Indian passport
-
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు..
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్ లభించింది. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్–లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. ► దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయాణించే దేశాలకు హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. చెత్త పాస్‌పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్ హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నాలుగో చెత్త పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా నిలిచింది. పాక్ పాస్పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలకు జీరో ర్యాంక్ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. ఇది కూడా చదవండి: గవర్నర్‌కు డీఎంకే ఫైల్స్–2 -
వీసా లేకుండానే 57 దేశాలకు!
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్ లభించింది. గత ఐదేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్–లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. చెత్త పాస్‌పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్ హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నాలుగో చెత్త పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా నిలిచింది. పాక్ పాస్పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలకు జీరో ర్యాంక్ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయాణించే దేశాలకు హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. – సాక్షి, అమరావతి -
Passport: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే
మోర్తాడ్ (బాల్కొండ): తమ దేశానికి వచ్చే పర్యాటకులు, వర్క్ వీసా పొందినవారు పాస్‌పోర్టులలో ఇంటిపేరును తప్పనిసరిగా జత చేయించుకోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం నిర్దేశించింది. యూఏఈకి వచ్చేవారి వివరాలు స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయం మేరకు భారతీయులు ఎవరైనా తమ పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకపోతే నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూఏఈలోని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. కొందరి పాస్‌పోర్టులలో ఆధార్, పాన్‌కార్డు, ఓటర్ కార్డులలో ఇంటి పేరు ఉండకుండా పేరు మాత్రమే ఉంటుంది. పేరు ఒక్కటే ఉండటం వల్ల ఆయా వ్యక్తుల స్పష్టమైన వివరాలు తెలియడం లేదనే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం ఈ సవరణలను చేపట్టింది. ఇదిలా ఉండగా ఎవరైనా పెళ్లి చేసుకోక ముందు పాస్‌పోర్టు తీసుకుని ఉంటే అందులో భర్త లేదా భార్య(స్పౌస్) పేరు ఉండదు. అలాంటివారు కూడా తమ జీవిత భాగస్వామి పేరును నమోదు చేయించుకోవాలని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కోరారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో అనేక మంది పాస్‌పోర్టులలో వివరాలు స్పష్టంగా లేవు. కొత్త నిబంధనల వల్ల పాస్‌పోర్టులలో పూర్తి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. యూఏఈలో రెన్యువల్‌కు ఇక్కడ విచారణ యూఏఈలో ఉపాధి పొందుతున్నవారు తమ పాస్‌పోర్టు రెన్యువల్‌కు అక్కడి భారత రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ప్రత్యేక పోలీసు విభాగం(స్పెషల్ బ్రాంచ్) అధికారులు విచారణ జరుపుతున్నారు. విదేశాల్లో ఉన్న వారు పాస్‌పోర్టు రెన్యువల్‌కు గడువు సమీపిస్తే తాము ఉండే దేశంలోని భారత రాయబార కార్యాలయంలో రెన్యువల్ చేసుకునేవారు. పాత పాస్‌పోర్టునే రెన్యువల్ చేసుకోవడం వల్ల ఎలాంటి విచారణ నిర్వహించకపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం భారత రాయబార కార్యాలయం ఇచ్చిన సమాచారంతో పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేవారి ఇంటి వద్దకు ఎస్బీ అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుండటం గమనార్హం. పాస్‌పోర్టుల జారీ పారదర్శకంగా ఉండాలన్న కారణంతోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..) -
