పాకిస్తాన్ గుట్టు రట్టు అయింది.... | local TV crew at Pakistan terrorist naved's hometown in Faisalabad | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ గుట్టు రట్టు అయింది....

Published Fri, Aug 7 2015 6:45 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

పాకిస్తాన్ గుట్టు రట్టు అయింది....

పాకిస్తాన్ గుట్టు రట్టు అయింది....

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ గుట్టు రట్టు అయింది. ఉధంపూర్ దాడి అనంతరం సజీవంగా పట్టుబడిన నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ పాకిస్థానీ కాదని వాదించిన పాక్ అడ్డంగా దొరికిపోయింది. శుక్రవారం పాకిస్తాన్ స్థానిక మీడియా ఫైసలాబాద్లోని నావెద్ ఇంటికి వెళ్లగా, నావెద్ ఫోటోను స్థానికులు కూడా గుర్తు పట్టారు.

మరోవైపు నావెద్ తన కొడుకేనంటూ అతడి తండ్ర మొహమ్మద్ యాకుబ్ గురువారమే అంగీకరించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం లష్కే తోయిబా తన కొడుకును తీసుకు వెళ్లిందని, ఆ సంస్థలో చేరిన రోజే తన కొడుకు చచ్చిపోయాడనుకున్నానని మొహమ్మద్ యాకుబ్ తెలిపాడు. కాగా  గతంలో ముంబై దాడుల అనంతరం చిక్కిన నర హంతకుడు కసబ్ విషయంలోనూ పాకిస్తాన్ అదే ధోరణి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement