inflow and outflow
-
తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల ఎత్తివేత..!
సాక్షి, కర్నూలు: తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో 33 గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,67,485 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1,99,432 క్యూసెక్కుల నీటిని దిగువగు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటమట్టం 1633 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం నాటికి 1631.63 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ100.86 టీఎంసీలు కాగా, 95.64 టీఎంసీల నీటితో తుంగభద్ర నిండు కుండలా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
జూరాలలో విద్యుదుత్పత్తి ప్రారంభం
మహబూబ్‌నగర్ : జూరాల ప్రాజెక్టులోని నాలుగు యూనిట్లలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని గురువారం ప్రారంభించారు. జలాశయానికి ఇన్‌ఫ్లో బాగా ఉండడంతో బుధవారం మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించగా గురువారం తెల్లవారుజాము నుంచి నాలుగో యూనిట్లో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. జూరాలకు ఇన్‌ఫ్లో 74 వేల క్యూసెక్కులు ఉండగా విద్యుదుత్పత్తి కారణంగా 32 వేల క్యూసెక్కల నీటిని ఔట్‌ఫ్లోగా కిందికి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 9,657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7,855 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలాశయ అధికారులు వెల్లడించారు.