంతో చూడాలని.. కొడుకు, కోడలికి సాయంగా ఉండాలని వచ్చిన పటేల్ పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి అప్పటినుంచి చికిత్స పొందుతున్నారు. -
తాతయ్య లేచారు.. మాట్లాడుతున్నారు!
అమెరికాలో ఇద్దరు పోలీసు అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడి, పక్షవాతానికి గురైన భారతీయ వృద్ధుడు సురేష్‌భాయ్ పటేల్ (57) ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన లేచి కూర్చుంటున్నారని, మాట్లాడుతున్నారని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది హెన్రీ ఎఫ్. షెరాడ్ తెలిపారు. సురేష్‌భాయ్ కోలుకోవడానికి మాత్రం చాలా కాలం పడుతుందన్నారు. ఆయన చేతి పట్టు, కుడికాలు బాగున్నాయని, ఎడమకాలు మాత్రం ఇంకా స్వాధీనంలోకి రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన మాట్లాడుతున్నారని, తింటున్నారని చెప్పారు. ఈ దాడిలో ప్రధానంగా చేతులు, కాళ్లమీదే ఎక్కువ ప్రభావం పడిందన్నారు. చిరునామా, గుర్తింపు వివరాలు అడిగినప్పుడు ఇంగ్లీషు భాష సరిగ్గా రాకపోవడంతో సురేష్‌భాయ్ పటేల్ సరిగ్గా చెప్పలేకపోయారు. దాంతో ఇద్దరు పోలీసు అధికారులు ఆయనను కిందపడేసి విపరీతంగా కొట్టారు. ఈ ఘటన ఈనెల 6వ తేదీన మాడిసన్ నగరంలో జరిగింది. కాగా, ఈ దాడిపై ఎన్నారైలు తీవ్రంగా స్పందించారు. ఆయన చికిత్స కోసం ఇప్పటివరకు రూ. 93 లక్షల విరాళాలు సేకరించారు. ఆయనకు ఆరోగ్య బీమా లేకపోవడంతో మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవలే మనవడు పుట్టడంతో కొడుక్కి, కోడలికి సాయంగా వచ్చిన పటేల్‌కు.. ఆరోగ్యబీమా చేయించలేదు. ఆయన చికిత్సకు సుమారు కోటిన్నర వరకు అవుతుందని అంచనా. దాడికి పాల్పడిన వారిలో ఎరిక్ పార్కర్ అనే అధికారిని సస్పెండ్ చేసి, అరెస్టు చేసినా, బెయిల్ మీద విడుదల చేశారు. -
భారతీయ వృద్ధుడిపై దాడి: అమెరికా పోలీసు అరెస్టు
అమెరికాలో భారత సంతతికి చెందిన వృద్ధుడిపై అత్యంత దారుణంగా దాడిచేసిన ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ జరపనుంది. ఫెడరల్ చట్టాలను ఏమైనా ఉల్లంఘించారేమో తేల్చేందుకు ఈ విచారణ జరుపుతారు. సురేష్ భాయ్ పటేల్ (57) అనే వృద్ధుడికి ఇంగ్లీషు రాదు. దాంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. అంతే, ఇద్దరు పోలీసు అధికారులు అతడిని పట్టుకుని దారుణంగా దాడిచేశారు. దీనిపై మాడిసన్ నగర పోలీసు చీఫ్ లారీ మున్సీ క్షమాపణలు చెప్పారు. పటేల్ కుటుంబానికి, ఎన్నారైలు అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని ఆయన అన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానం చెప్పలేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. దాడి చేసిన ఇద్దరిలోపార్కర్ అనే పోలీసు అధికారి మూడో డిగ్రీ దాడికి పాల్పడటంతో అతడిని అరెస్టు చేశామని, ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని సిఫార్సు చేశామని అంటున్నారు. మరోవైపు.. వృద్ధుడిపై దాడి వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. పటేల్ కాళ్లను కాళ్లతో తన్ని కింద పడేసి మరీ కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.