‘చోక్సీని భారత్‌కు అప్పగించం’
న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ ప్రస్తుతం అంటిగ్వా పౌరుడని ఆయనను భారత్‌కు పంపబోమని ఓ అంటిగ్వా అధికారి స్పష్టం చేశారు. రూ 13,500 కోట్ల పీఎన్బీ స్కామ్‌లో నిందితుడైన చోక్సీని దేశానికి రప్పించేందుకు భారత్ ప్రత్యేక విమానాన్ని కరీబియన్ దీవులకు పంపుతోందన్న వార్తల నేపథ్యంలో అంటిగ్వా అధికారి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మెహుల్ చోక్సీ కోసం భారత్ నుంచి అధికారులు అంటిగ్వా, బార్బుడాలకు వస్తున్నారన్న సమాచారం తమ ప్రభుత్వం వద్ద లేదని ప్రధాని గాస్టన్ బ్రౌన్ కార్యాలయ సిబ్బంది చీఫ్ మాక్స్ హర్ట్ పేర్కొన్నట్టు ఇండియా టుడే టీవీ వెల్లడించింది. మెహుల్ చోక్సీ ఇప్పుడు అంటిగ్వా పౌరుడని,ఆయన తన భారత పౌరసత్వాన్ని వదిలివేయడంతో భారత పౌరుడు కారని ఆయన అంటిగ్వా పౌరసత్వాన్ని తాము రద్దు చేయబోమని హర్ట్ పేర్కొన్నారు. వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత బృందం అంటిగ్వాకు రానుందని తాను భావిస్తున్నాన్నారు. చోక్సీని అరెస్ట్ చేయడం లేదా ఆయనను తీసుకువెళ్లేందుకు భారత బృందం అంటిగ్వా వస్తుందని తాము భావించడం లేదన్నారు. జనవరి 31న వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ అంటిగ్వాలో ప్రారంభమవుతుండటంతో భారత అధికారులు అంటిగ్వా రావచ్చని చెప్పుకొచ్చారు. -
భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ
-
భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో తలదాచుకున్న రుణ ఎగవేతదారులను భారత్‌కు రప్పించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రయత్నాలకు గండిపడింది. పీఎన్బీ స్కామ్‌లో నిందితుడు, పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకుని అంటిగ్వా ప్రభుత్వానికి తన పాస్‌పోర్ట్‌ను అప్పగించారు.చోక్సీ ఏడాదికి పైగా అంటిగ్వాలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. రుణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్ వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని 2018 డిసెంబర్ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు. అంటిగ్వా నుంచి భారత్‌కు 41 గంటల పాటు ప్రయాణం చేసే పరిస్ధితిలో తాను లేనని కోర్టుకు వివరించారు. తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి డైమండ్ వ్యాపారి చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ 13,000 కోట్లకు మోసం చేసినట్టు దర్యాప్తు సంస్ధలు ఆయనపై విచారణ చేపట్టాయి. కాగా భారత పౌరసత్వం వదులుకోవడం ద్వారా భారత చట్టాల ప్రకారం తనపై జరిగే విచారణను అడ్డుకునేందుకు చోక్సీ ఇలా వ్యవహరించారని భావిస్తున్నారు. -
వారం రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ!
పాస్‌పోర్టు పొందాలంటే చాలా కష్టం. అందుకు ముందు దరఖాస్తు చేయాలి, తర్వాత పోలీసు వెరిఫికేషన్ అవ్వాలి, ఆ తర్వాత పాస్‌పోర్టు మంజూరు కావాలి, అది మనకు చేరాలి. ఇదంతా అవ్వాలంటే ఎంత లేదన్నా నెల రెండు నెలల సమయం పడుతుంది. కానీ.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం పుణ్యమాని వారం రోజుల్లోనే పాస్‌పోర్టు చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేవలం మూడు రకాల పత్రాలు దాఖలు చేస్తే చాలు.. వారంలో పాస్‌పోర్టు వచ్చేస్తుందని చెబుతున్నారు. అది కూడా తత్కాల్ కాదు.. సాధారణ పద్ధతిలోనే! ఆధార్ కార్డు కాపీ, ఓటరు గుర్తింపు కార్డు కాపీ, పాన్ కార్డు కాపీ.. ఈ మూడింటితో పాటు పౌరసత్వం, కుటుంబ వివరాలు, నేర రికార్డులు లేవన్న డిక్లరేషన్‌తో కూడిన అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా పాస్‌పోర్టుల జారీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పోలీసు