International Cricket Academy
-
ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న BCCI నెట్ వర్త్ ఎన్ని కోట్లో తెలుసా!
-
దేవరపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ
దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఎంఎస్కే అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్, జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ తెలిపారు. దేవరపల్లిలోని హైవే సమీపంలో అకాడమీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. అనంతరం స్థానిక ఏఎస్ఆర్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో ఎం.ఎస్.కె.ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, యూఎస్ఏలో రెండు అంతర్జాతీయ క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారిణులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. అమరావతి సమీపంలోని నంబూరులో కూడా అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేవరపల్లి అకాడమీలో ప్రతి నెలా ఎనిమిది మ్యాచ్‌లు జరిగేలా చూస్తామన్నారు. త్రీ లెవెల్ కోచ్‌లు ఇద్దరు ఉంటారని, అకాడమీల వద్ద ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని చెప్పారు. మండలంలో జాతీయ మహిళా క్రికెట్ క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నందున ఈ ప్రాంతంలో వారిని ప్రోత్సహించి భారత జట్టులో ఆడే విధంగా తీర్చిదిద్దుతానని వివరించారు. తాను 11 ఏళ్ల వయస్సులో అండర్–12 క్రికెట్ ఆడానని ఆయన గుర్తు చేసుకున్నారు. శాప్ మాజీ డైరెక్టర్ పి.రవీంద్రనాథ్, రాష్ట్ర క్రికెట్ అకాడమీ సీనియర్ కోచ్ హమానుల్లా తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎం.ఎస్.కె.ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు మస్తాన్‌రెడ్డి, ప్రసన్న, పీడీలు ఓరుగంటి నాగరాజు, ఓరుగంటి రామకృష్ణ, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మెంటర్ గా ధోనీ!
టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తులో కోచ్ కావాలనుకుంటాన్నాడా.. అంటే క్రికెట్ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ క్రెయిగ్ మెక్ డెర్మాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని స్టార్ట్ చేస్తున్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ను ఎంచుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే ఎంఎస్ ధోనీకి మెంటర్ గా బాధ్యతలు అప్పగించాడు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఆ అకాడమీ ప్రమోషన్ ఈవెంట్లో ధోనీ, క్రెయిగ్ డార్మెట్ పాల్గొన్నారు. ఈ అకాడమీలో క్రికెట్‌కు సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. స్పోర్ట్స్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ ఇన్ స్పోర్ట్స్ లాంటి ప్రత్యేకమైన కోర్సులను ఆఫర్ చేస్తున్నట్టు ధోనీ తెలిపాడు. చాలామంది తెలివైనవాళ్లు ఆటల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. వీరు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని, కానీ ఒకే రంగంపై పూర్తిగా దృష్టిసారించాలని ధోనీ పిలుపునిచ్చాడు. క్రెయిగ్ అకాడమీలో అప్పుడప్పుడు శిక్షణలో ధోనీ తన సేవలను అందించనున్నాడు. కొంతకాలం తర్వాత ధోనీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ను కూడా స్టార్ట్ చేస్తాడని క్రెయిగ్ పేర్కొన్నాడు. అకాడమీ లాంటి వాటిపై సాధారణంగా కోచ్ తరహా ఆలోచనలున్నవాళ్లు మాత్రమే దృష్టిసారిస్తారు. కొన్నేళ్ల తర్వాత కోచ్ పదవికి ధోనీ కచ్చితంగా రేసులో నిలుస్తారని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. -
అకాడమీని మూసేసిన అజ్మల్
కరాచీ: పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఫైసలాబాద్‌లోని తన అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని తాత్కాలికంగా మూసివేశాడు. అకాడమీకి ఇటీవల తరచూ బెదిరింపులు వస్తుండడంతో ప్రస్తుతం ఐసీసీ సస్పెన్షన్‌లో ఉన్న అజ్మల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘అకాడమీపై దాడి చేస్తామని హెచ్చరికలు రావడంతో తాత్కాలికంగా మూసివేయాలని పంజాబ్ (పాక్) ప్రభుత్వం సూచించింది.మెరుగైన భద్రతా సౌకర్యాలు ఏర్పరిచే వరకు మూసివేత కొనసాగుతుంది. ఇక్కడ 198 మంది బాలబాలికలు ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నారు. వీరి భద్రతపై ఎలాంటి రిస్క్‌ను తీసుకోదలుచుకోలేదు. అందుకే ప్రస్తుతం ఇదే సరైన నిర్ణయంగా భావిస్తున్నాను’ అని అజ్మల్ వివరించాడు.