industries closed
-
ఉపాధికి గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వ్యవసాయం, మత్స్యకార రంగాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉపాధి దొరికేది గ్రానైట్ పరిశ్రమల్లోనే. ఇప్పుడా పరిశ్రమలు మూతబడ్డాయి. నూతన పాలసీ పేరుతో గ్రానైట్ పరిశ్రమలను ప్రభుత్వమే మూసివేయించింది. రెండు నెలలుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనులు జరగడం లేదు. ఉపాధి లేక కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి. వారి ఆకలికేకలను జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.ఇప్పట్లో పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి లేదని భావిస్తున్న కార్మికులు.. మళ్లీ వలస బాట పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 150 క్వారీలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరో 150 పాలిíÙంగ్ యూనిట్లు, 30 క్రషర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 25 వేల మంది, పరోక్షంగా 45 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారే కాకుండా ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశి్చమ బెంగాల్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. కూటమి నేతల పెత్తనం.. టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే గ్రానైట్ పరిశ్రమలపై కూటమి నేతల పెత్తనం మొదలైంది. మళ్లీ తాము చెప్పేవరకు గ్రానైట్ పరిశ్రమల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని అధికారవర్గాల ద్వారా ఆదేశించారు. దీనికి నూతన గ్రానైట్ పాలసీ అనే ముసుగు తొడిగారు. పర్మిట్లను ఇవ్వకుండా నిలిపేశారు. దీంతో గ్రానైట్ క్వారీలతో పాటు వాటి అనుబంధ యూనిట్లు అన్నీ రెండు నెలల క్రితమే మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడ్డ కార్మికులంతా గగ్గోలు పెడుతున్నారు.ఈ సంక్షోభం ఒక్క కార్మికులపైనే కాదు యాజమాన్యాలపైనా ప్రభావం చూపింది.. ఇక్కడ గ్రానైట్ బ్లాకులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లేవి. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు తీసిన బ్లాక్‌లు ఆరు బయటే ఉండిపోవటంతో కలర్ మారి మార్కెట్లో విలువ తగ్గిపోయేలా ఉంది. ఫలితంగా గ్రానైట్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోనుంది. అటు కార్మికుల ఆకలికేకలు, ఇటు యాజమాన్యాల నష్టాలను క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించింది. కార్మికుల వేదన వర్ణనాతీతం గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న టెక్కలి మండలంలో కార్మికుల వేదన వర్ణనాతీతంగా ఉంది. బొరిగిపేట సమీపంలోని ఓ క్వారీ సూపర్వైజర్ మాట్లాడుతూ.. తాను టీడీపీ అభిమానినని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు మంచి జరుగుతుందని భావిస్తే చివరకు కడుపుకొట్టారని చెప్పారు.పరిశ్రమలు తెరిపించండి అని కోరడానికి ఇక్కడి మంత్రి వద్దకు వెళితే.. పరిశ్రమ తెరవకపోతే తినడం మానేస్తావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపేట, మెలియాపుట్టి, దీనబంధుపురం, సవర, జాడుపల్లి, నిమ్మాడ తదితర గ్రామాల్లో నివసించే కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీలు ఆపేసి తమ ఉపాధిపై దెబ్బకొట్టి పస్తులు పెట్టడం ఏంటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాసుల కక్కుర్తి కోసమే.. గ్రానైట్ పరిశ్రమల నుంచి కాసులు ఆశించే ఇలా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా 2014–19లో గ్రానైట్ కార్యకలాపాలన్నీ మంత్రి సోదరుడు కనుసన్నల్లోనే జరిగేవి. వారి కుటుంబానికి కూడా గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు ఉండటంతో వాటి ముసుగులో చక్రం తిప్పేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వారి పప్పులు ఉడకలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రానైట్ కంపెనీలపై పెత్తనం కోసం ప్రయతి్నస్తున్నారు. దానికి నూతన పాలసీ అంటూ బూచిగా చూపిస్తున్నారు అని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి పోయింది మా ఊరికి దగ్గరలో మేలిసతివాడ వద్ద క్వారీలో జాకీ లేబర్‌గా పనిచేస్తుండేవాడిని. క్వారీలు నడవక ఉపాధి పోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా లాంటి పేదలకు పెద్ద ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో బాగానే క్వారీలు నడచి జీతాలు వచ్చాయి. –కొర్రాయి నారాయణ, జీడిపేట, వీకేజీ క్వారీ మేలిసతివాడగ్రానైట్ కార్మికులను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం గ్రానైట్ క్వారీల నిర్వాహణపై ఆంక్షలు పెట్టింది. దీని వలన జిల్లాలోని క్వారీలు, వాటికి అనుసంధానంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు, క్రషర్లు ఆగిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు నడిరోడ్డున పడ్డారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. దీని వలన జిల్లాలో వలసలు ఆరంభమయ్యాయి. జిల్లాలో వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువతకు ఉపాధికి ఆసరాగా ఉన్న గ్రానైట్ రంగాన్ని కుదేలు చేస్తున్నారు. –షణ్ముఖరావు, గ్రానైట్ కార్మికుల యూనియన్ జిల్లా నాయకుడుపని లేదు.. బత్తాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చాక క్వారీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీని వలన పని లేదు. బత్తాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు రేపు అని చెబుతున్నారు కానీ క్వారీలు తెరవడం లేదు. పని లేక పస్తులుంటున్నాం. –ముఖలింగాపురం అప్పారావు, జాకీ లేబర్, ప్రియాంక గ్రానైట్, జీడిపేట -
వర్క్ ఫ్రం హోం.. పరిశ్రమల మూసివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో వాయు కాలుష్యం కట్టడికి వర్క్ ఫ్రం హోం, పరిశ్రమల మూసివేత వంటి ప్రతిపాదనలను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలు చేశాయని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం కొన్ని అత్యవసర చర్యలను ప్రకటించారు. ఇందులో..వారం పాటు బడుల మూసివేత, నిర్మాణరంగ కార్యకలాపాల నిలిపివేత, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానం అమలు వంటివి ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై సోమవారం ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలు సమావేశమై చర్చించాయని మంత్రి రాయ్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంజాబ్, రాజస్తాన్, యూపీ, హరియాణా యంత్రాంగాలు కూడా ఈ భేటీలో పాల్గొన్నాయన్నారు. త్వరలోనే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుందని రాయ్ తెలిపారు. ఢిల్లీ కాలుష్యంపై రైతులను నిందించొద్దు ఢిల్లీలో వాయు కాలుష్యానికి రైతులను నిందించవద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్లే వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చలేదనే విషయాన్ని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మొత్తం వాయుకాలుష్యంలో పంట వ్యర్థాల దహనం 10% మాత్రమే కారణమని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. -
పరిశ్రమలకు ‘చంద్ర’గ్రహణం
ఒకే అబద్ధాన్ని పలు మార్లు చెప్పి జనాన్ని నమ్మించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆలూచూలూ లేకుండానే రూ.లక్షల కోట్లతో పరిశ్రమలు నెలకొల్పి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసిన బాబు సర్కార్ వాస్తవానికి ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పిన పాపానపోలేదు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువై గతంలో ఉన్న పాత పరిశ్రమలు సైతం మూతపడగా మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. పర్యవసానంగా బాబు సర్కారు చెప్పినట్లు లక్షలాది మందికి కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు సైతం పోగొట్టుకుని రోడ్డునపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారం చేపట్టగానే ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతామని చంద్రబాబు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేశారు. అయితే ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించడం మినహా ఇప్పటికీ ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్న మూడు, నాలుగు సంస్థలు సైతం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా నీరు, పోర్టు, రోడ్లు, విమానాశ్రయం లాంటి