intersex baby
-
ఆడా-మగా జననాంగాలు.. 25 ఏళ్ల తర్వాత వివాదాస్పదం
వైద్య శాస్త్రంలో ఓ అరుదైన కేసు.. సుమారు పాతికేళ్ల తర్వాత వివాదాస్పదంగా మారింది. ఆడ-మగ జననాంగాలతో(ఇంటర్‌సెక్స్ జెండర్) కలగలిసి పుట్టిన ఓ బిడ్డను.. సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు వైద్యులు. అయితే ఆ నిర్ణయంపై అతడుగా ఉన్న ఆమె ఇన్నేళ్ల తర్వాత పోరాటానికి దిగింది. తన అనుమతి లేకుండా క్రూరంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తనును మళ్లీ యథాస్థితికి మార్చేయాలని కోరుతోంది. హవాయి స్టేట్ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్పర్ట్ లూనా అనిమిషా.. తనను మహిళగా మార్చేయాలని పోరాడుతోంది. పుట్టినప్పుడు డాక్టర్లు ఆమె జననాంగాన్ని కుట్టేయడంతో పాటు, సర్జరీ ద్వారా గర్భసంచిని తొలగించారు. దీంతో లూనా.. ఇన్నేళ్లూ మగవాడిలానే పెరుగుతూ వస్తోంది. అయితే తనలో ‘ఆమె’ను ఎంతో కాలం అణుచుకోలేకపోయింది లూనా. అయితే తనని ఓ జంతువులా భావించి కర్కశంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తిరిగి సర్జరీలకు ఆమె సిద్ధమైంది. ‘‘తప్పు నా తల్లిదండ్రులదా? ఆ డాక్టర్లదా? అనే ప్రసక్తి కాదు. అంతిమంగా ఇబ్బంది పడుతోంది నేను. నాకు మగాడిగా కంటే ఆడదానిగా బతకడమే ఇష్టంగా అనిపిస్తోంది. 14 ఏళ్ల వయసులో తొలిసారి నా శరీరానికి కలిగిన గాయమేంటో నేను అర్థం చేసుకోగలిగాను. ఇన్నేళ్లలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అవమానాల్ని భరించాను. అసలు నా గుర్తింపు కోసం మానసిక క్షోభను అనుభవించాను. ఎవరితోనూ కలవలేకపోయాను. బొమ్మలతో ఆడుకోవాలని, గౌన్లు వేసుకోవాలనే కోరికల్ని అణచివేసుకున్నా. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, ఇప్పుడు పోరాడే వయసు, శక్తి రెండూ నాకు వచ్చాయి’’ అని నవ్వుతూ చెప్తోందామె. మగాడి గుర్తింపును వద్దనుకుంటున్న లూనా.. సర్జరీలకు అవసరమయ్యే డబ్బు కోసం ‘గో ఫండ్ మీ’ వెళ్లింది. లక్షా యాభై వేల డాలర్లు సేకరించి.. తన కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటోంది. 2019లో క్లీవ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళకు చనిపోయిన మహిళ గర్భసంచిని మార్పిడి ద్వారా ఎక్కించారు. అలా ఆ మహిళ తల్లి కాగలిగింది కూడా. ఆ కేసును రిఫరెన్స్‌గా తీసుకుని లూనా.. తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తోంది. అంతేకాదు సొసైటీలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఇంటర్‌సెక్స్, ట్రాన్స్‌జెండర్ బాధితుల కోసం లూనా పోరాడుతోంది కూడా. చదవండి: ‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’ -
పుట్టిన శిశువు ఆడ, మగ కాకపోయినా సరే..
త్రిస్సూర్: ఇంటర్ సెక్స్ వ్యక్తులు జీవశాస్త్ర పరంగా మగ లేదా ఆడవారు కాదు. జన్యుపరంగా, హార్మోనుల పరంగా, లైంగిక భాగాల తయారీలో తప్పులున్నప్పుడు మగ, ఆడ రెండు లక్షణాలతో జన్మిస్తారు. వీరిలో కొంతమందిలో ఆపరేషనుల ద్వారా, మందుల ద్వారా సరి చేయవచ్చు. అయితే సమాజంలో వీరు ఎంతగానో వివక్షకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇలాంటి పిల్లలను పురిటిలోనే చంపేస్తున్నారు. దీంతో ఇంటర్ సెక్స్ పిల్లలకు కూడా ప్రేమ పంచాల్సిన అవసరం ఉందంటూ కేరళలోని త్రిస్సూర్‌లో హిజ్రా హక్కుల కార్యకర్త, రచయిత్రి విజయరాజా మల్లిక కవితా ఆల్బమ్‌ను రూపొందించారు. 'ఇది శాపమో, పాపమో కాదు.. నా బంగారు పాప.. నువ్వు నా అదృష్టానివి. నా తొలి చుక్కానవి' అంటూ మలయాళీ భాషలో ఈ కవిత్వం సాగుతుంది. ఇందులో నటి తువ్వాలలో చుట్టుకొన్న బిడ్డను ఎత్తుకొని కన్న మమకారం చూపిస్తూ ప్రేమను కురిపిస్తుంది. (చదవండి:కవి మనసు ఖాళీగా ఉండదు) 'నా రంగుల హరివిల్లా, నువ్వు అబ్బాయి కాకపోయినా, అమ్మాయి అవకపోయినా నీకు నా రొమ్ము పాలు పడతాను' అంటూ సమాజం చూపే వివక్షను అణిచివేస్తూ తల్లిప్రేమను పంచుతుంది. ప్రస్తుతం ఈ పాట అందరి మనసులను కదిలిస్తోంది. విజయరాజా మల్లిక రచించిన ఈ కవిత్వానికి కరీంభుజా సంగీతం అందించగా, శిని అవంతిక మనోహరంగా ఆలపించి పాటగా రూపొందించారు. ఈ వీడియోలో మల్లిక, తన భర్త జషీంతో కలిసి నటించారు. ఈ ఆల్బమ్‌ను డ్యాన్సర్ రాజశ్రీ వారియర్ ఆదివారం ఆన్లైన్లో విడుదల చేశారు. "ఇంటర్‌సెక్స్ పిల్లలను చెత్తకుప్పల్లో పడేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఈ పాటలో ఉన్న తల్లి మాత్రం పుట్టిన బిడ్డ ఆడో, మగో తెలియకపోయినా శిశువును గుండెలకు హత్తుకుంటోంది" అని తెలిపారు. ఇంటర్‌సెక్స్ శిశువులపై మలయాళంలో వచ్చిన తొలి కవిత్వం ఇదేనని పలువురు పేర్కొంటున్నారు. (చదవండి: ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!) -
ఈ బిడ్డ ఆడా..? మగా..?
బీజింగ్: చైనాలో ఓ వింత శిశువు జన్మించింది. ఈ శిశువుకు ఉభయలింగత్వం ఉంది. హెనాన్ ప్రావిన్స్‌లో అన్యాంగ్‌లో యంగ్ అనే మహిళ మే 13న ఈ బిడ్డకు జన్మనిచ్చింది. స్త్రీ, పురుషాంగాలతో ఈ శిశువు జన్మించిందని తెలియగానే తండ్రి, తాత చంపడానికి ప్రయత్నించారు. వింత శిశువును చంపడానికి తండ్రి, తాత మూడు సార్లు ప్రయత్నించారు. తండ్రి టవల్, దుప్పటితో శిశువు ముఖాన్ని అదిమిపెట్టి చంపేందుకు ప్రయత్నాలు చేశాడు. తల్లి అడ్డుకుని చిన్నారిని కాపాడి, అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శిశువు తండ్రిని అరెస్ట్ చేశారు. తాతను అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. వైద్యులు ఈ శిశువును చూడగానే విస్మయం చెందారు. ఈ శిశువు బాలికా, బాలుడా అని తికమకపడ్డారు. ఆ తర్వాత ఉభయలింగత్వ శిశువుగా నిర్ధారించారు. ఉభయలింగత్వం గల శిశువులు చాలా అరుదుగా జన్మిస్తారని వైద్యులు చెప్పారు. వీరికి సర్జరీ చేయాలని తెలిపారు. కాగా చైనా సమాజం ఇలాంటి శిశువులను ఆడ లేక మగగా పరిగణించదని తెలిపారు. ఇతరులకు తన బిడ్డ వింతగా ఉన్నా, తనకు మాత్రం ముద్దుగా ఉందని యంగ్ చెబుతోంది.