అకాడమీని మూసేసిన అజ్మల్
కరాచీ: పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఫైసలాబాద్‌లోని తన అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని తాత్కాలికంగా మూసివేశాడు. అకాడమీకి ఇటీవల తరచూ బెదిరింపులు వస్తుండడంతో ప్రస్తుతం ఐసీసీ సస్పెన్షన్‌లో ఉన్న అజ్మల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘అకాడమీపై దాడి చేస్తామని హెచ్చరికలు రావడంతో తాత్కాలికంగా మూసివేయాలని పంజాబ్ (పాక్) ప్రభుత్వం సూచించింది.మెరుగైన భద్రతా సౌకర్యాలు ఏర్పరిచే వరకు మూసివేత కొనసాగుతుంది. ఇక్కడ 198 మంది బాలబాలికలు ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నారు. వీరి భద్రతపై ఎలాంటి రిస్క్‌ను తీసుకోదలుచుకోలేదు. అందుకే ప్రస్తుతం ఇదే సరైన నిర్ణయంగా భావిస్తున్నాను’ అని అజ్మల్ వివరించాడు.