Inspectors transfer
-
మనోడే.. పోస్టింగ్ ఇచ్చేయండి
కర్నూలు: రకరకాల సిఫారసులు, భారీ పైరవీలతో కర్నూలు రేంజ్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు పోస్టింగులు దక్కించుకున్నారు. వన్‌సైడ్‌గా పనిచేస్తామని చెప్పడమే కాకుండా పోస్టుకు తగినట్లుగా సమర్పించుకున్న వారికి కుర్చీలు దక్కాయన్న చర్చ జరుగుతోంది. కర్నూలు రేంజ్ పరిధిలో 35 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 13 మందికి, నంద్యాల జిల్లాలో 9 మందికి కలిపి 22 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది.రెడ్‌బుక్ స్క్రీనింగ్‌తో సీఐల జాబితా విడుదలఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ సీఐల జాబితాను రెడీ చేసి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సమర్పించారు. అన్ని అర్హతలు పరిశీలించి వారం రోజుల క్రితమే జాబితా పోలీస్ హెడ్ క్వార్టర్‌కు చేరింది. అయితే తీవ్ర ప్రతిష్టంభన తర్వాత రెడ్ బుక్ స్క్రీనింగ్‌తో జాబితా విడుదలైనట్లు కొంతమంది పోలీసు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వారికి ప్రజాప్రతినిధుల లేఖలు చాలా వరకు పనిచేశాయి. సమర్థులైన పోలీసు అధికారులు స్టేషన్లో ఉంటే శాంతిభద్రతల పరిరక్షణ సవ్యంగా సాగుతుందన్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియనిదేమీ కాదు. అయితే అధికార పార్టీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన కొందరు గ్రూపుగా ఏర్పడి రేంజ్ పరిధిలో పోస్టింగుల వ్యవహారంలో చక్రం తిప్పారనే చర్చ జరుగుతోంది. కర్నూలు పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లు ఉండగా కర్నూలు టూటౌన్‌కు సీసీఎస్‌లో ఉన్న జి.వి.నాగరాజరావును నియమించి అక్కడున్న సీఐ ఇంతియాజ్ బాషాను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే కర్నూలు ఎస్హెచ్ఆర్సీలో పనిచేస్తున్న బి.రామకృష్ణ కడప వన్‌టౌన్‌కు బదిలీ అయ్యారు. -
వరుస ఘటనలు.. హైదరాబాద్‌లో ఒకేసారి 69 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలం తర్వాత నగరంలో ఒకేసారి భారీ స్థాయిలో ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 69 మందికి స్థాన చలనం కల్పిస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన కొన్నేళ్లుగా నగరంలో బదిలీలు జరుగుతున్నప్పటికీ గరిష్టంగా ఐదు స్థానాలకే పరిమితం అవుతున్నాయి. ఆనంద్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికారులు, సిబ్బంది పనితీరు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. వివిధ మార్గాల్లో, అనేక కోణాల్లో సమాచారం సేకరించి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో పనితీరు, సీనియారిటీ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో పంజగుట్ట ఇన్స్పెక్టర్గా ఉన్న ఎం.నిరంజన్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేసిన ఆనంద్ ఆ స్థానంలో సీసీఎస్ నుంచి సి.హరి చంద్రారెడ్డిని నియమించారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ఇద్దరి అధికారులు కొత్త స్థానాల్లో బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరిగి పాత స్థానాల్లోకి మారాల్చి వచ్చింది. తాజా బదిలీల్లో మళ్లీ యథాతధంగా పోస్టింగ్స్ వచ్చాయి. చదవండి: ఖైదీ నెంబర్ 2001.. నాగేశ్వర్రావు రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు కాగా ఇటీవల నగర పోలీసు అధికారుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మారేడుపల్లి సీ నాగేశ్వరరావు అత్యాచారం కేసులో ఇరుక్కోగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి ఓ యువతిని మోసం చేసిన ఘటనలో మల్కాజ్‌గిరిలో సీసీఎస్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్‌పై కేసు నమోదైంది. ఇలా పోలీసు అధికారులకు సంబంధించి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలో హైదరాబాద్ సీపీ ఆనంద్ ఈ బదిలీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చదవండి: హిమాయత్ సాగర్: ప్రమాదకర విన్యాసాలతో యువకులు -
సిద్ధమైన పోస్టింగ్‌ల జాబితా
రెండు, మూడు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం జిల్లాలో భారీగా మార్పులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎస్పీలు, డీఎస్పీల స్థాయిలో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో కీలకమైన ఇన్స్పెక్టర్ల బదిలీలపై దృష్టి సారించింది. వరంగల్ రీజియన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు ముగియనుంది. నెల క్రితం ఉత్తర్వులు ఇచ్చి నిలిచిన ఇన్స్పెక్టర్ల బదిలీల జాబితాను పోలీసు శాఖ సిద్ధం చేసింది. రెండు, మూడు రోజుల్లోనే బదిలీల ఆదేశాలు ఇక ఇన్స్పెక్టర్ల బదిలీలు వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇన్స్పెక్టర్ల బదిలీల ఉత్తర్వులు ఇప్పటికే రావాల్సి ఉండగా.. అసెంబ్లీ సమావేశాల కారణంగానే ఉత్తర్వుల విడుదల ఆగిపోయినట్లు పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే బదిలీ ఉత్తర్వులు వస్తాయని పేర్కొంటున్నాయి. సాధారణ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వరంగల్ రీజియన్‌లో ఇన్స్పెక్టర్ల బదిలీలు జరగలేదు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 29 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ అక్టోబరు 17న ఉత్తర్వులు ఇచ్చింది. 24 గంటల్లోనే నిలిపివేసింది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలను పక్కనబెట్టి పోలీసు ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం పోస్టింగ్‌లు ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని అప్పడు ప్రచారం జరిగింది. దీనికి తగినట్లుగానే ఇన్స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో ప్రజాప్రతినిధుల నుంచి తాజాగా ప్రతిపాదనలు వెళ్లాయి. వీటి ఆధారంగానే బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిసింది. ఇన్స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో పూర్తిగా ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలకే ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది బదిలీ ఉత్తర్వులతో స్పష్టత రానుంది. ఇన్స్పెక్టర్ల బదిలీలకు సంబంధించి కొందరి పోస్టింగ్‌లపై స్పష్టత వచ్చినట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. మడికొండ, హసన్‌పర్తి, గీసుగొండ ఇన్స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తుది దశలో మార్పులు లేకుంటే జాబితా ఇలా ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం.