మహబూబ్‌నగర్ : జూరాల ప్రాజెక్టులోని నాలుగు యూనిట్లలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని గురువారం ప్రారంభించారు. జలాశయానికి ఇన్‌ఫ్లో బాగా ఉండడంతో బుధవారం మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించగా గురువారం తెల్లవారుజాము నుంచి నాలుగో యూనిట్‌లో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.
జూరాలకు ఇన్‌ఫ్లో 74 వేల క్యూసెక్కులు ఉండగా విద్యుదుత్పత్తి కారణంగా 32 వేల క్యూసెక్కల నీటిని ఔట్‌ఫ్లోగా కిందికి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 9,657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7,855 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలాశయ అధికారులు వెల్లడించారు.