కోలుకున్న స్టాక్ మార్కెట్లు
Published Mon, Aug 21 2017 9:29 AM | Last Updated on Tue, Sep 12 2017 12:41 AM
ముంబై : ఇన్ఫోసిస్ సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా అనంతరం భారీగా పడిపోయిన శుక్రవారం స్టాక్ మార్కెట్లు, సోమవారం ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 9850పైన ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 68.05 పాయింట్ల లాభంలో 31,592 వద్ద, నిఫ్టీ 29.95 పాయింట్ల లాభంలో 9867 వద్ద ట్రేడవుతున్నాయి. శనివారం ఇన్ఫోసిస్ రూ.13వేల కోట్ల బైబ్యాక్ ప్రకటన వెలురించినప్పటికీ, ఈ కంపెనీ షేరు కోలుకోవడం లేదు. సిక్కా దెబ్బకు నేడు కూడా ఇన్ఫోసిస్ షేరు 3 శాతం మేర పడిపోతోంది.
నేటి ట్రేడింగ్ ప్రారంభంలో హిందాల్కో, వేదంతా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహింద్రా, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, అరబిందో ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2 శాతం వరకు లాభపడగా.. టీసీఎస్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్టాలు గడిస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసల బలంతో 64.06గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 57 రూపాయల లాభంలో 29,208 రూపాయలుగా ట్రేడవుతున్నాయి.
Advertisement