Indian IT services
-
భారత్ ఐటీ సేవల వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎకానమీలు ఎదుర్కొంటున్న సవాళ్లు మధ్యకాలానికి భారతీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధిని నిరోధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. నివేదిక ప్రకారం, భారత్ ఐటీ సేవల పరిశ్రమ అమెరికా మార్కెట్ నుండి 60–65 శాతం ఆదాయాన్ని, అలాగే యూరోపియన్ మార్కెట్ నుండి 20–25 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఈ కీలక ఆపరేటింగ్ మార్కెట్లలో నియంత్రణాపరమైన మార్పులు భారత్ ఐటీ పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటాయి. నివేదికాంశాలను ఐసీఆర్ఏ అసిసెంట్ వైస్ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ దీపక్ జట్వానీ వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సవాళ్లు ఉన్నప్పటికీ, ఐటీ రంగం అవుట్లుక్ను ‘స్టేబుల్’గానే ఉంచడం జరుగుతోంది. పలు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం దీనికి నేపథ్యం. ► ఐటీ కంపెనీలకు కీలకమైన విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇ న్సూరెన్స్) ఒకటి. ఈ విభాగంలో వృద్ధి ఇటీవలి త్రైమాసికాల్లో ఇతర విభాగాల కంటే ఎక్కువగా పడిపోయింది. బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలు భారీగా పెరక్కపోడానికి ఇదీ ఒక కారణమే. ► ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, తయారీ, ఆరోగ్య సంరక్షణ విభాగాల కన్నా తనఖా, రిటైల్ రంగాలు ప్రభావింతం అయ్యే అవకాశం ఉంది. ► పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల వలసలతో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీనితో డిమాండ్–సరఫరాల మధ్య వ్యత్యాసం కనబడుతోంది. ప్రత్యేకించి డిజిటల్ టెక్ విభాగంలో ఈ సమస్య ఉంది. -
'ఐటీ ఇండస్ట్రి పండుగ చేసుకోవాలి'
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల్లో తీసుకుంటున్న కఠిన చర్యలతో భారతీయ ఐటీ సర్వీసులు వణికిపోవాల్సిన పనిలేదని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అమెరికా ఉపాధి కల్పనను తగ్గించుకుంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలే తప్ప దాన్ని కార్మికుల బేరసారాలుగా వ్యాఖ్యానించాల్సిన పనిలేదన్నారు. టీసీఎస్ ఒక ఉత్పత్తులు తయారుచేసే సంస్థగా కాకుండా.. ఖర్చును తగ్గించుకోవడానికి ఎందుకు ఎక్కువగా దృష్టిసారిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా చంద్రశేఖరన్ ఈ సమాధానమిచ్చారు. నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరమ్లో పాల్గొన్న చంద్రశేఖరన్, వివిధ రకాల పరిశ్రమల్లో, భౌగోళిక ప్రాంతాల్లో కొత్త అవకాశాలను ఇండస్ట్రి వెలికి తీయాల్సి ఉందని చెప్పారు. హెచ్-1బీ వీసాలో కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం, వీసా ధరలు పెంచడం ఇవేమి దేశీయ ఐటీ ఇండస్ట్రికి సవాళ్లు కాదని, ఇవి కొత్త కొత్త అవకాశాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఐటీ సర్వీసులు వర్క్ చేసే విధంగా, ఇప్పటికీ వెలికితీయని వాటిని అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హెచ్-1బీ వీసాల్లో నిబంధనలు మార్చిన ప్రతీసారి, దేశీయ ఐటీ ఇండస్ట్రి చిక్కుల్లో పడుతుందని వార్తలు వస్తుంటాయి, కానీ ఇవి పరిశ్రమకు అత్యంత ఉత్తేజకరమని పేర్కొన్నారు. పరిశ్రమను మరింత విస్తరించడానికి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో సహకరిస్తుందన్నారు. ''మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదాన్ని భారతీయులు ఎందుకు రూపొందించలేకపోయారని అడగటం కాదు.. మరో టీసీఎస్ని నీవెందుకు సృష్టించలేకపోయావని మనమే మైక్రోసాఫ్ట్ని ప్రశ్నించాలి'' అని చంద్రశేఖరన్ సవాల్ విసిరారు.