‘కోతల’పై కోపం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : విద్యుత్ కోతలపై ఇందూరు రైతులు భగ్గుమన్నారు. జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. బాన్సువాడ, బాల్కొండ, డి చ్‌పల్లి, బీర్కూరు, బిచ్కుంద, కామారెడ్డి, వర్ని తదితర ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రధాన రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
జిల్లాలో వారం రోజులుగా కరెంట్ కోతలు పెరిగాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్ రైతులకు అందని ద్రాక్షలా మారింది. రైతులు ఇంత పెద్దమొత్తంలో విద్యుత్ కోతలపై ధర్నాలకు దిగడం పది రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఉచిత విద్యుత్ కనీసం నాలుగు గంటలు కూడా సరఫరా కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు విద్యుత్ కోతలు తమను అవస్థల పాలు చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని బాల్కొండలో జాతీయ రహదారిపై ముప్కాల్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహిం చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం దూస్‌గాం గ్రామస్తులు సబ్‌స్టేషన్ కు తాళం వేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తె లంగాణ తల్లి విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మల్లారం సబ్‌స్టేషన్ వద్ద రైతులు ధర్నా నిర్వ హించారు. బీర్కూరు మండలం బొమ్మన్‌దేవిపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశా రు. వర్ని మండలం మోస్రాలో కరెంటు కోతను నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నిజామాబాద్-బాన్సువాడ రోడ్డుపై అడుగడుగునా ధర్నాలు చేశారు. విద్యుత్ కోతల కారణం గా రక్షిత మంచినీటి పథకాలు పనిచేయడం లేదని నాందేడ్-సంగారెడ్డి ప్రధాన రహదారిపైన ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
అధికారికంగా కోతల వివరాలు
వ్యవసాయానికి కేవలం 5గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అవి ఏ, బీ, సీ, డీ నాలుగు గ్రూపుల్లో సరఫరా చేస్తున్నారు.
ఎ- ఉదయం 3 నుంచి 8 గంటల వరకు.
బి- ఉదయం 8నుంచి ఒంటి గంట వరకు.
సి- మధ్యాహ్నం 1గంట నుంచి 6గంటల వరకు
డి- రాత్రి 10గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు సరఫరా ఉంటుంది.
{పతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో, మధ్యలో ఒక గంట గ్రా మాలకు నీళ్ల కోసం కరెంట్ సరఫరా చేస్తున్నారు.
గృహాలకు జిల్లాలో ఇలా..
నిజామాబాద్ నగరంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో 6 గంటలు కోత విధిస్తున్నారు.
మున్సిపాలిటీలు కామారెడ్డి, ఆర్మూర్, బోధన్‌లలో ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2గంటల నుంచి 6గంటల వరకు అంటే 8 గంటల కోత ఉంటుంది.
మండల కేంద్రం, సబ్‌స్టేషన్ పరిధిలో, మున్సిపాలిటీల్లో ఉన్నట్లే కోతలు ఉంటాయి.
ఉదయం 6నుంచి సాయత్రం 6గంటల వరకు ఏకంగా 12గంటల కోతలు ఉన్నాయి.