Indias star player
-
నీరజ్ కోచ్‌గా జాన్ జెలెజ్నీ
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరు...ఇదే క్రీడాంశంలో సంచలన ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్స్ స్వర్ణం అందించిన ఆటగాడు మరొకరు...వీరిద్దరు ఇప్పుడు మరిన్ని రికార్డులను సృష్టించే లక్ష్యంతో జోడీగా మారారు. భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, 2 ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన కొత్త కోచ్‌గా చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెన్జీని కోచ్‌గా ఎంచుకున్నాడు.రాబోయే 2025 సీజన్‌కు ముందు జత కలిసిన నీరజ్, జెలెజ్నీ అద్భుతమైన ఫలితాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. 58 ఏళ్ల జెలెజ్నీ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం వరుసగా మూడు ఒలింపిక్స్ (1992, 1996, 2000)లలో స్వర్ణాలు గెలుచుకున్నాడు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతని పేరిటే జావెలిన్‌ను అతి ఎక్కువ దూరం విసిరిన వరల్డ్ రికార్డు (98.48 మీటర్లు) కూడా ఉంది.2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌కు ఇటీవలి వరకు జర్మనీకి చెందిన బయోమెకానిక్స్ ఎక్స్పర్ట్ క్లాస్ బార్టొనిట్జ్ కోచ్‌గా ఉన్నాడు. ‘చిన్నప్పటినుంచి నేను జెలెజ్నీకి వీరాభిమానిని. ఆయన టెక్నిక్ అంటే ఎంతో ఇష్టం. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆయన వీడియోలు చూస్తుండేవాడిని. ఇప్పుడు జెలెజీ్నతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.మా ఇద్దరి త్రోయింగ్ శైలి ఒకటే. మున్ముందు నా కెరీర్లో మరిన్ని అత్యుత్తమ విజయాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. నీరజ్ ఆట గురించి తనకు బాగా తెలుసని.. ఎంతో మంది అథ్లెట్లు కోచింగ్ కోసం తనను సంప్రదించినా వారందరినీ కాదని భారత ఆటగాడిని ఎంచుకోవడం అతనిలో ప్రతిభను చూసేనని జెలెన్జీ వెల్లడించాడు. గతంలో ఈ దిగ్గజం శిక్షణలోనే జేకబ్ వాలెజ్, విటెస్లావ్ వెసెలి, బార్బరా స్పొటకోవా లాంటి ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకోవడం విశేషం. -
FIH Player of the Year: హర్మన్‌ప్రీత్‌కు ‘ఎఫ్ఐహెచ్’ అవార్డు
న్యూఢిల్లీ: భారత స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను నిలకడైన ఆటతీరుతో ఇంటాబయటా జట్టు విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాడు. ఈ భారత వైస్‌కెప్టెన్ 2021–22 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో విశేషంగా రాణించాడు. 16 మ్యాచ్‌లాడిన హర్మన్‌ప్రీత్ 18 గోల్స్ చేశాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అతని (6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్) ప్రదర్శన వల్లే భారత జట్టు కాంస్యం గెలిచింది. ప్రతీ మ్యాచ్ లోనూ గోల్ చేయడం విశేషం. ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లో భారత్ రన్నరప్‌గా నిలువడంలోనూ అతని పాత్ర ఉంది. ‘హర్మన్‌ప్రీత్ ఆధునిక హాకీ క్రీడలో సూపర్‌స్టార్. అతని డిఫెన్స్ అద్భుతం. ప్రత్యర్థుల రక్షణపంక్తిని బోల్తా కొట్టించడంలో అతను ఘనాపాటి. తన స్టిక్కు అందిన బంతిని చకచకా ఆడిస్తూ తీసుకెళ్లే సామర్థ్యం అతని సొంతం. అదే వేగంతో గోల్‌పోస్ట్‌లోకి పంపడంలోనూ హర్మన్ దిట్ట. అందుకే వరుసగా ఈ ఏడాది కూడా అతన్నే అవార్డు వరించింది’ అని ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో కొనియాడింది. పురుషుల హాకీలో వరుసగా ఇలా అవా ర్డులు పొందిన నాలుగో ఆటగాడిగా హర్మన్ ఘనత వహించాడు. గతంలో డి నూయిజెర్ (నెదర్లాండ్స్), జేమీ డ్వెయర్ (ఆస్ట్రేలియా), ఆర్థర్ వాన్ డొరెన్ (బెల్జియం)లు రెండేళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు. తాజా అవార్డు బరిలో ప్యానెల్... హర్మన్ ప్రీత్ సింగ్‌కు 29.4 పాయింట్లు ఇవ్వగా, రేసులో ఉన్న బ్రింక్ మన్ (నెదర్లాండ్స్; 23.6), టామ్ బూన్ (బెల్జియం; 23.4) వెనుకబడ్డారు. -
పిక్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
రెండో రౌండ్లో శ్రీకాంత్, జైరాం బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో ‘బై’ లభించిన సైనా... మంగళవారం జరిగిన రెండో రౌండ్లో సునాయాస విజయం సాధించింది. ఏడో సీడ్ సైనా 21-11, 21-9 తేడాతో రష్యాకు చెందిన నటాలియా పెర్మినోవాను చిత్తు చేసింది. 31 నిమిషాల్లోనే భారత నంబర్‌వన్ ప్లేయర్ ఈ మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 11-21, 21-12 స్కోరుతో ఇజ్టోక్ ఉట్రోసా (స్లొవేకియా)ను ఓడించాడు. మరో భారత ఆటగాడు అజయ్ జైరాంకు ‘వాకోవర్’ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. తొలి రౌండ్లో అతను నాలుగో సీడ్ కెనిచి టాగో (జపాన్)తో తలపడాల్సి ఉండగా...చివరి నిమిషంలో కెనిచి తప్పుకోవడంతో అజయ్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన ప్రజక్తా సావంత్-ఆరతి సారా సునీల్ జోడి ప్రత్యర్థికి ‘వాకోవర్’ ఇచ్చింది. ఫలితంగా పుతీతా సుప్రజిరకుల్- సప్సిరీ (థాయిలాండ్) జంట రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత జోడి అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. ఆరో సీడ్ మైకేల్ ఫక్స్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) 21-14, 21-11 తో అరుణ్-అపర్ణలపై గెలుపొందింది. కశ్యప్ నిష్ర్కమణ కామన్వెల్త్లో స్వర్ణం నెగ్గి ఉత్సాహం మీదున్న పారుపల్లి కశ్యప్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 24-26, 21-13, 18-21తో డీటర్ డోమ్కీ (జర్మనీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.