Faisalabad
-
‘ఫిబ్రవరి 14న సిస్టర్స్ డే’
లాహోర్: ఫిబ్రవరి 14 అనగానే అందరికీ గుర్తొచ్చేది వాలెంటైన్స్ డే. అలాంటిది వాలెంట్న్స్ డే నిర్వహించడాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ తప్పుపట్టింది. ఆ రోజున వాలెంటైన్స్ డే కు బదులు సిస్టర్స్ డే జరపాలనే నిర్ణయం తీసుకుంది. ఫైసలాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ జాఫర్ ఇక్బాల్ రణ్‌ధవా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర బోర్డు సభ్యులు కూడా ఆమోదించారు. పాక్ సంస్కృతితోపాటు, ఇస్లాం సంప్రదాయాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాఫర్ తెలిపారు. సిస్టర్స్ డేలో భాగంగా ఫిబ్రవరి 14న మహిళలకు స్వార్ఫ్లు, దుస్తులు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. దీనిపై జాఫర్ మాట్లాడుతూ.. ‘సిస్టర్ డే నిర్ణయం విజయవంతం అవుతుందో కాదో తెలియదు. ముస్లింలకు వాలెంటైన్స్ డే వల్ల ప్రమాదం పొంచి ఉంది. కానీ ఈ ముప్పును కూడా అవకాశంగా మలచుకోవాలి. మహిళల పట్ల మాకు చాలా గౌరవం ఉంది. మహిళ సాధికారతను మరచిపోకూడదు. సోదర సోదరిమణుల బంధం కంటే ప్రేమ గొప్పదా?. పాశ్చాత్య సంస్కృతి వెంట పరుగెత్తకుండా జాగ్రత్త వహించాల’ని అన్నారు. కాగా, వాలెంటైన్స్ డే వేడుకలను జరపడంపై పాక్‌లో చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. మెజారిటీ ప్రజలు ఇందుకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. 2017, 2018లలో వాలెంటైన్స్ డే జరపడాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు నిషేధించింది. అలాగే అందుకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచురించకూడదని ప్రింట్, ఎలక్ర్టిక్ మీడియాకు ఆదేశాలు జారీ చేసింది. -
పాక్‌లో విష మద్యం తాగి 32 మంది మృతి
లాహోర్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో విషపూరిత మద్యం సేవించి 32 మంది మరణించారు. 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. టోబా టెక్ సింగ్ నగరంలోని ముబారకాబాద్ క్రైస్తవ కాలనీలో ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గత శనివారం వీరంతా మద్యాన్ని సేవించారు. మరుసటి రోజు ఉదయానికి కొందరు మరణించగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. ఘటనకు కారకులైన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తుకు విచారణ కమిటీని నియమించారు. పాక్‌లో ముస్లింలకు మద్యం అమ్మకం, వినియోగాలపై నిషేధం ఉండగా, మైనారిటీలు, విదేశీయులకు పలు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. గత మార్చిలో హోలీ వేడుకల్లో భాగంగా కల్తీ మద్యాన్ని సేవించడంతో 45 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో 35 మంది హిందువులున్నారు. -
పాకిస్తాన్ గుట్టు రట్టు అయింది....
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ గుట్టు రట్టు అయింది. ఉధంపూర్ దాడి అనంతరం సజీవంగా పట్టుబడిన నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ పాకిస్థానీ కాదని వాదించిన పాక్ అడ్డంగా దొరికిపోయింది. శుక్రవారం పాకిస్తాన్ స్థానిక మీడియా ఫైసలాబాద్‌లోని నావెద్ ఇంటికి వెళ్లగా, నావెద్ ఫోటోను స్థానికులు కూడా గుర్తు పట్టారు. మరోవైపు నావెద్ తన కొడుకేనంటూ అతడి తండ్ర మొహమ్మద్ యాకుబ్ గురువారమే అంగీకరించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం లష్కే తోయిబా తన కొడుకును తీసుకు వెళ్లిందని, ఆ సంస్థలో చేరిన రోజే తన కొడుకు చచ్చిపోయాడనుకున్నానని మొహమ్మద్ యాకుబ్ తెలిపాడు. కాగా గతంలో ముంబై దాడుల అనంతరం చిక్కిన నర హంతకుడు కసబ్ విషయంలోనూ పాకిస్తాన్ అదే ధోరణి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
అకాడమీని మూసేసిన అజ్మల్
కరాచీ: పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఫైసలాబాద్‌లోని తన అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని తాత్కాలికంగా మూసివేశాడు. అకాడమీకి ఇటీవల తరచూ బెదిరింపులు వస్తుండడంతో ప్రస్తుతం ఐసీసీ సస్పెన్షన్‌లో ఉన్న అజ్మల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘అకాడమీపై దాడి చేస్తామని హెచ్చరికలు రావడంతో తాత్కాలికంగా మూసివేయాలని పంజాబ్ (పాక్) ప్రభుత్వం సూచించింది.మెరుగైన భద్రతా సౌకర్యాలు ఏర్పరిచే వరకు మూసివేత కొనసాగుతుంది. ఇక్కడ 198 మంది బాలబాలికలు ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నారు. వీరి భద్రతపై ఎలాంటి రిస్క్‌ను తీసుకోదలుచుకోలేదు. అందుకే ప్రస్తుతం ఇదే సరైన నిర్ణయంగా భావిస్తున్నాను’ అని అజ్మల్ వివరించాడు. -
హైకోర్టు ఎదుటే పరువు హత్య
లాహోర్: తమ అభీష్టానికి విరుద్దంగా వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందనే అక్కుసుతో పాకిస్థాన్ లో 25 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులే పాశవికంగా హత్య చేశారు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా కర్కశంగా కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. లాహోర్ హైకోర్టు ఎదుటే ఈ దారుణోదంతం చోటు చేసుకోవడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫైసలాబాద్ కు చెందిన ఫర్జానా పర్వీన్ కొన్ని నెలల క్రితం జరన్వాలాకు చెందిన మహ్మద్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ఫర్జానా కుటుంబ సభ్యులు ఇక్బాల్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ కేసు విషయమై కోర్టు వచ్చిన ఫర్జానాను ఇక్బాల్ నుంచి తీసుకుపోయేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి ఆమెను లాక్కేందుకు యత్నించారు. తమ ప్రయత్నం విఫలమవడంతో ఫర్జానా తండ్రి, సోదరుడితో 20 మంది కుటుంబ సభ్యులు వారిపై కర్రలు, ఇటుకలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఫర్జానా మృతి చెందగా, ఇక్బాల్ తప్పించుకున్నాడు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ఫర్జానా తండ్రి, సోదరుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో దాదాపు 900 మంది మహిళలు పాకిస్థాన్ లో పరువు హత్యలకు బలైయ్యారని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.