సౌకర్యాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క పరిశ్రమను నెలకొల్పకపోయినా బాబు ప్రభుత్వం మాత్రం ఎంఓయులు లెక్కగట్టి లక్షల కోట్ల పరిశ్రమలు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం. పారిశ్రామికవేత్తల వెనుకడుగు కందుకూరు మండలం కోవూరు వద్ద రంగా ఫర్టికల్ బోర్డు(ఆగ్రో బేస్డ్ సంస్థ) ఏర్పాటవుతుందని చెప్పారు. దీంతో పాటు మద్దిపాడు మండలం గుళ్లాపల్లి వద్ద బీబీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్(మినరల్ బేస్డ్) పొన్నలూరు మండలం వేలటూరు వద్ద వీఎస్ఎల్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, వెలిగండ్ల మండలం మొగళ్లూరు వద్ద ఆర్కేఎస్ టెక్నో విజన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (పవర్ జనరేషన్), పొదిలి మండలం ఓబులక్కపల్లి వద్ద స్ప్రింగ్‌బీ డెయిరీ ప్రోడక్ట్ (ఫుడ్ అండ్ ఆగ్రో) తదితర పరిశ్రమలు నెలకొల్పుతున్నట్లు బాబు సర్కారు ప్రకటించింది. ఇదే తరహాలో జాసన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(ఫెర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్), మోహన్ వెల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండస్ట్రియల్ పార్కు), రంగా ఫర్టికల్ బోర్డు, చైనాకు చెందిన కన్సార్టియం ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు, తమిళనాడుకు చెందిన మోహన్ సింటెక్స్ టెక్స్టైల్స్ తదితర కంపెనీలు జిల్లాలో దొనకొండ, ఇతర ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమల కోసం దొనకొండ మండలంలోని పలు గ్రామాలలో 25,886 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 2450 ఎకరాలను ఎపీఐఐసీకి బదలాయించారు. ఉక్రెయిన్ దేశానికి చెందిన టైటాన్ ఏవియేషన్ ప్రతినిధులు యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్ల తయారీకి, పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు నిమిత్తం మొదట మూడు విడుతలుగా పరిశీలించారు. రూ.500 కోట్లతో, 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 6,200 ఎకరాల భూములు అడిగారు. రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో ఎంఎస్ వైట్ స్టోన్, కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా వారి ఆర్థిక సహాకారంతో రష్యా, ఉక్రెయిన్ దేశ సాంకేతిక సహకారంతో ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు అప్పట్లో చెప్పారు. 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. స్పెయిన్ దేశానికి చెందిన ఇండియానా కంపెనీ వాహనాల పరిశోధన కేంద్రం వారు రూ.1500 కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 500 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. మేకింగ్ ఏపీలో భాగంగా యాంటనోఫ్ ఫర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ముడిసరుకు రవాణా సంస్థ ఎన్డీఆర్ సరుకులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నూతనంగా 400 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరూ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. రామాయపట్నం ఊసేది జిల్లాలో రామాయపట్నం నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో పోర్టును పట్టించుకోలేదు. తీరా ఎన్నికల వేళ రూ.4,500 కోట్లతో రామాయపట్నం పోర్టును నిర్మిస్తున్నట్లు చంద్రబాబు శంఖుస్థాపన రాయి వేశారు. దీంతో పాటు రూ.24500 కోట్లతో ఏషియన్ పేపర్ పల్ప్ పరిశ్రమకు సైతం బాబు శంఖుస్థాపన చేశారు. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా పనుల్లో పురోగతి లేదు. పరిశ్రమలు ముందే పూర్తి చేసి ఉంటే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది. ప్రాభవం కోల్పోతున్న పలకల పరిశ్రమలు ఒకప్పుడు వైభవంగా విరాజిల్లిన మార్కాపురం పలకల పరిశ్రమ ఆదరణ కరువై మూత దశకు చేరుకుంది. మార్కాపురం పట్టణ శివారులో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ పరిశ్రమ నడుస్తోంది. ఏడెనిమిదేళ్ల క్రితం 100 ఫ్యాక్టరీలతో 12 వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమ ప్రస్తుతం కేవలం 45 చిన్న పరిశ్రమలతో 4 వేల మందికి కూడా పని కల్పించలేని పరిస్థితికి చేరుకుంది. విద్యుత్ బిల్లులు పెరగడం, బ్యాంకు రుణాలు అందకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువవడంతో పలకల పరిశ్రమ మూతపడే స్థితికి చేరింది. కష్టాల్లో కూరుకుపోయిన గ్రోత్ సెంటర్లు కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వద్ద 1992లో ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేశారు. