narayan murthy
-
ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన కంపెనీను కైవసం చేసుకున్న అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి చెందిన కాటమరాన్ వెంచర్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రియోన్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్సీస్‌ను పూర్తిగా అమెజాన్ సొంతం చేసుకుంది. క్లౌడ్టైల్లోని కాటమరాన్ వెంచర్ వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్ ఇండియా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి అనుమతి కోరింది. కాటరామన్కు చెందిన పూర్తి వాటాలను కొనుగోలు చేసినట్లు అమెజాన్ బుధవారం రోజున ప్రకటించింది. క్లౌడ్‌టైల్ కంపెనీలో అంతకుముందు అమెజాన్ 24 శాతం మేర, కాటరామన్ 76 శాతం మేర వాటాలను కల్గి ఉంది. ఇప్పుడు కాటరామన్కు చెందిన పూర్తి వాటాలను అమెజాన్ ఇండియా కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. ఇటీవల క్లౌడ్‌టైల్ ఇండియా మే 2022 కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. ఇరు సంస్థలు ఇకపై జాయింట్ వెంచర్‌గా కొనసాగబోవని అప్పట్లో ప్రకటించాయి. నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే ఇక ప్రియోన్ పూర్తిగా అమెజాన్ చేతిలోకి వెళ్లనుంది. యాజమాన్యంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. చదవండి: షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్..! -
ఇన్ఫీ.. ఆల్ ఈజ్ వెల్
బెంగళూరు : గత కొన్ని రోజుల వరకు వివాదాలతో సతమతమైన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయట. కంపెనీలో ఇప్పుడంతా బాగుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి బుధవారం తెలిపారు. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజంలో నెలకొన్న అన్ని సమస్యలను సరళీకృతం చేసే నైపుణ్యాలను తమ కంపెనీ చైర్మన్ నందన్ నిలేకని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. '' నిజంగా అంతా బాగుంది. ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో తాను చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. నందన్ చైర్మన్‌గా ఉన్నారు. ఇక మనం నిక్షేపంగా నిద్రపోవచ్చు'' అని బెంగళూరులో జరిగిన 2017-18 ఇన్ఫోసిస్ బహుమతుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిలేకని చాలా మంచిగా బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి అని, అన్ని క్లిష్టతరమైన సమస్యలను సరళీకృతం చేసే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపారు. ఇన్ఫోసిస్ ఆయన చేతుల్లోకి వెళ్లినప్పుడు చాలా క్లిష్టతరమైన సమస్యలున్నాయని పేర్కొన్నారు. అంతా ఆయనకు వదిలేయండి. అన్ని సర్దుకుంటాయని అన్నారు. నిలేకని తన ఉద్యోగాన్ని చాలా మంచిగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కాగ, విశాల్ సిక్కా సారథ్యంలో జరిగిన పనామా డీల్ విషయంలో నారాయణమూర్తి అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాల వివాదాల నేపథ్యంలో విశాల్ సిక్కా రాజీనామా చేశారు. సిక్కా రాజీనామా అనంతరం కంపెనీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిలేకని ఇన్ఫీలోకి పునరాగమనం చేశారు. నిలేకని వచ్చిన తర్వాత జరిపిన పనామా డీల్ విచారణలో ఎలాంటి అవకతవకలు జరుగలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చారు. సీఈవో విషయంలో నిలేకనికి ఎవరూ సూచనలు ఇవ్వాల్సినవసరం లేదని, ఎందుకంటే ఆయన కూడా మంచి సీఈవో అని మూర్తి అభివర్ణించారు. తనకు తాను మంచి సీఈవో అవడం వల్ల, ఈ పోస్టుకు ఎవరు సరిపోతారో నిలేకనికి తెలుసన్నారు. -
'నేను వచ్చాక ఇన్ఫీ రెవెన్యూలు పెరిగాయ్'
ముంబై : ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులకు నెలకొన్న వివాద నేపథ్యంలో కంపెనీ సీఈవో విశాల్ సిక్కా సోమవారం ఇన్వెస్టర్లలో వీడియో కాన్ఫరెన్సీ నిర్వహించారు. తాను కంపెనీ సీఈవోగా పదవిలోకి వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ రెవెన్యూలు ప్రతి త్రైమాసికంలోనూ 400 మిలియన్ డాలర్ల(రూ. 2,677కోట్లకు )కు పెరిగినట్టు చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కంపెనీ స్థిరమైన మార్జిన్లను ఆర్జించిందన్నారు. కంపెనీ కోర్ ఐటీ సర్వీసుల వ్యాపారాలు స్థిరంగా వృద్ధి చెందాయని పెట్టుబడిదారులకు చెప్పారు. నూతానావిష్కరణ, ఆటోమేట్పై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఆటోమేషన్తో ఉద్యోగాలకు భారీగా ఎఫెక్ట్ చూపుతుందన్నారు. టెక్నాలజీ నిరంతరాయంగా మార్పులను చోటుచేసుకుంటుందని, వాటిని మనం స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కంప్యూటర్ ప్రొసెసింగ్ స్పీడ్‌లో అడ్వాన్స్లోకి రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిలో మంచి వృద్ధిని సాధించవచ్చన్నారు. ఇవి బిజినెస్ అవకాశాలను పెంచుతుందని పెట్టుబడిదారులకు వివరించారు. కంపెనీ సహవ్యవస్థాపకులతో తన సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటాయని సిక్కా చెప్పారు. క్వాంటమ్ ఫిజిక్స్, టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై నారాయణమూర్తితో చర్చిస్తుంటానన్నారు. కంపెనీలో వ్యవస్థాపకుల స్టాక్ 13 శాతముంది. మరోవైపు కంపెనీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్‌కు ఎక్కువ వేతనం చెల్లించారనే విషయంపై వచ్చిన వాదనలు ఇన్ఫోసిస్ చైర్మన్ శేషసాయి క్లారిటీ ఇచ్చారు. ఆయనకు రూ.17 కోట్ల వేతనం చెల్లించలేదని తెలిపారు. ఆయనకు చెల్లించాలని నిర్ణయించిన వేతనం రూ.17.38 కోట్లలో కేవలం రూ.5.2 కోట్లే చెల్లించినట్టు స్పష్టీకరించారు.