inox Wind
-
ఐపీవోకు ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ
రాజ్‌కోట్: విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఐనాక్స్ విండ్ అనుబంధ సంస్థ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు రానుంది. వచ్చే 30–45 రోజుల్లో ఐపీవోను ప్రకటించే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో కైలాష్ లాలా తారాచందానీ తెలిపారు. జూన్ 17న దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించనుంది. రూ. 370 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, మరో రూ. 370 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ఐనాక్స్ విండ్.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి ప్రయత్నించడం ఇది రెండోసారి. ఫిబ్రవరిలో ఒకసారి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ ఏప్రిల్‌లో దాన్ని ఉపసంహరించుకుంది. అయితే, ఇందుకు ఎలాంటి కారణాలు వెల్లడి కాలేదు. చదవండి: బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు! -
ఐనాక్స్ విండ్ రుణరహితం
ముంబై: పబ్లిక్ ఇష్యూ తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పవన విద్యుత్ సొల్యూషన్స్ సంస్థ ఐనాక్స్ విండ్ తాజాగా పేర్కొంది. ఐపీవో చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ అనుమతుల కోసం చూస్తోంది. ప్రమోటర్లు కంపెనీకి పెట్టుబడులు అందించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు.. ఐపీవో నిధులను వెచ్చించడం ద్వారా రుణరహితంగా మారనున్నట్లు వివరించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీకి 2022 జూన్‌కల్లా రూ. 1,718 కోట్ల స్థూల రుణ భారం నమోదైంది. రూ. 222 కోట్లమేర నగదు నిల్వలున్నాయి. నికరంగా రూ. 1,495 కోట్ల రుణాలను కలిగి ఉంది. అయితే ప్రయివేట్ ప్లేస్‌మెంట్‌కింద రెండు ప్రమోటర్ సంస్థలు మార్పిడిరహిత బాండ్ల ద్వారా రూ. 800 కోట్లను కంపెనీకి అందించనున్నట్లు ఐనాక్స్ విండ్ తెలియజేసింది. ఐనాక్స్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ రూ. 600 కోట్లు, ఐనాక్స్ విండ్ ఎనర్జీ రూ. 200 కోట్లు చొప్పున పంప్చేయనున్నాయి. వీటితోపాటు ఐపీవో నిధులను సైతం రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ఐనాక్స్ విండ్ వివరించింది. తద్వారా ఐపీవో తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేసింది. -
నిధుల బాటలో ఐనాక్స్ విండ్..ఎన్ని వందల కోట్లంటే!
న్యూఢిల్లీ: విండ్ ఎనర్జీ సంస్థ ఐనాక్స్ విండ్ నిధుల సమీకరణ బాట పట్టింది. ఈక్విటీ షేర్ల, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 402.5 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ప్రిఫరెన్షియల్ మార్గంలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ప్రమోటర్లు రూ. 150 కోట్లు సమకూర్చనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ప్రమోటరేతర విదేశీ కంపెనీ సమేనా గ్రీన్ లిమిటెడ్ ప్రిఫరెన్షియల్ షేర్లు, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 153 కోట్లు అందించనున్నట్లు పేర్కొంది. ఇదే విధంగా లెండ్ లీజ్ కంపెనీ ఇండియా సైతం రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. -
సుజ్లాన్ జోరు
నెల రోజుల్లో 55 శాతం వృద్ధి ముంబై: పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్ బుధ వారం 11 శాతం పెరిగింది. ఇదే రంగంలో కార్యకలాపాలు నిర్వహించే ఐనాక్స్విండ్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రారంభమైన నేపథ్యంలో సుజ్లాన్ షేర్‌కు డిమాండ్ పెరిగింది. గత నెల 16న సన్ ఫార్మా దిలిప్ సంఘ్వి రూ.1,800 కోట్లతో ఈ కంపెనీలో 23 శాతం వాటాను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈషేర్ జోరుగా పెరుగుతోంది. గత నెల 16ను రూ.19.14గా ఉన్న ఈ షేర్ ధర బుధవారం నాటికి 55 శాతం వృద్ధితో రూ.29.65 వద్ద ముగిసింది. గత ఏడాది జూన్ నుంచి చూస్తే ఇది గరిష్ట స్థాయి. బుధవారం నాడు ఎన్ఎస్ఈలో 15.3 కోట్లు, బీఎస్ఈలో 3.4 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఐనాక్స్ ఐపీఓ ప్రారంభమైన నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీని రూ.30 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. పవన విద్యుత్తుకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తోన ఐనాక్స్ విండ్ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ రూ.315-325 రేంజ్లో ఉంది, దీంతో చూస్తే సుజ్లాన్ ఎనర్జీ షేర్ చౌకగా లభ్యమవుతోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది.