
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్నూలు: తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో 33 గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,67,485 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1,99,432 క్యూసెక్కుల నీటిని దిగువగు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటమట్టం 1633 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం నాటికి 1631.63 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ100.86 టీఎంసీలు కాగా, 95.64 టీఎంసీల నీటితో తుంగభద్ర నిండు కుండలా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment