దక్షిణ సూడాన్ లోని భారతీయులు క్షేమం
న్యూఢిల్లీ: దక్షిణ సూడాన్ లోని భారతీయులు క్షేమంగా ఉన్నారని ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. గత కొంత కాలంగా ఆదేశంలో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 270 మంది పౌరులు మరణించారు. దీంతో ఆదేశంలో ఉన్న భారతీయుల క్షేమంపై విదేశాంగ శాఖ దృష్టి సారించింది. సూడాన్ లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబారి శ్రీకుమార్ మీనన్ తెలిపారు. జరుగుతున్న ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.