'నేను వచ్చాక ఇన్ఫీ రెవెన్యూలు పెరిగాయ్'
'నేను వచ్చాక ఇన్ఫీ రెవెన్యూలు పెరిగాయ్'
Published Mon, Feb 13 2017 12:34 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
ముంబై : ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులకు నెలకొన్న వివాద నేపథ్యంలో కంపెనీ సీఈవో విశాల్ సిక్కా సోమవారం ఇన్వెస్టర్లలో వీడియో కాన్ఫరెన్సీ నిర్వహించారు. తాను కంపెనీ సీఈవోగా పదవిలోకి వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ రెవెన్యూలు ప్రతి త్రైమాసికంలోనూ 400 మిలియన్ డాలర్ల(రూ. 2,677కోట్లకు )కు పెరిగినట్టు చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కంపెనీ స్థిరమైన మార్జిన్లను ఆర్జించిందన్నారు. కంపెనీ కోర్ ఐటీ సర్వీసుల వ్యాపారాలు స్థిరంగా వృద్ధి చెందాయని పెట్టుబడిదారులకు చెప్పారు.
నూతానావిష్కరణ, ఆటోమేట్పై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఆటోమేషన్తో ఉద్యోగాలకు భారీగా ఎఫెక్ట్ చూపుతుందన్నారు. టెక్నాలజీ నిరంతరాయంగా మార్పులను చోటుచేసుకుంటుందని, వాటిని మనం స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కంప్యూటర్ ప్రొసెసింగ్ స్పీడ్లో అడ్వాన్స్లోకి రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిలో మంచి వృద్ధిని సాధించవచ్చన్నారు. ఇవి బిజినెస్ అవకాశాలను పెంచుతుందని పెట్టుబడిదారులకు వివరించారు.
కంపెనీ సహవ్యవస్థాపకులతో తన సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటాయని సిక్కా చెప్పారు. క్వాంటమ్ ఫిజిక్స్, టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై నారాయణమూర్తితో చర్చిస్తుంటానన్నారు. కంపెనీలో వ్యవస్థాపకుల స్టాక్ 13 శాతముంది. మరోవైపు కంపెనీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్కు ఎక్కువ వేతనం చెల్లించారనే విషయంపై వచ్చిన వాదనలు ఇన్ఫోసిస్ చైర్మన్ శేషసాయి క్లారిటీ ఇచ్చారు. ఆయనకు రూ.17 కోట్ల వేతనం చెల్లించలేదని తెలిపారు. ఆయనకు చెల్లించాలని నిర్ణయించిన వేతనం రూ.17.38 కోట్లలో కేవలం రూ.5.2 కోట్లే చెల్లించినట్టు స్పష్టీకరించారు.
Advertisement