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో 131.6 ఎకరాలు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో 32.6 ఎకరాలు చొప్పున మొత్తం 164 ఎకరాల భూములు కేటాయించింది. 2007లో వీటికి సంబంధించి 110 ప్లాట్లు వేశారు. వైఎస్ హయాంలో ఇక్కడ 45 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా సిమెంట్, ఇటుకల ఫ్యాక్టరీలు, పొగాకు ఫ్యాక్టరీలు, పండ్లు కూలింగ్ యూనిట్లు, పచ్చిపండ్లను మాగపెట్టే యూనిట్లు, ఐస్ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేశారు. తద్వారా వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల పాలనలో సింగరాయకొండ గ్రోత్ సెంటర్లో ఒక్క పరిశ్రమ రాలేదు. పసుపు, కారం పొడి ప్యాకింగ్ ఎక్స్‌పోర్ట్స్ యూనిట్లతో పలు పరిశ్రమలు ఇక్కడకు వస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలుమార్లు ప్రకటించారు. కానీ ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. మరోవైపు గతంలో ఎకరం లక్ష రూపాయలకు కేటాయించిన అధికారులు ఇప్పుడు ఎకరం రూ.50 లక్షలు చెబుతున్నారు. పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్ చార్జీల పెంపు, జీఎస్టీ భారంతో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. గ్రోత్ సెంటర్లో భూముల వివాదం వల్లే పరిశ్రమలు రావడం లేదని తెలుస్తోంది. ఇక్కడి భూములు తమవేనంటూ తొలుత ఎండోమెంట్ విభాగం వివాదం లేవనెత్తింది. ఇందుకోసం ఏపీఐఐసీ పోరాటం చేయాల్సి వచ్చింది. పారిశ్రామికవేత్తల పోరాటంతో ఎట్టకేలకు ఎండోమెంట్ విభాగం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత రెవెన్యూ శాఖ ఆ భూములు తమవేనంటూ మరో వివాదం లేవనెత్తింది. వరుస వివాదాలతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పన్ను రూపంలో వసూళ్లు గ్రోత్ సెంటర్లో పరిశ్రమ ఏర్పాటు చేసిన స్థలాన్ని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అధికారులు వసూలు చేస్తున్నారు. ఏడాదికి రూ.7 లక్షలకు పైగా వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు 20 ఏళ్లుగా ఇదే వ్యవహారం సాగిస్తున్నారు. ఈ నిధులతో ఇండస్ట్రియల్ ఏరియాలో కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ఆ దాఖలాలు మాత్రం లేవు. దీంతో ఇండస్ట్రియల్ ఏరియా చిల్లచెట్లు, మురుగుతో అధ్వానంగా తయారైంది. గుళ్లాపల్లిలో 40 పరిశ్రమలు మూత మద్దిపాడు మండలంలోని గుళ్లాపల్లి వద్ద 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో 1,271 ఎకరాల్లో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేశారు. 644 ప్లాట్లు వేసి పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. వైఎస్ హయాంలో ఇక్కడ 400 పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా 250 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లతో పాటు పలురకాల పరిశ్రమలు ఏర్పాటుయ్యాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత ఇక్కడకు భారీ పరిశ్రమలు రాలేదు. గడిచిన నాలుగేళ్లలో పది గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు మాత్రమే ఏర్పాటు కాగా 40 పరిశ్రమలు మూతపడటం గమనార్హం. జీఎస్టీ 28 శాతానికి పెంచటం, విద్యుత్ చార్జీలు మరింత భారం కావడంతోపాటు పారిశ్రామిక రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో రాయల్టీలో 40 శాతం రాయితీ ఇస్తే చంద్రబాబు సర్కారు పైసా ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. వైఎస్సార్ హయాంలో రాయల్టీపై రాయితీ 2008–09 నుంచి ఆర్థిక మాంద్యం కారణంగా జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ గ్రానైట్ క్వారీలు నష్టాలలో కూరుకుపోయి మూతపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో నాటి సీఎం దివంగత వైఎస్సార్.. క్వారీల యజమానులు గ్రానైట్ రాళ్లపై ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీపై మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీ ఇచ్చి ఆదుకున్నారు. దీంతో చీమకుర్తిలో 75 వరకు రన్నింగ్ కండిషన్లో ఉన్న గ్రానైట్ క్వారీలతో పాటు 300 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లకు కూడా మేలు కలిగింది. గ్రానైట్ పరిశ్రమలకు జగన్ భరోసా పాదయాత్రలో భాగంగా చీమకుర్తిలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి అప్పులు తెచ్చి కట్టిన గ్రానైట్ ఫ్యాక్టరీలు నడపలేక మూతపడుతున్నాయని యజమానులు విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్టరీల యజమానులు క్వారీల వద్ద కొనుగోలు చేసే గ్రానైట్ రాయల్టీపై 40 శాతం రాయితీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీల్లో కూడా రాయితీ ఇస్తానని భరోసా ఇచ్చిరు. తద్వారా 1,200 గ్రానైట్ ఫ్యాక్టరీలకు మేలు కలగనుంది. పారిశ్రామిక రాయితీలకు సర్కారు ఎగనామం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక పన్ను రాయితీలు కల్పించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలకు పారిశ్రామిక పన్ను రాయితీలు కల్పిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాయలసీమ జిల్లాలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన చట్టప్రకారం 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు ఐదేళ్లపాటు జిల్లాలో నెలకొల్పబోయే పరిశ్రమలకు 15 శాతం తరుగుదల పన్ను, పరిశ్రమ ప్లాంట్, కొత్త యంత్రాల వ్యయంపై 15 శాతం పెట్టుబడి అలవెన్సు ఇవ్వాల్సి ఉన్నా అవేవి అందడం లేదు. జిల్లాలో 60 శాతం పరిశ్రమలు మూత ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలివ్వకపోవడంతో ఇటీవల కాలంలో పరిశ్రమలు ముందుకు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. జీఎస్టీ వచ్చాక అదనపు పన్నులు వేయడం, విద్యుత్ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచడం తదితర కారణాలతో బ్యాంకు కిస్తీలు కూడా చెల్లించలేక చిన్న పరిశ్రమలు వరుసగా మూతపడుతున్నాయి. పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 85 పెద్ద, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. రూ.2,928.80 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన ఈ పరిశ్రమల ద్వారా 22,093 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెబుతున్నారు. ఇవి కాక జిల్లా వ్యాప్తంగా 7,593 చిన్న పరిశ్రమలున్నాయి. రూ.2,040.93 కోట్లతో ఏర్పాటైన ఈ పరిశ్రమల ద్వారా 81,277 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇందులో 60 శాతం పరిశ్రమలు(సుమారు 4 వేలు) మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. విద్యుత్ బిల్లులతో పాటు బ్యాంకు రుణాలకు సంబంధించిన కంతులు చెల్లించలేక ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. 70 శాతం పరిశ్రమలు మూతపడ్డాయి ప్రస్తుతం ఇండస్ట్రీస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కొంతమేర మాత్రమే చిన్న పరిశ్రమలకు వచ్చాయి. రావాల్సిన సబ్సిడీలు ఇతరత్రా రాయితీలపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. జీఎస్టీ మరింత ఇబ్బందికరంగా మారింది. 70 శాతం పరిశ్రమలు మూత దశకు చేరుకున్నాయి. – కొమ్మి కృష్ణయ్య, వెంగమాంబ గ్రానైట్ యజమాని నష్టపోతున్నాం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్లాటు తీసుకుని గ్రానైట్ ఇండస్ట్రీ స్థాపించా. జీఎస్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నుల కారణంగా ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. ఉత్పత్తికి తగ్గట్లు డిమాండ్ లేకపోవడంతో పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. దీంతో భారీగా నష్టపోతున్నాం. దీనికి తోడు పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. – సయ్యద్ నజీర్, నాసా గ్రానైట్స్ అధినేత, సింగరాయకొండ ఉద్యోగం లేదు.. భృతి లేదు మార్కాపురం ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో మూడేళ్ల కిందట వివరాలు నమోదు చేసుకున్నా. ఒక్కసారి కూడా ఉద్యోగానికి రమ్మని కాల్ లెటర్ పంపలేదు. నిరుద్యోగ భృతి కూడా లేదు. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో నాలాంటి యువత అంతా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఐదేళ్ల క్రితం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది కూడా ఇటీవల కొంత మందికే ఇచ్చారు. – నాలి బాలగురవయ్య, బీఏ, మార్కాపురం -
భెల్ గయా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్ భెల్ పరిశ్రమ మూతపడనుంది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటనతో ఈ విషయం రూఢీ అయింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా నష్టాలు చూపిస్తూ ఈ ప్రాజెక్ట్ మూసివేతకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇదంతా తెలిసినా రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు కనీసం స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలతో నెలూరు, చిత్తూరు జిల్లాల్లోని నిరుద్యోగులు, రియల్టర్లతో పాటు పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల గుండెలు గుభేల్మంటున్నాయి. వెంకటగిరి: నెల్లూరు, చిత్తూరు జిల్లా వాసుల బతుకుతెరువు ప్రాజెక్ట్ మన్నవరం భెల్. వెంకటగిరి ప్రాంత అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతాయని ఆశించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందరో ఆశలను వమ్ము చేస్తూ.. కలలను కల్లలు చేస్తూ మూతపడే దశకు చేరుకుంది. 2010 సెప్టెంబర్ 1వ తేదీన అప్పటి భారతప్రధాని మన్మోహన్సింగ్ వెంకటగిరి సమీపంలోని చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ సంయుక్తగా నిర్మించే ఎన్బీపీపీఎల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్ సాధనకు ఎంతో కృషి చేశారు. దురదుష్టవశాత్తు ఆయన అకాలంగా కాలం చేయడంతో ప్రారంభానికి కొంతకాలం జాప్యం జరిగింది. వైఎస్సార్ కలలను సాకారం చేసేందుకు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆయన స్మారకంగా మన్నవరానికి వైఎస్సార్పురంగా నామకరణం చేసి ఆ ప్రాజెక్ట్‌ను కేటాయించి పనులు ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు తరలిపోతుందని రెండేళ్ల క్రితం వదంతులు వచ్చాయి. దీంతో అప్పట్లో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితర నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు స్పందించి ప్రాజెక్ట్‌ను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ స్వరూపం ఇదీ విద్యుత్ ఉపకరణాల పరిశ్రమ అయిన ఎన్‌బీపీపీఎల్‌ను రూ.6000 కోట్లతో నిర్మించాలని అప్పట్లో అంచనా వేశారు. ఈ పరిశ్రమ ద్వారా 6వేల మందికి ఉద్యోగావకాశం కల్పించాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా మరో 400 చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ద్వారా సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని భావించారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే ఉపకరణాలు తయారు కాకపోవడం వల్ల మార్కెటింగ్ లక్ష్యం నీరుగారిపోయింది. ఈ పరిశ్రమను రూ.6000 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి ఉంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వినియోగించే టర్బయిన్లు, బాయిలర్లతో పాటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏహెచ్‌పీ) వాటర్ సిస్టంను తయారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ కోసం కేవలం రూ.130 కోట్లు మాత్రమే వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్‌లో హైడ్లర్ రోలర్లు మాత్రమే తయారు చేయడం వల్ల తగినంత వార్షిక ఆదాయం సాధించలేక నష్టాల్లో కూరుకుపోయింది. సుమారు 763.85 ఎకరాల్లో ఏర్పాటు కావాల్సిన భారీ పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్ల అర్ధాంతరంగా మూత పడిపోనుంది. భూముల ధరలు భారీగా పతనం 2010 సంవత్సరంలో వెంకటగిరి సమీపంలోని మన్నవరం వద్ద భెల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తుండటంతో అప్పట్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కో ఎకరా రూ.కోటి వరకూ పలికింది. అనంతరం మన్నవరం భెల్ ప్రాజెక్ట్ తరలిపోతుందని, పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ నిర్మాణం లేదని సమాచారం అందడంతో ఒక్కసారిగా భూముల ధరలు బాగా తగ్గాయి. దీంతో రియల్ ఎస్టేట్ యజమానులు రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టి వెంచర్లు వేసి తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం భెల్ పరిశ్రమ పూర్తిగా మూతపడుతుందన్న సమాచారం. రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్తర కొరియాకు చైనా ఝలక్
బీజింగ్ : వరుస అణుపరీక్షలతో ప్రపంచాన్ని భయపెడుతున్న ఉత్తర కొరియా మీద ఆంక్షల బాంబు ఇప్పడే పడింది. ఉత్తర కొరియాకు అత్యంత సన్నిహిత, ఆత్మీయ దేశంగా ఉన్న చైనా.. తొలి అడుగు వేసింది. ఉత్తర కొరియాకు 90 శాతం వ్యాపార భాగస్వామిగా ఉన్న చైనా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షల దృష్ట్యా తన నిస్సహాయతను ప్రకటించింది. చైనాలో ఉన్న ఉత్తర కొరియా పరిశ్రమలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూసివేయాలని చైనా వాణిజ్య శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. వరుస అణుపరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అందులో భాంగంగానే చైనా ఉత్తరి కొరియా పరిశ్రమల మీద నిషేధాజ్ఞాలు జారీ చేసింది. ఉత్తర కొరియాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా ఉంది. ఇరు దేశాల మధ్య 90 శాతం వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో చైనా కూడా సమితి ఆంక్షలను అమలు చేయడంతో ఉత్తర కొరియా అర్థికంగా పతనమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియాపై చైనా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. అమెరికా ఉన్నతాధికారి రెక్స్ టెల్లిర్‌సన్ వచ్చే వారం బీజింగ్‌లో పర్యటించనున్నారు. ఉత్తర కొరియా ఆర్థిక మూలాలను దెబ్బతీయండం కోసమే ఆయన చైనాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యితో చర్చలు జరుపుతారు. -
9 నెలలుగా పరిశ్రమలు మూత
హైదరాబాద్: మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు వైఎస్సార్ ప్రభుత్వం ఉపాధి చూపింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా అంతర్జాతీయ బిడ్డింగ్ ధరకే 40 శాతం ఖనిజాన్ని వారికి కేటాయించింది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తామని, భూమిని తక్కువ ధరకే ఇస్తామని, విద్యుత్తు, విలువ ఆధారిత పన్ను లాంటి పలు రాయితీలు ఇస్తామంటూ దేశ, విదేశాల్లో ప్రకటనలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్సార్ జిల్లాలో 218 పరిశ్రమలు మూతపడేలా వైఎస్సార్ హయాంలో జారీ చేసిన జీవో రద్దు చేశారు. ప్రభుత్వాదాయానికి పైసా నష్టం లేకుండా బెరైటీస్ కొనుగోలు చేసి పరిశ్రమలకు వినియోగించుకుంటున్న తమకు అన్యాయం చేసేలా ఆ జీవోను రద్దు చేయడంపై మూతపడిన పరిశ్రమల యజమానులు, ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు కోల్పోయి నిర్వాసితులైన వారికి 40 శాతం ఖనిజాన్ని బిడ్డింగ్ ధరకు ఇచ్చేలా వైఎస్సార్ ప్రభుత్వం 2004లో జీవో 296 జారీ చేసింది. టెండర్లలో అత్యధిక మొత్తానికి కోట్ చేసిన ఇచ్చే ధరకే స్థానిక పరిశ్రమలకు, నిర్వాసితులకు 40 శాతం ఖనిజాన్ని, టెండరు పొందిన వారికి 60 శాతం ఖనిజాన్ని ఎగుమతి కోసం కేటాయించాలనేది ఈ జీవో సారాంశం. ఈ జీవోను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు గత ఏడాది డిసెంబరు 15వ తేదీన జీవో నం. 206 జారీ చేసింది. జీవో గత ఏడాది డిసెంబరులో జారీ అయినా వాస్తవంగా గత ఏడాది ఆగస్టు నుంచే స్థానిక మిల్లులకు ఖనిజాన్ని సరఫరా చేయవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానికంగా ఉన్న 218 పల్వరైజింగ్, ఇతర మిల్లులు ఖనిజం లేక మూతపడ్డాయి. దీనివల్ల వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 50 వేల మంది పనిలేక రోడ్లపాలయ్యారు. అప్పులు చేసి పరిశ్రమలు నెలకొల్పిన వారు తొమ్మిది నెలలుగా పైసా ఆదాయం లేక బ్యాంకులు, ఆర్థిక సంస్థల అప్పులకు కంతులు ఎలా కట్టాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ‘టెండర్లల్లో కోట్ అయిన అత్యధిక ధరకే స్థానిక కోటా కింద మేం ఖనిజం కొంటూ వచ్చాం. దీనివల్ల ప్రభుత్వానికి పైసా కూడా నష్టం ఉండదు. అలాంట ప్పుడు స్థానిక మిల్లులకు ఖనిజ కోటాను రద్దు చేసి పరిశ్రమలను మూతపడేలా చేయడం ఎలా సబబు? ఇదేనా బాబు మార్కు పారిశ్రామిక విధానం’ అని స్థానిక మిల్లుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కోటాను రద్దు చేయడాన్ని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం తప్పుబడుతున్నారు.