international passengers
-
కోవిడ్ కలకలం.. భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 11 వేరియంట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ముగిసిపోయిందనుకునేలోపే మరోసారి పంజా విసురుతోంది. చైనాతోపాటు వివిధ దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల భయం మొదలవ్వడంతో భారత్‌తో సహా అన్నీ దేశాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. దేశంలో కూడా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బి.ఎఫ్.7 కేసులు వెలుగుచూడటంతో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు అన్ని విమానాశ్రయాల్లోనూ మాస్కులు ధరించాలని తెలిపింది. ఈ క్రమంలో విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ రకాల వేరియట్ల కేసులు బయట పడుతున్నాయి. తాజాగా డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు చేసిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వైరస్ వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియట్లేనని స్పష్టం చేశాయి. ఇందులో కొత్త వేరియంట్లేవీ లేవని.. ఇవన్నీ గతంలో దేశంలో నమోదైనవేనని పేర్కొన్నాయి. మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు చేయగా.. 124 మందికి పాజిటివ్‌గా తెలినట్లు పేర్కొన్నాయి. ఈ 124 మందిలో 40 మంది నమూనాల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 14 నమూనాల్లో.. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1 వేరియంట్ ఆనవాళ్లు.. ఒక శాంపిల్‌లో బీఎఫ్ 7.4.1 వేరియంట్ గుర్తించారు. కాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 188 కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,554గా ఉన్నాయి. రికవరీ రేటు 98.8 శాతంగా ఉంది. చదవండి: చైనాను వణికిస్తున్న కరోనా.. వీధుల్లోనే శవాలను కాల్చేస్తున్నారు.. -
Covid-19: ఈ 6 దేశాల మీదుగా వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనసరి చేసింది. తాజాగా కేంద్రం మరోసారి ఇందుకు సంబంధించి నూతన ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఈ ఆరు దేశాల మీదుగా ప్రయాణించి వేరే దేశం నుంచి వచ్చినా సరే ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రయాణికులు 72 గంటలకు మందు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే భారత్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే అనుమతి లేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వారం రోజుల క్వారంటన్ నిబంధనను అమలు చేస్తోంది. చదవండి: Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం.. -
కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..!
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత్ తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే రాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధనలు తీసుకురానుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 40 రోజులు చాలా కీలకమని, జనవరిలో కరోనా కేసులు పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించారు అధికారులు. దేశంలో నాలుగో వేవ్ వచ్చినా మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. గతంలో తూర్పు ఆసియాలో కోవిడ్ విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్‌లో కొత్త వేవ్ వచ్చిందని గుర్తు చేశాయి. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్, ‘ఎయిర్ సువిధ’ ఫారమ్‌లో వివరాల నమోదు వంటి నిబంధనలు మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సుమారు 6000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. అందులో గత రెండు రోజుల్లోనే 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా బుధవారం సందర్శించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కరోనా అలర్ట్: జనవరి గండం ముందే ఉంది.. కేంద్రం వార్నింగ్ ఇదే.. -
రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది భారత్. రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తోంది. అయితే, గడిచిన రెండు రోజుల్లోనే భారత్‌కు వచ్చిన 39 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 6000 మందికి రాండమ్‌గా పరీక్షలు నిర్వహించినట్లు విమానయాన శాఖ అధికారవర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియీ గురువారం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే 40 రోజులు కీలకం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో వచ్చే 40 రోజులు కీలకంగా మారనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. వచ్చే 40 రోజుల్లో భారత్‌లో కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, గతంలోని డేటా ప్రకారం జనవరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఇదీ చదవండి: తమిళనాడు ఎయిర్‌పోర్టుల్లో నలుగురికి పాజిటివ్.. చైనా వేరియంట్? -
భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త.. ఆ నిబంధన ఎత్తివేత
న్యూఢిల్లీ: ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా మహమ్మారి కట్టడి కోసం తీసుకొచ్చిన ‘ఎయిర్ సువిధ’ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను ఎత్తివేసింది. అయితే, ‘ఎయిర్ సువిధ’ నిబంధనను ఎత్తివేసినప్పటికీ కొన్ని అంశాలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలని కోరింది. ప్రయాణ సమయంలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లు మాస్కు ధరించాలని, మిగతా ప్రయాణికులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతో పాటు ఏ వ్యాక్సిన్, ఎన్ని డోసులు, ఏ సమయంలో తిసుకున్నారనే వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్టు వివరాలనూ ‘ఎయిర్ సువిధ’ పోర్టల్‌లోని సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో పొందుపరచాల్సి ఉండగా.. తాజాగా ఆ నిబంధనను భారత్ ఎత్తివేసింది. ఈ నిబంధన ఎత్తివేసినప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్ టీకా తీసుకున్న తర్వాతే భారత్‌కు రావడం మంచిదని పేర్కొంది. డీ బోర్డింగ్ సమయంలోనూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌కు వెళ్లాలని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇదీ చదవండి: Viral Video: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు -
Hyderabad: విమానాశ్రయంలో నిబంధనలు కఠినతరం
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఉద్ధృతి దృష్ట్యా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టారు. కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వాటి ఫలితాలు వెలువడే వరకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉండేలా నిబంధనలను కఠినతరం చేశారు. కొద్ది రోజులుగా ఒమిక్రాన్ కేసుల నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కోవిడ్ పరీక్ష ఫలితాలు వెలువడకుండానే కోల్‌కతాకు వెళ్లిపోయాడు. అనంతరం అతనికి కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో అధికారులు గందరగోళంలో పడిపోయారు. ఈ ఉదంతం నేపథ్యంలో పరీక్షలు సమర్థంగా నిర్వహించడంతో పాటు ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. విమానాశ్రయంలో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్తో పాటు, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల ఫలితాలు వెంటనే వచ్చేందుకు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ నిర్వహిస్తున్నారు. ఈ టెస్టు ధర ప్రస్తుతం రూ.3,900 నుంచి రూ.3,400 తగ్గించినట్లు అధికారులు తెలిపారు. (విదేశాల్లో చదువుకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి) పరీక్షల సంఖ్య పెంపు.. ► అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహించే కోవిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచారు. ఇటీవల వరకు రాండమ్‌గా 2 శాతం మంది ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా ఇప్పుడు ఆ సంఖ్యను 5 శాతానికి పెంచారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ఎయిర్‌పోర్టులో టెస్టుల సంఖ్యను పెంచారు. 2 శాతం నుంచి 5 శాతం మంది ప్రయాణికులకు రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ► పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని టిమ్స్‌కు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారు వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ ముప్పు ఉన్నట్లు గుర్తించిన దేశాల సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. బ్రిటన్, దక్షిణకొరియా, బ్రెజిల్, బోట్సువానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయిల్ దేశాలను హైరిస్క్ దేశాలుగా పరిగణిస్తున్నారు. 14 మంది హోటల్ సిబ్బందికి వైద్య పరీక్షలు సొమాలియాకు చెందిన (66)ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకి ఉండొచ్చనే అనుమానంతో ఆయన బస చేసిన హోటల్ 14 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఒమిక్రాన్ అనుమానిత బాధితున్ని టిమ్స్‌కు తరలించకుండా గాంధీలో అడ్మిట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది సహా సాధారణ రోగులు, వారి వెంట వచ్చిన సహాయకులు ఆందోళన చెందుతున్నారు. తగ్గిన ప్రయాణికుల రద్దీ.. ► ఒమిక్రాన్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు సగానికి పైగా తగ్గాయి. అత్యవసర ప్రయాణికులు మాత్రమే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. ఒమిక్రాన్ కంటే ముందే హైదరాబాద్‌కు చేరుకున్నవారు తిరిగి బయలుదేరుతున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే వారిలో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో నగరానికి వస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ► వారం రోజుల క్రితం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 70 అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 38కి పడిపోయింది. ప్రయాణికులు సైతం రోజుకు 3 వేల నుంచి 5 వేల వరకు ఉంటున్నారు. ఇటీవల వరకు రోజుకు సుమారు 8 వేల మంది ప్రయాణం చేసినట్లు అంచనా. ► దేశంలోని వివిధ నగరాల మధ్య డొమెస్టిక్ విమానాల రాకపోకలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారం రోజుల క్రితం 55 వేల మందికిపైగా రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 50 వేలకు పడిపోయింది. విదేశీయుల కోసం ప్రత్యేక ఓపీ, ఐపీ నగరంలోని అపోలో, కేర్, ఏఐజీ, విరించి, మెడికవర్, యశోద, కిమ్స్, సన్‌షైన్ తదితర కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ అనుమానిత విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఓపీ, ఐపీ వార్డులను ఏర్పాటు చేశారు. అంతేకాదు వీరికి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. -
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న విమాన ఛార్జీలు
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చెల్లించే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఎ.ఎస్.ఎఫ్) ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న నేపథ్యంలో విమాన ఛార్జీలు ప్రియం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు రూ.160 నుంచి రూ.200కు, అంతర్జాతీయ ప్రయాణీకులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2021 నుంచి విమాన టిక్కెట్లపై వర్తిస్తాయి. గత రెండు నెలలుగా జెట్ ఇంధన ధరలు పెరగడంతో విమాన చార్జీలు ఇప్పటికే 30 శాతం పెరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి చార్జీలు పెరగడంతో గగన విహారం భారం కానుంది. ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జారీ చేసిన ఉత్తర్వులలో.. వివిధ వర్గాలలో ఉన్న కొద్దిమంది ప్రయాణీకులకు ఈ రుసుము చెల్లింపు విషయంలో మినహాయింపు ఉంది. వీరిలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, వైమానిక సిబ్బంది, ఒకే టికెట్‌పై కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణీకులకు ఈ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని మార్చి 31, 2021 నుంచి 2021 ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు పొడగించినట్లు గమనించాలి. అయితే, ఇది కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి వర్తించదు. చదవండి: ఎలోన్ మస్క్ టెస్లా విషయంలో కీలక నిర్ణయం! వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా! -
స్టాంపింగ్ తంటా.. మధు యాష్కీ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్టాంప్ వేయడానికి ఉపయోగించే సిరా నాణ్యతపై ఆందోళకర విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు వేసే స్టాంపింగ్ తరువాత తన చేతిపైవచ్చిన కెమికల్ రియాక్షన్ గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీగౌడ్ ట్వీట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న ఇంక్ కారణంగా తన చేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ట్యాగ్ చేశారు. దీన్ని పరిశీలించాలంటూ సంబంధిత ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ హర్దీప్ పూరి ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి సత్వర స్పందనపై మధు యాష్కీ సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవం మరో ప్రయాణికుడికి రాకూడదని కోరుకున్నారు. అటుఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ స్పందించిన ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి విలయంతరువాత విదేశీ విమాన ప్రయాణీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల క్వారంటైన్ నిబంధనల కనుగుణంగా కొన్ని విమానాశ్రయాలలో స్టాంపింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో 74,441 కరోనా కేసులతో, ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 66,23,815కు చేరింది. మరణించిన వారి సంఖ్య 1,02,695 గా ఉంది. Dear @HardeepSPuri Ji, can you please look into the chemical being used at Delhi airport for stamping on passengers coming from abroad? Yesterday I was stamped at @DelhiAirport and this is how my hands look now. pic.twitter.com/Gt1tZvGc8L — Madhu Goud Yaskhi (@MYaskhi) October 4, 2020 -
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సువిధ పోర్టల్
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చే వారు క్వారంటైన్లో ఉండకుండా నేరుగా ఇంటికి వెళ్లడానికి ఇప్పుడు అవకాశం లభించింది. దీని కోసం ఎయిర్ సువిధ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రయాణికులు తప్పనిసరిగా పూరించాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఈ పోర్టల్ ద్వారా పూర్తి చేయాలి. తప్పనిసరి ఇనిస్టిట్యూషన్ క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఆన్లైన్ ఫాల్ట్‌ఫామ్‌ను పౌర విమానయాన శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మరియు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో రూపొందించినట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (డీఐఏఎల్) శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 8, 2020 నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు తిరిగి వచ్చిన అనంతరం వివిధ ఫారాలను భౌతికంగా తాకే పని లేకుండా కాంటాక్ట్ లెస్ విధానంలో ఎయిర్ సువిధ ద్వారా పూర్తి చేయవచ్చు. క్వారంటైన్ మినహాయింపు కోరే ప్రయాణికులు అయిదు నిర్ధిష్టమైన విభాగాల కింద ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెబ్సైట్ ఠీఠీఠీ. n్ఛఠీఛ్ఛీ జిజ్చీజీటఞౌట్ట.జీn లో ఈ–ఫారంను నింపాలి. విమానం బయలు దేరే సమయానికి కనీసం 72 గంటల ముందు ఈ ఈ–ఫారమ్‌ను ఇతర సంబంధిత డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు కాపీలతో సహా జత చేయాల్సి ఉంటుంది. అయితే ప్రయాణికులు పూర్తి చేయాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌కు మాత్రం ఎలాంటి కాలపరిమితి లేదు. దీనితో విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయాణికులకు ఊరట లభించనుంది. -
ఇక మద్యంపైనా రేషన్!
దేశంలోని అన్ని విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి లాంజిలలో ఇచ్చే మద్యం మీద ఇక రేషన్ పెట్టాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దూర ప్రయాణాలు చేసేవాళ్లలో కొంతమంది ప్రయాణికులు తోటివారి పట్ల, సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో డిపార్చర్ టెర్మినల్స్ వద్ద వారికి ఇచ్చే మద్యం కోటాను తగ్గించాలని ఇటీవలి కాలంలో పలు భారతీయ విమానయాన సంస్థలు పౌర విమానయాన అధికారులను కోరాయి. దాంతో ఎయిర్ ఇండియా కూడా ఇదే బాటలో.. మద్యం కోటాను తగ్గించాలని నిర్ణయించింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశాలకు బిజినెస్, ఫస్ట్ క్లాస్‌లలో ప్రయాణాలు చేసేవారికి లాంజిలలో వోడ్కా, విస్కీ, రమ్ లాంటి డ్రింకులైతే గరిష్ఠంగా మూడు పెగ్గులు మాత్రమే ఇస్తామని, అదే వైన్ అయితే రెండు గ్లాసులు, బీర్ అయితే మూడు బాటిల్స్ మాత్రమే ఇస్తామని ఎయిరిండియా తెలిపింది. వీటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ప్రయాణికులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి కనెక్టింగ్ స్వదేశీ విమానాల్లో ప్రయాణించేవారికి మాత్రం మద్యాన్ని ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంటే ముంబై నుంచి ఢిల్లీ వచ్చి, అక్కడి నుంచి లండన్ వెళ్లే ప్రయాణికులకు ముంబైలో మద్యం ఇవ్వరన్నమాట. ఈ ఉత్తర్వులను ఎయిరిండియా ఇచ్చింది తప్ప విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు చూస్తన్న జీఎంఆర్ సంస్థ కాదని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ఎయిరిండియా ఇలాంటి ఉత్తర్వులను విడుదల చేసింది. తాము కూడా ఇలాంటి నియంత్రణలను అమలుచేస్తున్నట్లు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఇక ముంబైలో అయితే, విస్కీ, వోడ్కా, రమ్, జిన్ లాంటి డ్రింకులు మూడు పెగ్గులలో కూడా 45 మిల్లీలీటర్లకు బదులు 30 మిల్లీలీటర్లు మాత్రమే ఇస్తున్నారు. బీరు మాత్రం మూడు సీసాలు ఇస్తారు. విదేశాల్లోని విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి బోర్డులు కనిపిస్తాయని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.