Indian origin CEO
-
గ్లోబల్ కంపెనీకి సీఈవోగా భారతీయ మహిళ
న్యూఢిల్లీ: గ్లోబల్ కంపెనీలకు సారధ్యం వహిస్తున్నవారిలో భారత సంతతికి చెందిన వారు ప్రముఖంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా మహిళా బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఓగిల్వీ కొత్త గ్లోబల్ సీఈవోగా భాతర సంతతికిచెందిన దేవిక బుల్చందానీ ఎంపికయ్యారు. జూన్ 2020 ఈ పదవిలో ఉన్న ఆండీ మెయిన్ నుండి దేవిక ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆండీ 2022 చివరి వరకు సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఉత్తర అమెరికా గ్లోబల్ ప్రెసిడెంట్ , సీఈవోగా ఒగిల్వీలో చేరిన రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో, దేవిక బుల్చందానీ గ్లోబల్ సీఈవోగా నిలవడం విశేషం. అడ్వర్టైజింగ్ సర్కిల్స్‌లో ఆమెకు పేరుగాంచిన “దేవ్”, రెండు దశాబ్దాలకు పైగా మెక్కాన్తో ఉన్నారు. మాస్టర్ కార్డ్ అడ్వర్టైజింగ్ కాన్సెప్ట్‌ను గ్లోబల్ బిజినెస్‌గా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఒగిల్వీ గ్లోబల్ సీఈవోగా 93 దేశాలలో 131 కార్యాలయాలలోపబ్లిక్ రిలేషన్స్, అనుభవం, కన్సల్టింగ్, ఆరోగ్యం ఏజెన్సీ వ్యాపారాలకు బాధ్యత వహిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద యాడ్స్ కంపెనీ డబ్ల్యూపీపీలో ఒగిల్వీ ఒక భాగం. లండన్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ ఆదాయం 2021 నాటికి 12 బిలియన్ డాలర్లకుపై మాటే. దేవిక ఎంపీకపై డబ్ల్యూపీపీ సీఈవో మార్క్ రీడ్ స్పందిస్తూ, క్రియేటివిటీ చాంపియన్ బుల్చందానీ ప్రతిభా పాటవాలపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా అమృత్‌సర్‌లో బాల్యాన్ని గడిపిన దేవికా బుల్చందానీ డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఇంగ్లీష్, సైకాలజీలో డిగ్రీ, సౌత్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. మాస్టర్‌కార్డ్‌తో పాటు, ఆమె క్రాఫ్ట్ అండ్ యూనిలీవర్లో పనిచేశారు. 2017లో ఫియర్లెస్ గర్ల్ క్యాంపెయిన్ చేపట్టారు. కార్యాలయాల్లో లింగ వైవిధ్యంపై దృష్టి సారించారు. రెండేళ్ల క్రితం ఓగిల్వీలో చేరారు దేవిక బుల్చందానీ. -
మరో టెక్ దిగ్గజం సీఈఓగా మనోడే..!
న్యూయార్క్ : భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు. ఐబీఎం సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతున్న అరవింద్‌ను కంపెనీ డైరెక్టర్ల బృందం సీఈఓగా ఎన్నుకుంది. ఐబీఎం నవ శకానికి అరవింద్ సరైన నాయకుడని ఐబీఎం ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ అన్నారు. ఐబీఎం రూపొందించిన కీలక సాంకేతిక పరిఙ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తయారీలో అరవింద్ బాగా కృషి చేశారని కొనియాడారు. రెడ్ హ్యాట్ కొనుగోలులో అరవింద్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఇక ఐబీఎం చైర్మన్ అయిన గిన్నీ రోమెట్టీ (62) ఈ ఏడాది చివర్లో రిటైర్ అవుతారు. అప్పటి వరకు ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. దీంతోపాటు ఐబీఎంలో సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్, రెడ్ హ్యాట్ సీఈఓ అయిన జేమ్స్ వైట్ హర్ట్స్ ఐబీఎం ప్రెసిడెంట్‌గా కంపెనీ డైరెక్టర్లు ఎన్నుకున్నారు. 1990 అరవింద్ కృష్ణా (57) ఐబీఎంలో చేరారు. కాన్పూర్ ఐఐటీలో సాంకేతిక శాస్త్రంలో డిగ్రీ, ఇల్లినాయిస్ యూనివర్సీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఆయన పీహెచ్డీ చేశారు. తనను సీఈఓగా ఎన్నుకోవడం పట్ల అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్లు, ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. మెరుగైన సాంకేతిక పరిఙ్ఞానంతో తమ క్లైంట్లకు ఎదురయ్యే కష్టతరమైన సవాళ్లను అధిగమిస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల-గూగుల్ సీఈఓ, సుందర్ పిచాయ్-ఆల్ఫాబెట్ సీఈఓ, అజయ్ బంగా మాస్టర్ కార్డ్-సీఈఓ, శంతను నారాయణ్ అడోబ్-సీఈఓగా పనిచేస్తున్నారు. ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సికో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. -
భారత సంతతి సీఈవోకు జాత్యహంకార వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రదేశం అమెరికాలో భారత సంతతి సీఈవో జాత్యహంకార వేధింపులకు గురయ్యాడు. జీఎంఎం నాన్‌స్టిక్ సీఈవో గా పనిచేస్తున్న రావిన్‌గాంధీ ఇటీవల జాత్యంహకార వేధింపులను ఎదుర్కొన్నాడు. చార్లోట్టెస్ విల్లెలో తనపై జరిగిన వేధింపుల అనంతరం రావిన్ గాంధీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక ఎజెండాపై సీఎన్బీసీకి ఒక ఆర్టికల్ రాశారు. ఈ-మెయిల్ మరియు ట్విట్టర్లో ట్రంప్ అభిమానులు తనను తీవ్రంగా దూషించినట్లు రవీన్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ మద్దతుదారురాలైన ఒక మహిళ తనను అసభ్యకరంగా భారతీయ పంది అంటూ తిడుతున్న ఆడియో టేపును రావిన్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. అంతేకాకుండ ఆ ఆడియో టేపులో 'మీ చెత్తను తీసుకొని ఇండియాకు వెళ్లి అమ్ముకోండి' అంటూ దూషించింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో అమెరకా సంయుక్త రాష్ట్రాల రాయబారి నిక్కీ హలేను "బంగ్లాదేశ్ క్రీప్" అంటూ విమర్శించింది. అయితే తన రోజువారి జీవితంలో ఇది పెద్ద సమస్యకాదన్నారు. కానీ దురదృష్టవశాత్తూ అమెరికాలో తనను రెండవ తరగతి పౌరుడిగా భావిస్తున్నారంటూ రావిన్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.