Infosys revenue
-
'నేను వచ్చాక ఇన్ఫీ రెవెన్యూలు పెరిగాయ్'
ముంబై : ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులకు నెలకొన్న వివాద నేపథ్యంలో కంపెనీ సీఈవో విశాల్ సిక్కా సోమవారం ఇన్వెస్టర్లలో వీడియో కాన్ఫరెన్సీ నిర్వహించారు. తాను కంపెనీ సీఈవోగా పదవిలోకి వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ రెవెన్యూలు ప్రతి త్రైమాసికంలోనూ 400 మిలియన్ డాలర్ల(రూ. 2,677కోట్లకు )కు పెరిగినట్టు చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కంపెనీ స్థిరమైన మార్జిన్లను ఆర్జించిందన్నారు. కంపెనీ కోర్ ఐటీ సర్వీసుల వ్యాపారాలు స్థిరంగా వృద్ధి చెందాయని పెట్టుబడిదారులకు చెప్పారు. నూతానావిష్కరణ, ఆటోమేట్పై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఆటోమేషన్తో ఉద్యోగాలకు భారీగా ఎఫెక్ట్ చూపుతుందన్నారు. టెక్నాలజీ నిరంతరాయంగా మార్పులను చోటుచేసుకుంటుందని, వాటిని మనం స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కంప్యూటర్ ప్రొసెసింగ్ స్పీడ్లో అడ్వాన్స్లోకి రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిలో మంచి వృద్ధిని సాధించవచ్చన్నారు. ఇవి బిజినెస్ అవకాశాలను పెంచుతుందని పెట్టుబడిదారులకు వివరించారు. కంపెనీ సహవ్యవస్థాపకులతో తన సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటాయని సిక్కా చెప్పారు. క్వాంటమ్ ఫిజిక్స్, టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై నారాయణమూర్తితో చర్చిస్తుంటానన్నారు. కంపెనీలో వ్యవస్థాపకుల స్టాక్ 13 శాతముంది. మరోవైపు కంపెనీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్కు ఎక్కువ వేతనం చెల్లించారనే విషయంపై వచ్చిన వాదనలు ఇన్ఫోసిస్ చైర్మన్ శేషసాయి క్లారిటీ ఇచ్చారు. ఆయనకు రూ.17 కోట్ల వేతనం చెల్లించలేదని తెలిపారు. ఆయనకు చెల్లించాలని నిర్ణయించిన వేతనం రూ.17.38 కోట్లలో కేవలం రూ.5.2 కోట్లే చెల్లించినట్టు స్పష్టీకరించారు. -
సెన్సెక్స్ కు ఇన్ఫోసిస్ బూస్ట్!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా నాలుగవ రోజు లాభాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ అందించిన ఫలితాల ప్రభావంతో సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడ్డాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 20559 పాయింట్ల వద్ద ఆరంభమై.. ఓ దశలో 20434 పాయింట్ల కనిష్ట స్థాయిని చేరుకుంది. చివరికి 256 పాయింట్ల లాభంతో 20528 పాయింట్ల వద్ద క్లోజైంది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 378 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 6096 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఫలితాలు అందించిన ఉత్సాహం ప్రస్తుత ర్యాలీ కారణమని బ్రోకర్లు అభిప్రాయపడుతున్నారు. ఇండెక్స్ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 5.17 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 5 శాతం, ఇన్ఫోసిస్ 4.70 శాతం, లార్సెన్ 4.40 శాతం, టాటా మోటార్స్ 3.67 శాతం లాభపడ్డాయి. ఎన్ టీపీసీ 2.6 శాతం, హిండాల్కో 2.4, టాటా పవర్ 2.4, సన్ ఫార్మా 2, సెసా గోవా 2 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చిన ఇన్ఫోసిస్
బెంగళూరు : ఇన్ఫోసిస్ వరుసగా రెండో త్రైమాసికంలో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. సెప్టెంబరు క్వార్టర్లో కంపెనీ ఆర్థిక ఫలితాలు అనలిస్టుల అంచనాలకు అనుగుణంగా వచ్చాయి. ఆదాయం 12,965 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2,410 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. మరోవైపు 20013-14 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాను కూడా పెంచింది. ఆదాయ వృద్ధి 6 నుంచి 10 శాతం ఉంటుందని గతంలో ఇన్ఫీ మేనేజ్మెంట్ అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాను 9 నుంచి 10 శాతానికి సవరించింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ధర 160 రూపాయల దాకా లాభపడుతూ 3,300లకు చేరువలో ట్రేడవుతోంది. 6 నెలల కిందట షేరు ధర 2300ల కంటే తక్కువగా ఉండటం ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం. ఇన్ఫోసిస్ 5 శాతం దాకా పెరుగుతుండటంతో సెన్సెక్స్ కూడా లాభపడుతోంది. 200 పాయింట్లకు పైగా పెరుగుతూ 20,500లకు సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్ల దాకా పెరుగతూ 6,080 పాయింట్లకు సమీపంలో కొనసాగుతోంది.