అంతర్జాతీయ కరాటే పోటీల్లో చందన ప్రతిభ
వర్ధన్నపేట టౌన్: మండల కేంద్రంలోని ఫుస్కోస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కాట బోయిన చందన అంతర్జాతీయ కరాటే పోటీ ల్లో వెండి, రజత పతకాలు సాధించినట్లు పా ఠశాలప్రిన్సిపాల్ సిస్టర్ ఆనిస్ తెలిపారు. ఇటీవల వరంగల్, ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి 13 సంవత్సరాల బాలికల విభాగం పోటీలలో బంగారు పతకం సాధించిన చందన అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.
ముంబ యిలో ఈనెల 24న నిర్వహించిన అంతర్జాతీయ 18వ వరల్డ్‌కప్ కరాటే పోటీల్లో కెనడా బాలికతో తలపడిన చందన రెండో స్థానంలో నిలి స్పారింగ్లో వెండి, కటాస్‌లో రజత పతకం సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్ సోమ శ్రీధర్‌ను ఆమె అభినందించారు.