ఐపీటీఎల్ తో కొత్త శిఖరాలకు టెన్నిస్: ముర్రే
దుబాయ్: టెన్నిస్ క్రీడను ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపీటీఎల్) కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని బ్రిటీషు నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే అభిప్రాయపడ్డాడు. ఐపీటీఎల్ మహేష్ భూపతి లీగ్ కు ముర్రే నేతృత్వం వహించనున్నాడు. నవంబర్ 28న పిలిప్పీన్స్ లో ఐపీటీఎల్ ప్రారంభంకానుంది.
'క్రీడలకు కొత్త అభిమానులను సంపాదించడం ముఖ్యం. ఐపీటీఎల్ లాంటి టోర్నమెంట్ లు ఇంతకుముందెన్నడూ రాలేదు. విభిన్న అంశాలతో కూడిన ఐపీటీఎల్ ఆసక్తికరంగా ఉంటుంది. క్రీడాభిమాలకు కచ్చితంగా ఆసక్తి కలిగిస్తుంది' అని ముర్రే పేర్కొన్నాడు.