ఈ బిడ్డ ఆడా..? మగా..? | Father in China held for attempting to kill intersex baby | Sakshi
Sakshi News home page

ఈ బిడ్డ ఆడా..? మగా..?

Published Tue, Jun 21 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

ఈ బిడ్డ ఆడా..? మగా..?

ఈ బిడ్డ ఆడా..? మగా..?

బీజింగ్: చైనాలో ఓ వింత శిశువు జన్మించింది. ఈ శిశువుకు ఉభయలింగత్వం ఉంది. హెనాన్ ప్రావిన్స్లో అన్యాంగ్లో యంగ్ అనే మహిళ మే 13న ఈ బిడ్డకు జన్మనిచ్చింది. స్త్రీ, పురుషాంగాలతో ఈ శిశువు జన్మించిందని తెలియగానే తండ్రి, తాత చంపడానికి ప్రయత్నించారు.

వింత శిశువును చంపడానికి తండ్రి, తాత మూడు సార్లు ప్రయత్నించారు. తండ్రి టవల్, దుప్పటితో శిశువు ముఖాన్ని అదిమిపెట్టి చంపేందుకు ప్రయత్నాలు చేశాడు. తల్లి అడ్డుకుని చిన్నారిని కాపాడి, అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శిశువు తండ్రిని అరెస్ట్ చేశారు. తాతను అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు.

వైద్యులు ఈ శిశువును చూడగానే విస్మయం చెందారు. ఈ శిశువు బాలికా, బాలుడా అని తికమకపడ్డారు. ఆ తర్వాత ఉభయలింగత్వ శిశువుగా నిర్ధారించారు. ఉభయలింగత్వం గల శిశువులు చాలా అరుదుగా జన్మిస్తారని వైద్యులు చెప్పారు. వీరికి సర్జరీ చేయాలని తెలిపారు. కాగా చైనా సమాజం ఇలాంటి శిశువులను ఆడ లేక మగగా పరిగణించదని తెలిపారు. ఇతరులకు తన బిడ్డ వింతగా ఉన్నా, తనకు మాత్రం ముద్దుగా ఉందని యంగ్ చెబుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement