international status
-
ఐఎఫ్పీఆర్ఐ ఉపాధ్యక్షునిగా మహేంద్రదేవ్
సాక్షి, అమరావతి/తెనాలి: తెలుగు వ్యక్తికి అంతర్జాతీయ హోదా లభించింది. గుంటూరు జిల్లా తుమ్మపూడికి చెందిన ప్రొఫెసర్ మహేంద్ర దేవ్ అమెరికా రాజధాని వాషింగ్టన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ(ఐఎఫ్పీఆర్ఐ) ట్రస్టీ బోర్డు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్బీఐ నిర్వహించే ఇందిరాగాంధీ అభివృద్ధి పరిశో ధనా సంస్థ వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నారు. మహేంద్రదేవ్ గతంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే సెస్‌కు తొమ్మిదేళ్ల పాటు డైరెక్టర్‌గా, కనీస మద్దతు ధరల నిర్ణాయక సంఘం చైర్మన్‌గానూ పని చేశారు. ఐఎఫ్పీఆర్ఐ ఉపాధ్యక్ష హోదాలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సంస్థ 42 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవిని అలంకరించిన రెండో భారతీయుడు మహేంద్ర దేవ్. గతంలో డాక్టర్ ఐషర్ జడ్జ్ అహ్లూవాలియా ఈ పోస్టును అలంకరించారు. ప్రపంచంలో ఆకలి, దారిద్య్రం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను, పరిష్కార మార్గాలను సూచించేందుకు 1975లో ఐఎఫ్పీఆర్ఐ ఏర్పాటయింది. మహేంద్రదేవ్.. ప్రముఖ సాహితీ వేత్త సూర్యదేవర సంజీవదేవ్ తనయుడు. -
విశ్వనగరికి 4,051 కోట్లు
* రాజధానిలో రాచమార్గాలకు అడుగులు * స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం * తొలిదశలో ప్రాధాన్యంగా 20 ప్రాంతాల గుర్తింపు * డీబీఎంటీ విధానంలో ప్రాజెక్టు అమలు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు తొలి అడుగు పడింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా నగరంలో అధునాతన స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్లు/ ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. తొలిదశలో రూ.4,051 కోట్ల మేర పనులకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులిస్తూ మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శనివారం జీవో జారీ చేసింది. భూసేకరణ, ఆస్తుల సేకరణకు అయ్యే వ్యయాన్ని కూడా ఈ నిధుల నుంచే వినియోగించాలని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు తదితర నిర్మాణాలతో పాటు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. తొలిదశ పనులు చేసేందుకు ఇప్పటికే అత్యంత ప్రాధాన్యత కలిగిన 20 ప్రదేశాలు గుర్తించారు. భారీ వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు డీబీఎంటీ (డిజైన్, బిల్డ్, మెయింటైన్, ట్రాన్స్ఫర్)- యాన్యుటీ విధానాన్ని ఎంచుకున్నారు. అంటే ప్రాజెక్టు పనుల్ని ప్రైవేటు సంస్థలే చేపట్టి పూర్తి చేస్తాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక జీహెచ్ఎంసీ వాటికి డబ్బులు తిరిగి చెల్లిస్తుంది. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. కాల వ్యవధి 10 నుంచి 15 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. భారీ ప్రాజెక్టు కావడంతో అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు టెండర్లలో పాల్గొనవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రత్యేక అధికారి సోమేశ్ కుమార్ రాసిన లేఖకు స్పందించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెడ్ సిగ్నళ్ల వద్ద రైట్..రైట్.. నగరంలోని ఆయా ప్రదేశాల్లో ట్రాఫిక్ జాం లేకుండా, రెడ్ సిగ్నళ్ల వద్ద కూడా వాహనదారులు ఆగకుండా వెళ్లేందుకు అవసరాన్ని బట్టి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఒకటి/ రెండు/ మూడు లెవెల్స్‌లో ఫ్లైఓవర్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. మెట్రోరైలు మార్గాలున్న ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో మార్గానికి పై వరుసలో లేదా దిగువ వరుసలో వీటిని ఏర్పాటు చేస్తారు. టెండర్లకు పీఎంయూ .. ఈ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ (పీఎంయూ)ని నియమించింది. కమిటీ చైర్మన్‌గా జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్లను, మెంబర్ కన్వీనర్‌గా జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను, సభ్యులుగా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్, ఫైనాన్స్ (పీఎంయూ) విభాగానికి చెందిన ప్రతినిధిని నియమించింది. భూసేకరణ వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ మేరకు భూ యజమానులతో సంప్రదింపులు జరపాలని, మాస్టర్‌ప్లాన్ రోడ్లకు అమలు చేసిన టీడీఆర్ వంటి విధానాలను అమలు చేయాలని సూచించింది. అభివృద్ధి పనులు చేపట్టనున్న ప్రదేశాలు 1. కేబీఆర్ పార్కు ప్రవేశద్వారం జంక్షన్ 2. మహారాజ అగ్రసేన్ జంక్షన్ (రోడ్డు నంబర్ 12 జంక్షన్) 3. కేన్సర్ హాస్పిటల్ (రోడ్డు నంబర్ 10 జంక్షన్) 4. ఫిల్మ్‌నగర్, 5. రోడ్డు నంబరు 45 జంక్షన్ 6. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ 7. ఎల్బీ నగర్ జంక్షన్ 8. బైరామల్‌గూడ జంక్షన్ 9. కామినేని హాస్పిటల్ జంక్షన్ (ఇన్నర్ రింగ్‌రోడ్డుపై) 10. చింతలకుంట చెక్‌పోస్టు జంక్షన్ 11. రసూల్‌పురా 12. ఉప్పల్ 13. ఒవైసీ హాస్పిటల్ 14. బయో డైవర్సిటీ పార్కు జంక్షన్ 15. అయ్యప్ప సొసైటీ జంక్షన్ 16. రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ 17. బహదూర్‌పురా 18. ఆబిడ్స్ జీపీఓ - చాదర్‌ఘాట్, మలక్‌పేట 19. సైబర్ టవర్స్ జంక్షన్ (ఎలివేటెడ్ రోటరీ కమ్ గ్రేడ్) 20. మైండ్‌స్పేస్ నోట్: వీటిల్లో గ్రేడ్ సెపరేటర్లు/ఫ్లై ఓవర్లు/జ ంక్షన్ల అభివృద్ధి, ఇతరత్రా పనులున్నాయి. -
మాటలకు చేతలకు.. పొంతనకుదిరేనా?
సీఎం ప్రకటనపై నిపుణుల సందేహం తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని తొలుత చెప్పి, ఇప్పడు మాట మార్చిన బాబు రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం తిరుపతిలో ఐటీఐఆర్‌నూ ఏర్పాటుచేస్తామని ఒకసారి.. ఐటీ హబ్‌గా మార్చుతామని మరోసారి భిన్నమైన ప్రకటనలు కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు చేస్తామన్న ఐఐఏ చైర్మన్ అలోక్ సిన్హా.. కాదు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్న బాబు శాసనసభలో హామీలకు నిధులేవి? సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు శాసనసభలో గురువారం ఇచ్చిన హామీల అమలుపై నిపుణులు, రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నా రు. సీఎం చంద్రబాబు జిల్లా ప్రగతిపై గతంలో ఒకలా.. గురువారం మరోలా భిన్నమైన ప్రకటనలు చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. శాసనసభలో గురువారం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్న అంశాన్ని నిపుణులు గుర్తు చేస్తుండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక జూన్ 16న విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్శిటీలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. జూన్ 24న తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని.. కుప్పంలో విమానాశ్రయం, తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గురువారం శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో మాత్రం సెంట్రల్ వర్శిటీని అనంతపురంలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తిరుపతిలో ఐటీఐఆర్ కాదు.. ఐటీ హబ్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పుకొచ్చారు. ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఐఏ) ఛైర్మన్ అలోక్ సిన్హా కుప్పంలో పర్యటించి.. ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. ఆగస్టు 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. గురువారం చంద్రబాబు చేసిన ప్రకటన తద్భిన్నంగా ఉంది. కుప్పంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనకూ.. శాసనసభలో ఇచ్చిన హామీలకు పొంతన కుదరకపోవడంతో వాటి అమలుపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా తమ గొప్పగా చెప్పుకునే యత్నం..: తిరుపతికి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయానికి రూ.వంద కోట్లతో అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు సెప్టెంబరు 26, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఇప్పటికే చేపట్టారు. ఇటీవ ల రేణిగుంట విమానాశ్రయాన్ని పరిశీలించిన ఐఐఏ ఛైర్మన్ అలోక్‌సిన్హా అంతర్జాతీయ విమానాశ్రయంగా రేణిగుంట ఎయిర్‌పోర్టును మార్చలేమని స్పష్టీకరించారు. కేవలం అంతర్జాతీయహోదా కల్పించే పనులే చేయవచ్చునని చెప్పారు. కానీ.. చం ద్రబాబు మాత్రం రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలంటే కనీసం 4,500 ఎకరాల భూమి అవసరం. కానీ.. అక్కడ ఆ మేరకు భూమి అందుబాటులో లేకపోవడం గమనార్హం. చిత్తూరులో అపో లో హెల్త్‌సెంటర్ ఏర్పాటుకు తొమ్మిదేళ్లక్రితమే ఆ సంస్థకు ప్రభుత్వం భూ మి కేటాయించింది. ఆ సంస్థ అక్కడ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ ను తామే ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. కేం ద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐఐటీని మంజూరు చేసింది. ఆ ఐఐటీ నే తిరుపతిలో ఏర్పాటుచేస్తామనిబాబు చెప్పారు. కేంద్రం ఐఐఎస్ఈ ఆర్‌ను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కానీ.. అవేమీ పట్టకుండా తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ను ఏర్పాటుచేస్తామని ప్రకటిచండం గమనార్హం. ఏ ర్పేడులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్(ఎన్ఐఎమ్జెడ్) ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కానీ.. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన శ్రీకాళహస్తి స్పైన్‌పై మాత్రం చంద్రబాబు స్పందించలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మేరకు రూ.1,500 కోట్లతో శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాన్ని పూర్తిచేస్తేనే ఏర్పేడులో ఎన్ఐఎమ్జెడ్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. బడ్జెట్లో నిధులేవీ? తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని గురువారం శాసనసభలో సీఎం ప్రకటించారు. మెట్రోరైల్‌ను కూడా తి రుపతికి తీసుకొస్తామని చెప్పారు. కానీ.. ఇటీవల విశాఖపట్నం, విజయవాడ-తెనాలి-గుంటూరులకు మాత్రమే మె ట్రోరైల్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పడు తిరుపతిలో మెట్రో రైల్‌ను ఏర్పాటుచేసే అంశంపై చంద్రబాబు స్పందించలేదు. మెగా సిటీకి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పిన చంద్రబాబు.. మెట్రో రైల్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెచ్చించాలని చెప్పకనే చెప్పా రు. కానీ.. మెట్రో రైల్ ప్రాజెక్టుకు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇక జిల్లాలో హార్టికల్చర్ జోన్.. ఫుడ్ పార్క్‌లను ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్ర కటించారు. మామిడి తోటలు విస్తారంగా ఉన్న జిల్లాలో హార్టికల్చర్ జోన్ ఏర్పాటుచేయడం ఆహ్వానించదగ్గదే. ఫుడ్ పార్క్దీ అదే పరిస్థితి. కానీ.. తిరుపతి-శ్రీకాళహస్తి-కాణిపాకం ఇప్పటికే ఆధ్మాత్మిక కారిడార్‌గా అనధికారిగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ కారిడార్‌నే అధికారికంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, స్వరముఖి-సోమశిల లింక్ కెనాల్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదు. వీటిని పరిశీలించిన నిపుణులు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా చంద్రబాబు వ్యహరిస్తోన్న తీరును చూస్తే మాటలకు చేతలకు పొంతన కుదిరేట్టు లేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్జాతీయ విమానాశ్రయం.. తూచ్
తిరుపతి ఎయిర్‌పోర్టుకు ఇంటర్నేషనల్ హోదా మాత్రమే! విస్తరణకు అనువుగా లేదన్న అలోక్ సిన్హా కమిటీ నత్తనడకన విమానాశ్రయ విస్తరణ పనులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేవని ఐఐఏ(ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతినిధి బృందం తేల్చిచెప్పింది. కేవలం అంతర్జాతీయ హోదా కల్పిస్తామని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. రోజూ తిరుమలకు వేలాదిమంది భక్తులు వస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ నాణ్యమైన సోనా బియ్యం.. మామిడి, చీనీ, దానిమ్మ, కూరగాయల ఉత్పత్తి జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి రొయ్యలు, చేపలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఉన్న చిత్తూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా సాగుతోంది. దీన్ని పసిగట్టిన కేంద్రం తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తామని అక్టోబర్ 8, 2008న అప్పటి కేంద్ర విమానయానశాఖ మంత్రి ప్రపుల్‌కుమార్ ప్రకటించారు. సెప్టెంబర్ 1, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు హోదా కల్పించే పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆ హామీకి స్థానం కల్పించారు. లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రధాని నరేంద్రమోడీ ఇదే విషయంపై మరోసారి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐఐఏ చైర్మన్ అలోక్ సిన్హా నేతృత్వంలోని ఐఐఏ ప్రతినిధి బృందం మంగళవారం తిరుపతి విమానాశ్రయాన్ని సందర్శించింది. చేతులెత్తేసిన ఐఐఏ.. అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలంటే రన్‌వే కనీసం 12,500 అడుగుల మేర ఉండాలి. కనీసం ఏడాదికి పది మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు(టెర్మినల్, ఎయిర్‌క్రాఫ్ట్ బేస్, కామన్ చెక్ పాయింట్లు, సెల్ఫ్ చెక్ పాయింట్లు, ఇమ్మిగ్రేషన్ సెంటర్లు, ఫోర్ లెవల్ బ్యాగేజ్ సిష్టం, ఏఫ్రాన్) కల్పించాలి. ఇందుకు కనీసం మూడు వేల ఎకరాల భూమి అవసరమని ఐఐఏ ప్రతినిధి బృందం తేల్చింది. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం 140 ఎకరాల్లో ఉంది. 7,500 అడుగుల మేర రన్ వే ఉంది. రోజుకు కేవలం 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే విమానాశ్రయంలో ఉన్నాయి. రన్‌వే విస్తరణకు తూర్పున వికృతమాల ఎస్సీ కాలనీ.. పశ్చిమాన మర్రిగుంట గ్రామం, మర్రికుంట, యాదయ్యకుంట, శేషయ్యకుంట, కొత్తపాళెం చెరువులు, వందలాది వాగులు, వంకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రన్‌వేను 12,500 అడుగుల నుంచి తొమ్మిది వేలకు కుదించినా.. ఆ మేరకు భూమి లభ్యత కాదు. అవసరమైన మేరకు భూమి లభించకపోవడం వల్ల తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయలేమని అలోక్ సిన్హా కమిటీ మంగళవారం తేల్చింది. తిరుపతి విమానాశ్రయానికి అంత్జాతీయ హోదా మాత్రమే కల్పించవచ్చునని స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుకు నివేదిక ఇచ్చింది. నత్తనకడన హోదా పనులు.. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు 702 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. ఆ మేరకు విమానాశ్రయం చుట్టుపక్కలా భూమి ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 290 ఎకరాలు ప్రభుత్వ భూమి. తక్కిన 412 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది. నష్టపరిహారం చెల్లింపుపై భూ నిర్వాసితులు పేచీ పెట్టడంతో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రాలేదు. రూ.100 కోట్లతో టెర్మినల్, రూ.80 కోట్లతో రన్‌వే నిర్మించాలని ఐఐఏ అంచనా వేసింది. భూసేకరణ పూర్థిస్థాయిలో జరగకపోయినా జూలై 22, 2011న అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు టెండర్లు పిలిచింది. రూ.96 కోట్లకు పనులను దక్కించుకున్న కేఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది. కానీ.. ఇసుకనేల కావడంతో పనులు గిట్టుబాటు కావని కేఆర్ఆర్ ఇన్ఫ్రా ఆదిలోనే చేతులెత్తేసింది. అవే పనులను త్రీటీ అనే సంస్థ చేపట్టింది. గిట్టుబాటు కావడం లేదని త్రీటీ సంస్థ కూడా చేతులెత్తేసింది. ఇసుకనేల కావడం వల్ల విమానాశ్రయం నిర్మాణానికి 30 అడుగుల బదులు 60 అడుగుల పునాది వేయాల్సి వస్తోందని.. పనులు గిట్టుబాటు కావడం లేదని ఆ సంస్థ స్పష్టీకరించింది. దాంతో.. ఆ టెండరును రద్దు చేసిన ఐఐఏ మరోసారి టెండర్లు పిలిచింది. రూ.124.19 కోట్లతో ఐఐఏ ఇంజనీరింగ్ విభాగం, శ్యామ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టాయి. ఆ పనులు కూడా నత్తనడకన సాగుతుండటంపై ఐఐఏ ప్రతినిృధిబందం అసంతృప్తి వ్యక్తం చేసింది. -
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కలేనా?
