Indian Muslims
-
ఇలాగేనా మాట్లాడేది?
‘‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’’ అని ఒక లౌకికవాద దేశానికి ప్రధానమంత్రి తోటి పౌరుల గురించి మాట్లాడడం తగినదేనా? ‘వారు’ కూడా సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, గ్రహాంతరవాసులూనా? అలా మాట్లాడటాన్ని ఆయన్ని అభిమానించేవారు సమర్థిస్తున్నట్లు్ల అనిపిస్తోంది. లేకుంటే ఆయన అలా అనటాన్ని ఆపి ఉండేవారా? తనను సరిదిద్దుకునేవారా?ప్రధానమంత్రులు ఎల్లవేళలా సరైన, గౌరవ ప్రదమైన పనే చేస్తారన్న భావన ఉన్న యుగంలో నేను పెరిగాను. అంతేకాదు, ప్రధాని చెప్పారంటే ఇక అది సరైనది అయినట్లే! మాటల్లో పొల్లుపోవటం అత్యంత సహజం అయి నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూకు కూడా అలా జరిగేదంటే నా తల్లి తండ్రులు అస్సలు నమ్మేవారు కారు. ఆ పాతకాలపు ప్రామాణికతకు ఆయనొక శ్రేష్ఠమైన నమూనాగా పరిగణన పొందారు. ‘యాభైలు’, ‘అరవైల’ నుంచి మనం చాలా దూరం ప్రయాణించి వచ్చాం. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఊహించరానిదేమీ ఉండదు. ఏ ఉత్కృష్టులైన వారినో పక్కన పెడితే ప్రధానమంత్రులూ ఇక ఏమాత్రం భిన్నమైన వ్యక్తులుగా మిగిలి లేరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి దశాబ్దంలో వారి పట్ల కనిపించిన సహజమైన గౌరవభావన, వారంటే ఉండే కొద్దో గొప్పో ఆరాధన పూర్తిగా కనుమరుగయ్యాయి. ‘సబ్ చోర్ హై’ (అందరూ దొంగలే) అన్నదే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న నమ్మకం అయింది.ఇప్పటికి కూడా, నా అత్యంత నిరాశావాద, చీకటిమయ మనః స్థితుల్లో సైతం– తన సొంత, తోటి పౌరులలో ఒక గణనీయమైన వర్గం మీద ఒక ప్రధాని దాడి చేస్తూ, వారిని పిశాచాలుగా చూపటం వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. అదేపనిగా అందుకోసం మార్గా లను కనుగొంటారని కూడా! ఆయనను అభిమానించేవారు తెలివిగా దీనిని... అదేపనిగా అని కాక, అనేకసార్లు అని అనవచ్చు. ఆయన అలా చేయటాన్ని వారు ఆనందిస్తున్నట్లు, సమర్థిస్తున్నట్లు, సహేతుక మేనని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే కచ్చితంగా ఆయన అలా చేయటాన్ని ఆపి ఉండేవారా? తనను తను సరిదిద్దుకునేవారా? బహుశా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసేవారా? కానీ అలా జరగక పోగా, అవి పునరుద్ఘాటనలు అవుతున్నాయి. బహిరంగంగా, శక్తిమంతంగా, స్థానాలను మార్చుకుంటూ కొనసాగుతున్నాయి. మొదట చెప్పినదానినే ఉన్నది ఉన్నట్లుగా మళ్లొకసారి చెబుతాను. నా ప్రతిస్పందన అర్థంచేసుకోదగినదా లేక అతిశయోక్తితో కూడినదా అని మీకై మీరు ఆలోచించండి. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో వచ్చిన దానిని బట్టి హిందీలో ఆయన మాట్లాడిన మాటలు సరిగ్గా ఇవే: ‘‘పెహ్లే జబ్ ఉన్కీ సర్కార్ థీ, ఉన్హోనే కహా థా కీ దేశ్ కీ సంపతీ పర్ పెహ్లా అధికార్ ముసల్మానోం కా హై. ఇస్కా మత్లబ్, యే సంపతీ ఇకఠ్ఠీ కర్కే కిస్కో బాటేంగే? జిన్కే జ్యాదా బచ్చే హై, ఉన్కో బాటేంగే, ఘుస్పైఠియోన్ కో బాటేంగే. క్యా ఆప్కీ మెహనత్ కీ కమాయి కా పైసా ఘుస్పైఠియోన్ కో దియా జాయేగా? ఆప్కో మంజూర్ హై యే?’’ (‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’)మరి, ‘ఎక్కువమంది పిల్లలను’ కలిగివున్న ఆ వ్యక్తులు ఎవరు? ‘చొరబాటుదారులు’ అని పిలవబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు? స్పష్టంగానే ఉంది కదా, మొదటి వాక్యాన్ని బట్టి ఇంకా స్పష్టంగా లేదా? ఇంకా ఏమైనా సందేహమా? అలాగే పైన పేర్కొన్న ‘ముసల్మా నులు’ ఎవరు? వారు భారతదేశ ముస్లింలు కారా? మన తోటి పౌరులు కారా? సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ కలిగి ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, బయటి వ్యక్తులు, గ్రహాంతరవాసులూనా?ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి? దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే నేను అమాయకుడిని అవుతానా? ఇంకా చెప్పాలంటే కదిలిపోవటానికి ? లేదా ఆ విధమైన ఆరోపణలను మీరు మన ప్రధా నులు ఎవరినుంచైనా విని ఉన్నారా?డోనాల్డ్ ట్రంప్ తరచూ ఇలా మాట్లాడ్డం నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడినప్పుడు మనకు వికారం పుడుతుంది. 1960లలో బ్రిటన్‌లో ఇనాక్ పావెల్ ఇలాగే మాట్లాడితే అక్కడి ఆధిపత్య సమాజ సమూహం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. కానీ మన తరంలోని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్లు, సాధ్వీ రుతంభరలు ఇటువంటి వాక్చాతు ర్యాన్ని ఆస్వాదిస్తారనడంలో సందేహమే లేదు. అయితే అందుకు వారు తిరిగి పొందేది ధిక్కారాన్ని, ఎగతాళిని మాత్రమే! నా బోళాతనం బహుశా మీ దృష్టిలో తీవ్రంగా దెబ్బతిని ఉంటుందని నేను అంగీకరిస్తున్నప్పటికీ, ఇప్పటికైతే నన్ను ఆశ్చర్యపరిచే విషయం వేరొకటి ఉంది. అది మన మీడియా స్పందన. ఒకవేళ అలాంటిదేమైనా ఉండివుంటే, నాకైతే ఆందోళన కనబడలేదు, ఏహ్యభావం కనబడలేదన్నదైతే నిశ్చయం. బహుశా నేను చదవాల్సిన పత్రికల్ని చదవలేదేమో! చూడాల్సిన టీవీ చానెళ్లను చూడలేదేమో! కానీ నాకు అనిపించింది ఏమిటంటే, చెప్పినదాన్ని మౌనంగా అంగీ కరించారని! అంగీకరించకపోయినా, కనీసం దానిమీద వ్యాఖ్యానించ నైనా లేదు. విమర్శ అయితే అసలు చేయలేదు. అది ఖండనార్హమైనది కాదని నేను అనుకుంటే తప్ప నాకది దాదాపుగా నమ్మకశ్యంగా లేదు. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారా?క్షమించండి. నేను ఈరోజు చాలా ప్రశ్నలు సంధించి మీకు అతి కొద్ది సమాధానాలు మాత్రమే ఇచ్చాను. కానీ నా అభిప్రాయాలను మీపై రుద్దడం నాకు ఇష్టం లేదు. బదులుగా, మీరేం అనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక మరొక చివరి ప్రశ్నకు నన్ను మన్నించండి: ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన వారు భిన్న మత విశ్వాసాన్ని కలిగిన తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడడం తగినదేనా? మరింత కచ్చితంగా అడగాలంటే, నైతికంగా సరైనదేనా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇస్లాంకు వచ్చిన ముప్పేమీ లేదు: ఆరెస్సెస్ ఛీఫ్
భారత్‌లో ఇస్లాం మతం ప్రమాదంలో పడిందన్న కొందరి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అసలు అలాంటి ప్రచారాల వలలో చిక్కుకోవద్దని ముస్లింలను కోరాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్. ఘజియాబాద్: ఆ గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ పునరుద్ఘాటించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఆరెస్సెస్ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్.. హిందుస్తాన్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. ప్రజలు చేసే ఆరాధనలను బట్టి వారిని వర్గాలుగా విభజించలేమని అన్నారు. మూక దాడులకు పాల్పడే వాళ్లు హిందుత్వానికి వ్యతిరేకులేనని తేల్చిచెప్పిన ఆయన.. మూకదాడులపై కొన్ని సందర్భాల్లో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని ఆక్షేపించారు. ఏ ఒక్క మతమో కాదు దేశంలో ప్రజల మధ్య ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘‘హిందు, ముస్లిం వర్గాలు వేర్వేరు కాదు. మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే. జాతీయవాదం, మన పూర్వీకులు సాధించిన కీర్తి ప్రజల మధ్య ఐక్యతకు ఆధారం కావాలి. హిందు–ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలకు పరిష్కార మార్గం చర్చలే. ఈ రెండు వర్గాల ఐక్యతపై తప్పుడు ప్రచారం సాగుతోంది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, దేశంలో ఏ ఒక్క మతమో ఆధిపత్యం చెలాయించలేదు. కేవలం భారతీయులు మాత్రమే ఆధిపత్యం చెలాయించగలర’’ని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. కాగా, తాను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికో ఈ కార్యక్రమానికి రాలేదని, దేశాన్ని బలోపేతం చేయడానికి.. సమాజంలో అందరి బాగు కోసం ఆరెస్సెస్ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అది అభివృద్ధికి ముప్పే! వివిధ రంగాలకు చెందిన 150 మంది ముస్లిం ప్రముఖులతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. జనాభా విపరీతంగా పెరగడం రాష్ట్ర అభివృద్ధికి ముప్పేనని ముస్లిం ప్రముఖులు అంగీకరించారని సమావేశం అనంతరం సీఎం కామెంట్ చేశారు. ఈ మేరకు అభివృద్ధి కోసం సూచనలు చేయడానికి వారితో 8 ఉపవర్గాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇతర ఏ దేశంలోనూ లేని విధంగా భారతీయ ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారని, అన్ని మతాలకు చెందిన ప్రజలు భారత్‌ని రక్షించుకోవడానికి ఒక్కతాటిపైన నిలబడ్డారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్ సామ్రాజ్యాధిపతి అక్బర్‌కి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. దేశ సంస్కృతి మీద దాడి జరిగినప్పుడల్లా భారతదేశ చరిత్రలో అన్నిమతాల వారు ఐక్యంగా నిలబడి తిప్పి కొట్టారని తెలిపారు. భారతదేశంలో లాగా ఇతర మతస్తులకు పాకిస్తాన్ ఎటువంటి హక్కులు కల్పించలేదని వ్యాఖ్యానించారు. (హథ్రాస్: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు) -
భారతీయ ముస్లింను పాకిస్థానీ అంటే మూడేళ్లు జైలుశిక్ష
న్యూఢిల్లీ: భారతీయ ముస్లింను 'పాకిస్థానీ' అంటూ ఎవరైనా అవమానిస్తే.. అతన్ని శిక్షించేలా చట్టాన్ని తీసుకురావాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఒవైసీ.. భారతీయ ముస్లింని 'పాకిస్థానీ' అని నిందిస్తే.. మూడేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. అయితే, కేంద్రంలోని మోదీ సర్కారు ఈ బిల్లు తీసుకువస్తుందని తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లో మతఘర్షణల నేపథ్యంలో బరెలీ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర విక్రమ్‌సింగ్ ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బలవంతంగా ర్యాలీలు నిర్వహిస్తూ.. పాకిస్థానీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న విపరీత ధోరణీ ఇటీవల పెరిగిపోయిందని, దీనివల్ల మతఘర్షణలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్ర విమర్శలు బెదిరింపుల నేపథ్యంలో ఆయన తన ఫేస్బుక్ పోస్టును డిలీట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాస్గంజ్లో జరిగిన అల్లరలో ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ ఈ డిమాండ్ చేశారు. -
మన ముస్లింలు జాతీయ వాదులు
లక్నో: భారతీయ ముస్లింలు జాతీయవాదులని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఉగ్రవాదానికి వారెన్నడూ మద్దతు పలకలేదన్నారు. ఇస్లామిక్ స్టేట్ వంటి మతచాంధస ఉగ్రవాద సంస్థలకు భారత్‌లో స్థానం కల్పించలేదన్నారు. ఉగ్రవాదాన్ని ఏదో ఒక మతంతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. మదన మోహన్ మాలవీయ మిషన్ ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న రాజ్‌నాథ్.. ఉగ్రవాద సవాలును ఎదుర్కొంటున్న దేశాలన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరు సాగించాలన్నారు. ఉగ్రవాద బాధిత దేశాల్లో ఒకటైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కలిసి రావాలన్నారు. టైస్టులకు టైస్టులతోనే సమాధానం చెప్పాలంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో.. ‘ఉగ్రవాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఒక్క భారత్‌కే కాదు.. ప్రపంచమంతటికీ తెలుసంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నకిలీ కరెన్సీ నోట్లు ఉగ్రవాద వ్యాప్తికి ఉపయోగపడ్తున్నాయని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఆర్థిక వృద్ధికి తోడ్పడిన నిర్ణయాల్లో బ్యాంకుల జాతీయీకరణ అత్యంత ముఖ్యమైనదని ప్రశంసించారు. తమ ప్రభుత్వ ఆర్థికపరమైన నిర్ణయాల వల్ల త్వరలోనే రెండంకెల వృద్ధిరేటును అందుకోగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ మహా సంపర్క్ అభియాన్‌ను ప్రారంభిస్తూ.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ‘మోదీ ఏడాది పాలనపై చర్చ మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుతుదోంది. భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారుతోందన్న విషయం విదేశీ పర్యటనల సందర్భంగా మోదీకి లభిస్తున్న స్వాగత సత్కారాల తీరును చూస్తే అర్థమవుతుంది. 2025 నాటికి భారత్ సూపర్ పవర్‌గా మారుతుంది’ అని అన్నారు.