
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇతర ఏ దేశంలోనూ లేని విధంగా భారతీయ ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారని, అన్ని మతాలకు చెందిన ప్రజలు భారత్‌ని రక్షించుకోవడానికి ఒక్కతాటిపైన నిలబడ్డారని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్ సామ్రాజ్యాధిపతి అక్బర్‌కి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.
దేశ సంస్కృతి మీద దాడి జరిగినప్పుడల్లా భారతదేశ చరిత్రలో అన్నిమతాల వారు ఐక్యంగా నిలబడి తిప్పి కొట్టారని తెలిపారు. భారతదేశంలో లాగా ఇతర మతస్తులకు పాకిస్తాన్ ఎటువంటి హక్కులు కల్పించలేదని వ్యాఖ్యానించారు. (హథ్రాస్: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు)