Interview questions
-
ఇక స్టార్ట్..‘అప్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఏడేళ్ల క్రితం స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా పురుడు పోసుకున్న టీ–హబ్ ప్రస్తుతం నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారిందని టీ–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు అన్నారు. కరోనా సంక్షోభంతో ఏర్పడిన పరిస్థితుల నుంచి స్టార్టప్‌లు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే వాతావరణం సృష్టిస్తామన్నారు. టీ–హబ్ ద్వారా ఇప్పటివరకు 1,800కుపైగా స్టార్టప్‌లకు తోడ్పాటు లభించగా సుమారు రూ. 2,300 కోట్ల మేర నిధుల సమకూరాయన్నారు. టీ–హబ్ రెండో దశ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సంస్థ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలపై శ్రీనివాస్‌రావు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ► స్టార్టప్‌లకు అవసరమైన పని ప్రదేశాన్ని (వర్క్ స్పేస్) అందుబాటులో తెచ్చే లక్ష్యంతో ఏర్పాటైన టీ–హబ్ తర్వాతి కాలంలో వాటికి అవసరమైన మార్కెటింగ్, నిధులు, సలహాదారులు, మార్గదర్శకులు, నైపుణ్యం, ప్రోత్సాహం తదితరాలను అందించేలా కార్యకలాపాలను విస్తరించింది. ► ఉద్యోగాల కల్పనలో స్టార్టప్‌లదీ కీలకపాత్ర. ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లు కేవలం రెండు వేలుకాగా ఇప్పుడు ఆరు వేలకుపైగా ఉన్నాయి. ఈ పురోగతిలో టీ–హబ్ కీలక పాత్ర పోషించింది. ► ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), వాటికి వాణిజ్య రూపం (ఇంక్యుబేషన్) ఇవ్వ డంలో టీ–హబ్ నాయకత్వ స్థానంలో ఉంది. 29 రాష్ట్రాల్లో 356 ఇంక్యుబేటర్లు ఉన్నా టీ–హబ్ మాత్రమే రోల్‌మోడల్‌గా ఉంది. Ü ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, సైబర్ భద్రత, సోషల్ మీడియా, బ్లాక్‌చెయిన్, రవాణా, ఏఐ వంటి 14 రంగాల్లో స్టార్టప్‌లు వాణిజ్య స్థాయికి ఎదుగుతున్నాయి. ► స్టార్టప్‌లకు కావాల్సిన మార్కెట్, నిధులు, మార్గదర్శకులు, నైపుణాన్ని అందించడమే టీ–హబ్ ప్రధాన లక్ష్యం. పెద్ద కంపెనీలకు స్టార్టప్‌లను చేరువ చేయడం కూడా మా లక్ష్యాల్లో భాగం. ► హైదరాబాద్ స్టార్టప్‌లకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోంది. స్థానిక స్టార్టప్‌లకు భారీ పెట్టుబడులు సాధిం చేందుకు యాక్టివ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్‌తో మాట్లాడుతున్నాం. ► నైపుణ్యం, పెట్టుబడి, ప్రభుత్వం, మార్కెటింగ్‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీ–హబ్‌తోపాటు వీ–హబ్, టాస్క్, టీఎస్ఐసీ సంస్థలు పనిచేస్తుండగా 300కుపైగా వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఉన్నారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు స్టేట్ ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా ప్రభుత్వం ప్రారంభించిన టీ–ఫండ్ ద్వారా త్వరలో రూ. 15 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ► టీఎస్ఐసీ భాగస్వామ్యంతో కరీంనగర్, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ త్వరలో టీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. ► యువతకు చేరువయ్యేందుకు టీ–ట్రైబ్, కిక్ స్టార్ట్, లాంచ్పాడ్ అనే కార్యక్రమాలు రూపొందించాం. ► లాంచ్పాడ్ ద్వారా 30 కాలేజీల నుంచి 50 మంది విద్యార్థుల చొప్పున ఎంపిక చేసుకొని వారికి స్టార్టప్‌లపై శిక్షణ ఇస్తాం. కొన్ని కాలేజీల్లో ఉన్న ఈ–సెల్స్ ద్వారా కిక్‌స్టార్ట్ ప్రోగ్రామ్ కింద ఉపాధ్యాయుల సహకారంతో ఆవిష్కర్తలను గుర్తిస్తాం. టై, సీఐఐ, వీ–హబ్తోనూ క లసి రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరణ వాతావరణం కల్పన దిశగా ముందుకు సాగుతాం. ►ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న టీ–హబ్ మొదటి దశలో 160 స్టార్టప్‌లు ఇంక్యుబేట్ అవుతుండగా రెండో దశ ద్వారా 3.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 800కుపైగా స్టార్టప్‌లు ఒకేచోట సిద్ధమయ్యేలా వసతులు సమకూరుస్తాం. ► నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో ప్రస్తుతం టీ–హబ్ నాలుగో స్థానంలో ఉన్నా ఎంత వేగంగా దీన్ని సాధించామన్నది కూడా ముఖ్యమే. రాష్ట్రంలోని ప్రగతిశీల ప్రభుత్వం, మౌలిక వసతులు, నైపుణ్యం తదితరాల మూలంగా తప్పకుండా తొలి స్థానానికి చేరుకుంటాం. -
జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...