ముందుకు కదలని విమానాశ్రయ విస్తరణ నిలిచిపోయిన భూసేకరణ పట్టించుకోని ప్రజాప్రతినిధులు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : అంతర్జాతీయ హోదా పొందడానికి అన్ని హంగులూ ఉన్న గన్నవరం విమానాశ్రయ విస్తరణ మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్న చందాన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న విజయవాడకు అతి దగ్గర్లో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పించడం కలగా మారింది. పాలకులు పట్టించుకోపోవడంతో భూసేకరణ కార్యక్రమం ఐదేళ్లుగా ముందుకు సాగడం లేదని విమర్శలొస్తున్నాయి. కనీసం 491.92 ఎకరాల భూమిని అప్పగించినా.. ఎయిర్‌పోర్టును అంతర్జాతీయస్థాయికి తీసుకువెళతామని ఐదేళ్లుగా ఎయిర్‌పోర్టు అథారిటీ మొత్తుకుంటున్నా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయితే మొదట.. గన్నవరం విమానాశ్రయంపై దృష్టి సారించాల్సి ఉంది. విజయవాడ, గుంటూరు పట్టణాల్లో వేల సంఖ్యలో ఎన్ఆర్ఐలు, వ్యాపార రంగంలో ప్రముఖులున్నారు. ఇక్కడి విమానాశ్రయానికి భవిష్యత్తులో తాకిడి పెరగనుంది. విజయవాడ నుంచి ముఖ్యవైన ఇతర ఎయిర్‌పోర్టులన్నీ దాదాపు, 300 నుంచి 400 కిలోమీటర్ల మధ్య దూరంలో ఉన్నాయి. ఢిల్లీ, ముంబయి తదితర పట్టణాలకు ఇక్కడ నుంచి లింకు సర్వీసులు నడుస్తున్నాయి. సర్వీసులు పెంచడంపై దృష్టి గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులను పెంచడంపై ప్రైవేటు విమానసంస్థలు దృష్టి సారించాయి. అంతర్జాతీయ హోదా కల్పించి అభివృద్ధి చేస్తే దేశంలో అతి ముఖ్యమైన పట్టణాలకు నేరుగా సర్వీసులు నడపడానికి ప్రైవేటు విమాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్ కోస్తా, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి సంస్థలు మరిన్ని సర్వీసులు నడపడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఆరు సర్వీసులు నడుస్తున్నాయి. రోజూ బెంగళూరుకు మూడు సర్వీసులు, హైదరాబాద్‌కు మూడు సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో రెండు విమానాలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి లింకు సర్వీసులుగా నడుస్తున్నాయి. నిలిచిన భూసేకరణ విమానాశ్రయం అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఐదేళ్ల నుంచి పోరాడగా, ఐదారు నెలల క్రితం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్ల బడ్జెట్ కేటాయించింది. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. భూసేకరణ ప్రక్రియలో భాగంగా నెల పాటు ఎన్జాయ్మెంట్ సర్వే చేశారు. అంతటితో ఈ కార్యక్రమం మరుగున పడింది. గన్నవరం విమానాశ్రయం 500 ఎకరాల విస్తార్ణంలో ఉంది. ఇక్కడి నుంచి నైట్ ల్యాండింగ్ సౌకర్యం, అఫ్రాన్ ఏర్పాటు చేశారు. కార్గో సర్వీసులను క్రమబద్ధం చేసి నడపడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఎప్పుడో ప్రణాళిక రూపొందించింది. అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి కార్గో బిల్డింగ్, ఫైర్‌స్టేషన్, టెక్నికల్ బ్లాక్, కార్‌పార్కింగ్, కస్టమ్స్ ఆఫీసు, అదనపు సెక్యురిటీ బ్లాకులు ఏర్పాటుకు ఎయిర్‌పోర్టు అథారిటీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా ప్రాంత నేతలు పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి.