injuction
-
కోవిడ్-19కు ఔషధం- బయోకాన్ జూమ్
కోవిడ్-19 సోకినవారి చికిత్సకు వినియోగించగల ఔషధానికి దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి అనుమతి లభించినట్లు ఫార్మా దిగ్గజం బయోకాన్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఈ ఔషధాన్ని కరోనా వైరస్ సోకిన రోగుల చికిత్సలో వినియోగించవచ్చని తెలియజేసింది. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ. 8,000కాగా.. ఇకపై వీటిని దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ సోకడంతో స్వల్పంగా లేదా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు వీటిని వినియోగించవచ్చని వివరించింది. 25 ఎంజీ డోసేజీలో కోవిడ్-19 కారణంగా ఓమాదిరి లేదా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న రోగుల చికిత్సకు వినియోగించగల ఐటోలిజుమాబ్ ఔషధాన్నిమార్కెట్లో ప్రవేశ పెట్టనున్నట్లు బయోకాన్ తాజాగా పేర్కొంది. ఐటోలిజుమాబ్ ఇంజక్షన్‌ను 25 ఎంజీ/5ఎంఎల్ డోసేజీలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో బయోకాన్ షేరుకి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతంఎన్ఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 435ను సైతం అధిగమించింది. పరీక్షల తదుపరి అత్యవసర ప్రాతిపదికన సైటోకైన్ విడుదల సమస్య(ఏఆర్డీఎస్)లో చికిత్సకోసం దేశీయంగా ఐటోలిజుమాబ్ ఔషధాన్ని వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి పొందినట్లు బయోకాన్ తెలియజేసింది. బెంగళూరులోని బయోకాన్ పార్క్‌లో గల ప్లాంటులో ఐటోలిజుమాబ్ సొల్యూషన్‌ను తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ముంబై, న్యూఢిల్లీలోని పలు ఆసుపత్రులలో ఈ ఔషధ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ఏఆర్డీఎస్ పేషంట్లలో సీఆర్ఎస్ను నియంత్రించడంలో ఈ ఔషధం ఫలితాలు సాధించినట్లు వివరించింది. తద్వారా సైటోకైన్ సమస్య ద్వారా సవాళ్లు ఎదుర్కొంటున్న పేషంట్లకు ఈ ఔషధ వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేసింది. అత్యధిక శాతం పేషంట్లకు నాలుగు డోసేజీలు అవసరమవుతాయని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ పేర్కొన్నారు. ఈ నాలుగు ఇంట్రావీనస్ ఇంజక్షన్ల విలువ రూ. 32,000గా తెలియజేశారు. దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. -
నొప్పుల ఇంజెక్షన్.. నోస్టాక్
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నొప్పుల ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. ప్రధానంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నొప్పుల నివారణకు గాను డైక్లోఫెనక్ ఇంజెక్షన్లు ఇస్తారు. రెండు నెలలుగా ఈ టీకాల సరఫరా లేదు. కొన్నిచోట్ల ఈ ఇంజెక్షన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రలు అందజేస్తుండగా, మరికొన్ని చోట్ల అవి కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో రోగులకు అవస్థలు తప్పటం లేదు. నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నా యి. వీటి పరిధిలో ప్రతి నెల దాదాపు 60 వేల వరకు డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. వినియోగాన్ని బట్టి జిల్లాకు టీకాల సరఫరా ఉంటుంది. నిజామాబాద్‌లోని గంగాస్థాన్‌లో గల సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి రెండు జిల్లాలకు మందులు సరఫరా చేస్తారు. అయితే రెండు నెలలుగా ఈ టీకాల సరఫరా నిలిచి పోయింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోజుకు 800 వరకు, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆరోగ్య కేంద్రాల్లో 200 నుంచి 300వరకు, కామారెడ్డిలో 500 వరకు డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. మిగతా ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ వీటి వినియోగం ఎక్కువే. ప్రస్తుతం ఈ టీకాలు అందుబాటులో లేక రోగులకు మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. నొప్పుల నివారణలో కీలకం.. డైక్లోఫెనక్ ఇంజెక్షన్‌ను ముఖ్యంగా నొప్పుల నివారణకు వినియోగిస్తారు. ప్రసవాలు, లేదా ఇతర ఆపరేషన్ అనంతరం నొప్పుల నివారణకు, అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి, జ్వరంతో వచ్చే నొప్పులకు కూడా ఈ డైక్లోఫెనక్ ఇంజెక్షన్లను వినియోగిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెరుగుతున్న ప్రసవాలు, ఇతర సాధారణ శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సల సందర్భంలో రోగులకు నొప్పుల నివారణ ఇంజెక్షన్ ఎంతో ముఖ్యం. అయితే ఈ టీకాల కొరత ఉండడంతో ప్రస్తుతం ట్రామాడండల్ ఇంజెక్షన్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలు అందుబాటులో లేవు. ఈ టీకాలకూ కొరత ఉండడంతో, వీటిని కొనుగోలు చేస్తున్నారు. రెండునెలలుగా సరఫరా లేదు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యవసర శస్త్ర చికిత్సలు జరిగేటప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర ఇంజెక్షన్లు వినియోగించాలంటే కొనుగోలు చేయాల్సి వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రసవాల కోసం వచ్చే మహిళలకు నొప్పుల ఇంజెక్షన్ ఇవ్వడానికి టీకాలు అందుబాటులో లేవంటున్నారు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమస్య ఉండడంతో జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. త్వరలో వస్తాయి.. డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల సరఫరాకు సంబంధించి ఇదివరకే అధికారులకు నివేదించాం. త్వరలోనే జిల్లాకు టీకాలు వస్తాయి. కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు సంబంధించి సరిపోయేంత ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతాం. - జైపాల్‌రెడ్డి, ఈఈ, కేంద్ర ఔషధ గిడ్డంగి, నిజామాబాద్ -
ఆ ఒక్క ఇంజెక్షన్ చాలు
రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన తాజా పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని ఈ కొత్త పరిశోధన. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మెసోబ్లాస్ట్ అనే ఓ ఫార్మా కంపెనీ ఉంది. ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు 100 మందికి మూలకణాలు అందించింది. వెన్నెముకలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీల్లో ద్రవం పూర్తిగా ఇంకిపోయినప్పుడు చిన్నపాటి కదలికలకూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వారికి ఇతరుల ఎముక మజ్జలోంచి సేకరించిన మూలకణాలను ఎక్కించినప్పుడు వారిలో నొప్పి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిసింది. కొంతమందిలో దాదాపు రెండేళ్ల పాటు నొప్పి లేకపోగా.. కొంతమందికి సమస్య మూడేళ్ల తర్వాత గానీ తిరిగిరాలేదు. తాము పరిశోధనలు చేసిన వందమందిని ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు వెన్నెముకలోని సమస్యలు చాలా వరకూ తగ్గిపోయినట్లు తెలిసిందని మెసోబ్లాస్ట్ సీఈవో సిలివూ ఇటెస్కూ తెలిపారు. -
ఇంజెక్షన్ వికటించి యువకుడి మృతి
ఆర్ఎంపీపై కేసు నమోదు పరారీలో డాక్టర్ నాగోలు: ఇంజెక్షన్, మాత్రలు వికటించడంతో ఓ బైక్ మెకానిక్ మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగోలు జైపురికాలనీకి చెందిన వంట శివ (18) నాగోలులో బైకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం శివకు జ్వరం రావడంతో హనుమాన్‌నగర్‌లోని ఆర్ఎంపీ శంకర్ వద్దకు వెళ్లాడు. శంకర్ నాలుగు నెలలుగా ఇంట్లోనే క్లినిక్ఏర్పాటు చేసి స్థానికులకు వైద్యం చేస్తున్నాడు. మొదటిరోజు శివకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అయినా జ్వరం తగ్గకపోగా చేతులు, కాళ్లు లాగడంతో శివ మరోసారి శనివారం ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. మరోసారి రెండు ఇంజెక్షన్లు ఇవ్వడంతో శివ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. దీంతో శివను నాగోలులోని శ్రీలక్ష్మీ నరసింహ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స కోసం కామినేనికి తరలించాలని చెప్పడంతో కామినేనిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శివ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఆర్ఎంపీ డాక్టర్ శంకర్ నిర్లక్ష్యం వల్లే శివ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అప్పటికే ఆర్ఎంపీ డాక్టర్ శంకర్ పరారయ్యాడు. మృతుడి తండ్రి కొమరయ్య ఫిర్యాదు ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు శంకర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల క్రితం ఇదే కాలనీలో నకిలీ డాక్టర్ మూర్తి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి యాదగిరి అనే వ్యక్తి మృతి చెందగా తాజాగా ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా పైస్థాయి అధికారులు స్పందించి నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి ఇంజక్షన్ , వ్యక్తి, మృతి injuction, person, died Injection reaction కారంపూడి (గుంటూరు) : ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన కారంపూడిలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా వున్నాయి. స్థానిక ఇందిరా నగర్ కాలనీలో ముత్యాలంపాటి సత్యనారాయణ అనే రైతు అప్పుల బాధ తాళలేక మృతి చెందాడు. ఆయనను చూసేందుకు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువు ముత్యాలంపాటి కృష్ణ తనకు నడుములో నొప్పి వస్తోందని చెప్పాడు. దీంతో బంధువులు దగ్గరల్లోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కృష్ణ మృతి చెందాడు. దీంతో దగ్గరి బంధువు మృతితో బాధపడుతున్న అక్కడివారికి మరొకరు మృతి చెందాడని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారు ఎవరినీ నిందించలేదు. తప్పొప్పులు ఎంచలేదు. బాధను పంటి బిగువనే వుంచుకుని మృతదేహాన్ని స్వగ్రామం ప్రకాశం జిల్లా రావిపాడుకు తరలించారు. -
టీకాతో ఆరోగ్యానికి భరోసా
అనంతపురం సిటీ: చిన్నారులకు టీకా వేయించడం ద్వారా వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, డాక్టర్ వెంకటరమణ, ప్రాంతీయ సర్వెలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రగత్ సూచించారు. బుధవారం స్థానిక జిల్లా ఆరోగ్యశాఖాధి కార్యాలయంలోని సమావేశ భవనంలో నిర్వహించిన కమ్యూనీటి ఆర్గనైజర్ల సమీక్షలో ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించి అనంతను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
12 మంది పిల్లలకు పశువుల ఇంజక్షన్
కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఘటన కోలారు: మానసిక వ్యాధిగ్రస్తురాలైన ఓ మైనర్ బాలిక 12 మంది పిల్లలకు పశువులకు వేసే మందుతో ఇంజక్షన్ చేయగా బాధితులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకా నక్కలగుడ్డ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీనివాసపురం తాలూకా మరంపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక శైలజ నక్కలగుడ్డకు చేరుకొని తాను నర్సునని, పల్స్ పోలియో తర్వాత పిల్లలకు ఇంజక్షన్ చేసేందుకు గౌనిపల్లి పీహెచ్సీ వైద్యులు తనను పంపారని స్థానికులకు తెలిపింది. అనంతరం 12 మంది పిల్లలకు పశువులకు వేసే మెలాక్సికోం అనే మందులతో ఇంజక్షన్ చేసింది. కొంత సేపటికి పిల్లలు అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలారు ఆర్ ఎల్ జాలప్ప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు శైలజ(13)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఆ బాలికకొంత కాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతున్నట్లు తేలింది. -
ఖమ్మం జిల్లాలో సూదిగాడి కలకలం