మనం చాలా రకాల ఇంటర్వ్యూలు చూసి ఉంటాం. అంతేందుకు ఒక్కొసారి మనల్ని ఇబ్బందికి గురి చేసేలా ఇంటర్వ్యూయర్ వేసే ప్రశ్నలకు కూడా మనం ఓపికగా సమాధానం ఇస్తాం. అయితే ఒక్కొసారి మనం ఏమైన సందేహాల్ని వెలిబుచ్చితే మాత్రం ఇంటర్వ్యూయర్లు చాలా మటుకు సరిగా సమాధానమైతే మనకు ఇవ్వరు. పైగా చాలా గర్వంగా సమాధానాలిస్తారు. మరికొంత మంది అయితే చాలా తెలివిగా సమాధానాలు చెబుతూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. అచ్చం అలానే ఇక్కొడ ఇంటర్వ్యూయర్ ఒక ఆమెను ఇబ్బంది పెట్టడమే కాక సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటాడు. (చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు) అసలు విషయంలోకెళ్లితే...ఒక వ్యక్తి స్కైప్‌లో ఒక మహిళను ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ చాలా మంచిగా ఆసక్తికరంగా సాగి పోతుంటుంది. చివరిగా జీతం గురించి ప్రస్తావన కొచ్చినప్పుడు సదరు మహిళ సాధారణంగా మీరు ఒక గంట పనికి ఎంత జీతం చెల్లిస్తారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. అలా అడగటమే కాక అమెకరికన్ ఎటర్ప్రెన్యూర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ జిమ్ రోన్ కొటేషన్.." నేను ఎంత పొందుతున్నాను అనే బదులు ఈ పని చేయడం వల్ల నేనేం పొందగలుగుతున్నాను" అనే సందేశాన్ని కూడా జోడించి అడుగుతుంది. దీంతో సదరు ఇంటర్వ్యూయర్ స్వారీ అంటూ ఒక ఎరుపు రంగు జెండాను చూపిస్తాడు. దీంతో సదరు మహిళ క్షమించండి నేను చెల్లించాల్సిన బిల్లులు, ఇతర ఇంటర్వ్యూల గురించి కూడా ఆలోచించాల్సి ఉంది కాబట్టి నాకు ఎంత జీతం చెల్లిస్తారో చెప్పాల్సిందే అంటూ పట్టుబడుతుంది. అయితే ఇంటర్వ్యూయర్ నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఆ తర్వాత ఆమె ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన సందేశాలను మొత్తం స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో నెటిజన్లు సదరు ఇంటర్వ్యూ తీరుని చూసి షాక్ అవ్వుతూ ..మేము ఉద్యోగులకు తక్కువ జీతం ఇస్తాం అని పరోక్షంగా చెబుతున్నట్లే అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) -
మమత నాకు ఏటా స్వీట్లు పంపుతారు
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు చేపడతానని తాను కలలో కూడా అనుకోలేదని ప్రధాని మోదీ తెలిపారు. చిన్నప్పటి నుంచి తాను సైనికుల నుంచి స్ఫూర్తి పొందాననీ, సైన్యంలో చేరి దేశసేవ చేద్దామనుకున్నట్లు చెప్పారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు గాంధీజీ స్ఫూర్తి అన్న మోదీ.. స్వచ్ఛభారత్‌లో భాగంగా గత ఐదేళ్లలో 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం నిజంగా గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఏఎన్ఐ వార్తాసంస్థ తరఫున మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, బాల్యం, దినచర్య, అలవాట్లు సహా పలు అంశాలపై మోదీ ముచ్చటించారు. ఆజాద్, మమత మంచి స్నేహితులు ప్రతిపక్ష పార్టీల్లో