సెన్సెక్స్ కు ఇన్ఫోసిస్ బూస్ట్!
సెన్సెక్స్ కు ఇన్ఫోసిస్ బూస్ట్!
Published Fri, Oct 11 2013 5:47 PM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా నాలుగవ రోజు లాభాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ అందించిన ఫలితాల ప్రభావంతో సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడ్డాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 20559 పాయింట్ల వద్ద ఆరంభమై.. ఓ దశలో 20434 పాయింట్ల కనిష్ట స్థాయిని చేరుకుంది. చివరికి 256 పాయింట్ల లాభంతో 20528 పాయింట్ల వద్ద క్లోజైంది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 378 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 6096 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఫలితాలు అందించిన ఉత్సాహం ప్రస్తుత ర్యాలీ కారణమని బ్రోకర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇండెక్స్ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 5.17 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 5 శాతం, ఇన్ఫోసిస్ 4.70 శాతం, లార్సెన్ 4.40 శాతం, టాటా మోటార్స్ 3.67 శాతం లాభపడ్డాయి. ఎన్ టీపీసీ 2.6 శాతం, హిండాల్కో 2.4, టాటా పవర్ 2.4, సన్ ఫార్మా 2, సెసా గోవా 2 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
Advertisement