వెరిఫికేషన్. అయితే ఇలాంటి వాటికి మాత్రం పాస్‌పోర్టు జారీ అయిన తర్వాత ఈ వెరిఫికేషన్ చేస్తారు. అందుకు అదనపు చార్జీ ఏమీ వసూలు చేయరు. ముందుగా ఆధార్ నెంబరును ఆన్లైన్లో తనిఖీ చేస్తారు. దీనికితోడు ఓటరు కార్డు, పాన్ కార్డు కూడా తనిఖీ చేస్తారు. ఒకవేళ పోలీసు తనిఖీలో నివేదిక భిన్నంగా వస్తే.. అప్పుడు పాస్‌పోర్టును వెనక్కి తీసుకుంటారు. భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండానే పాస్‌పోర్టు జారీ ప్రక్రియను సులభతరం చేయడానికే ఇలా చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖలో పాస్‌పోర్టు విభాగం డైరెక్టర్ అనిల్ కుమార్ సోబ్తి తెలిపారు. ఆధార్ డేటాబేస్ సిద్ధంగా ఉన్నందువల్ల దాని ఆధారంగా అప్పటికప్పుడే మొత్తం తనిఖీ చేసుకోవచ్చని, అదికూడా దరఖాస్తు చేసేవాళ్లు పాస్‌పోర్టు సేవాకేంద్రం దగ్గర ఉండగానే అయిపోతుందని ఆయన చెప్పారు. దరఖాస్తుదారులు వివరాలన్నింటినీ కచ్చితంగా ఇస్తే.. ఆ తర్వాత పోలీసు వెరిఫికేషన్‌లో నివేదిక భిన్నంగా ఉండే ప్రమాదం తప్పుతుందని అన్నారు. -
వన్‌కార్డుతో నేరగాళ్లకు చెక్
* ఆధార్‌కార్డుల ఫోర్జరీ నేపథ్యంలో పోలీసుల కొత్త ఆలోచన * ఓటర్ఐడీ, ఆధార్, రేషన్‌కార్డు వివరాలను నిక్షిప్తం చేసేలా ప్రణాళిక * చిన్నపాటి చిప్ ఉండేలా కార్డుల రూపకల్పన సాక్షి, హైదరాబాద్: నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. నేరగాళ్ల సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. గుర్తింపుకార్డులను ఫోర్జరీ చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నవారికి చెక్ పెట్టేందుకు వన్కార్డును రూపొందించాలని యోచిస్తోంది. ఓటర్ఐడీ, ఆధార్, రేషన్‌కార్డును నిక్షిప్తం చేసి వన్‌కార్డు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుకు చిప్‌ను అమర్చి అన్ని అవసరాలకు వినియోగించేలా చూస్తారు. పోలీస్‌శాఖతోపాటు అవసరమైన అన్ని విభాగాల్లో చిన్నపాటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తే, దాని సహాయంతో క్షణాల్లో ఎదుటి వ్యక్తి గురించి అక్కడికక్కడే పూర్తి సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఈ కార్డు ద్వారా ఉంటుంది. అయితే, వన్‌కార్డు పేరుతో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రైవేట్ కంపెనీ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడి బిచాన ఎత్తేసింది. ఇప్పుడు అలాంటి వాటికి తావ్వికుండా హోంశాఖ పర్యవేక్షణలోనే ఏకరూప కార్డులను అతితక్కువ ఖర్చుతో రూపొందించాలని భావిస్తోంది. రేషన్, గ్యాస్, బ్యాంకు, వాహనాల కొనుగోలు, అమ్మకం... ఇలా అన్నిచోట్లా ఆధార్ గుర్తింపుకార్డు తప్పనిసరి. పోలీసులు కూడా నింది తుల్ని గుర్తించేందుకు దీన్నే ఆధారంగా ఎంచుకుంటున్నారు. ఏదైనా కేసులో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు అతను చూపించే ఆధార్‌కార్డు అసలైనదా.. కాదా.. అని తెలుసుకునేందుకు ఎలాంటి సదుపాయం లేదు. ఆధార్‌కార్డుపై బార్‌కోడింగ్ ఉన్నా దాన్ని సరిచూసుకునే యంత్ర పరికరాలు లేవు. దీంతో లొసుగులను ఆసరా చేసుకొని కొందరు కేటుగాళ్లు ఫోర్జరీకి పాల్పడుతున్నారు. సాధారణ వ్యక్తుల ఆధార్‌కార్డులో తమ ఫొటో, పేరు ఫొటోషాప్ సహాయంతో మార్చేసి నకిలీకార్డును సృష్టిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓటరు గుర్తింపు, రేషన్‌కార్డులు కూడా ఫోర్జరీకి గురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో పట్టుబడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన సిమీ సానుభూతిపరుల వద్ద కూడా వందల సంఖ్యలో ఓటరు ఐడీ, ఆధార్‌కార్డు లభించాయి. వీటి ద్వారా ఏకంగా భారతదేశపు పాస్‌పోర్టును సైతం పొందారు. ఈ నేపథ్యంలో అన్ని కార్డులకు సంబంధించి ‘వన్‌కార్డు’ రూపొందించాలని అధికారులు యోచిస్తున్నారు. ఫోర్జరీకి పాల్పడేవారు సైతం అన్ని కార్డులకు సంబంధించిన సమాచారాన్ని తారుమారు చేసే అవకాశం ఉండదు. వీటివల్ల నేరాలను, నేరగాళ్లను నియంత్రిచవచ్చని పోలీసులు భావిస్తున్నారు.