మీకెవరైనా స్నేహితులు ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా అప్పుడప్పుడూ కలుస్తుంటాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నాకు మంచి స్నేహితుడు. ఓసారి మేమిద్దరం పార్లమెంటులో చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. దీంతో చాలామంది నేతలు ఆశ్చర్యపోయారు. వేర్వేరు సిద్ధాంతాలు, భావజాలాలకు చెందిన మీ మధ్య స్నేహం ఎలా? అని వాళ్లు అడిగారు. అప్పుడు ఆజాద్ చక్కటి జవాబిచ్చారు. ‘ఎన్నికల్లో మేం ప్రత్యర్థులం కావచ్చు. కానీ ఇద్దరం స్నేహితులం, ఒకే కుటుంబంలా ఉంటాం’ అని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి మాట్లాడుతూ.. ‘మమత సహా పలువురు నేతలతో నాకు మంచి స్నేహం ఉంది. రాజకీయ వైరం ఉన్నప్పటికీ ప్రతిఏటా మమత స్వయంగా కుర్తాలను కొని నాకు పంపిస్తూ ఉంటారు. బెంగాలీ మిఠాయిలంటే నాకెంతో ఇష్టమని తెల్సి వాటినీ పంపిస్తున్నారు’ అని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తనకు బెంగాలీ స్వీట్లు ఢాకా నుంచి పంపుతారని తెలుసుకున్న మమత.. తానూ స్వీట్లు పంపడం మొదలుపెట్టారని చెప్పారు. బాల్యంలోనే అన్ని బంధాలను వదులుకున్నా మీకు కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? అని అక్షయ్ అడిగిన ప్రశ్నకు మోదీ జవాబిస్తూ..‘చాలా చిన్నవయసులోనే కుటుంబం సహా అన్నింటిని వదులుకుని వచ్చేశాను. కుటుంబ బాంధవ్యాల నుంచి దూరమైపోయాను. ఇప్పుడు అమ్మ దగ్గరికెళ్తే‘ఎందుకు నాకోసం పనులు మానుకుని సమయం వృథా చేస్తుంటావ్’ అంటుంది. అమ్మను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను పనుల్లో పడి బాగా రాత్రిపోయాక ఇంటికి వస్తుంటాను. అప్పుడు కూడా అమ్మతో మాట్లాడటం కుదరదు. అందుకే నేనుంటున్న ప్రదేశానికి రావడం అమ్మకు ఇష్టముండదు. సొంత ఊర్లోనే గడపడానికి ఆమె ఇష్టపడుతుంది. ఇప్పటికీ అమ్మను కలవడానికి వెళితే నా చేతిలో రూ.1.25 పెడుతుంది’ అని చెప్పారు. ఒకవేళ తాను ప్రధానిగా కాకుండా చిన్నపాటి గుమస్తా ఉద్యోగం సాధించి ఉన్నా తన తల్లి ఇరుగుపొరుగువాళ్లకు సంతోషంతో లడ్డూలు పంచి ఉండేదన్నారు. డ్రైవర్, ప్యూన్ పిల్లలకు రూ.21 లక్షలు ఇచ్చేశా ప్రధాని కుర్చీలో కూర్చుంటానని తాను కలలో కూడా అనుకోలేదని మోదీ తెలిపారు. అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి రావడమే ఇందుకు కారణమన్నారు. ‘నాకు గతంలో బ్యాంకు ఖాతా కూడా లేదు. స్కూల్ రోజుల్లో ‘దేనా బ్యాంకు’ వాళ్లు అకౌంట్ ఇచ్చారు. హుండీ ఇచ్చి అందులో దాచుకున్న డబ్బులను బ్యాంకు ఖాతాలో జమచేస్తామని చెప్పేవారు. అయితే నా దగ్గర పెద్దగా డబ్బులుండేవి కావు. దీంతో నన్ను వెతుక్కుంటూ వచ్చిన బ్యాంకు అధికారులు ఖాతాలో కనీస నగదు నిల్వలు లేకపోవడంతో మూసివేయాలని సూచించారు. నేను గుజరాత్ సీఎం అయ్యాక నాకొచ్చే నెలవారీ గౌరవ వేతనం ఆ బ్యాంకు ఖాతాలోనే పడేది. అధికారులు ఈ వేతనాన్ని నాకు తెచ్చి ఇచ్చినప్పుడు ‘దీన్ని నేనేం చేసుకోవాలి? నాకు ఇచ్చుకోవడానికి ఎవ్వరూ లేరు’ అని చెప్పా. కానీ అధికారులు ‘సార్ మీపై కేసులు ఉన్నాయి. వాదించే లాయర్కైనా ఇవ్వాలికదా’ అన్నారు. కానీ నేను వద్దని చెప్పా. అప్పట్లో గుజరాత్ సచివాలయంలో డ్రైవర్, ప్యూన్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు రూ.21 లక్షలు ఇచ్చేశాను’’ అని మోదీ వెల్లడించారు. ఒబామా అదే చెప్తారు రోజుకు కేవలం 3–4 గంటలు నిద్ర ఎలా సరిపోతుంది? అని అక్షయ్ కుమార్ మోదీని ప్రశ్నించారు. దీనికి ఆయన జవాబిస్తూ..‘నా గురించి తెలిసిన చాలామంది స్నేహితులకు నా నిద్ర విషయంలో ఆందోళన ఉంది. స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా నన్ను ఎప్పుడు కలిసినా నిద్రపోయే సమయం పెంచుకోమని పదేపదే చెబుతుంటారు. తక్కువసేపు నిద్రపోయే ఆరోగ్యం దెబ్బతింటుందని అంటుంటారు. కానీ రోజుకు 3–4 గంటల నిద్ర నా శరీరానికి అలవాటైపోయింది. పనివేళల్లో నాకు ఒత్తిడిగా అనిపించదు. నిద్ర కూడా రాదు’ అని తెలిపారు. ప్రధానికి మామిడి పండ్లంటే ఇష్టామా? కాదా? అని అడగాల్సిందిగా తన డ్రైవర్ కుమార్తె కోరిందని అక్షయ్ తెలపగా..‘నాకు మామిడిపండ్లంటే చాలా ఇష్టం. కానీ ఆరోగ్యరీత్యా తియ్యటి పండ్లను తినడాన్ని తగ్గించుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. కోపం వస్తే అదే చేస్తా తనకు సాధారణంగా కోపం రాదని అన్నారు. ‘కోపం కారణంగా ప్రతికూలత వస్తుంది. కాబట్టి నేను ఎవ్వరిపైనా కోప్పడను. కానీ ఎప్పుడైనా నా భావోద్వేగాలు అదుపుతప్పితే ఓ కాగితం తీసుకుని అందులో అసలు కోపం రావడానికి గల కారణం రాస్తాను. ఆ తర్వాత దాన్ని చించేస్తాను. నా కోపం తగ్గేవరకూ ఇలా పదేపదే చేస్తూనే ఉంటాను. దీనివల్ల నాలోని కోపం మొత్తం బయటకు వెళ్లిపోయిన భావన కలుగుతుంది. ఈ సందర్భంగా నన్ను నేను విశ్లేషించుకుంటాను. దీనివల్ల నా తప్పులను తెలుసుకునే అవకాశం నాకు లభిస్తుంది’ అని తెలిపారు. కొత్త వృత్తిలో మోదీ: కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోదీని హీరో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. మే 23న ప్రజలు తిరస్కరించబోతున్న, విఫలమైన ఓ రాజకీయ నేత ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా దుయ్యబట్టారు. ‘అక్షయ్ కుమార్ విజయవంతమైన గొప్ప నటుడు. ఆయన సినిమాలంటే మాకు చాలా ఇష్టం. పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఆయన అందించారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన, లక్షలాది ఉద్యోగాలను తుడిచిపెట్టేసిన, దేశంలోని కోట్లాది రైతులు, నిరుపేదల బతుకును నరకప్రాయం చేసిన ఓ విఫల రాజకీయ నేత ఇప్పుడు అక్షయ్ కుమార్ కంటే గొప్ప నటుడు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని సూర్జేవాలా విమర్శించారు. కానీ దేశం విషయంలో విఫలమైనట్లే నటనలోనూ ప్రధాని మోదీ విఫలమయ్యారని స్పష్టం చేశారు. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా అప్పుడప్పుడూ కలుస్తుంటాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నాకు మంచి స్నేహితుడు. ఓసారి మేమిద్దరం పార్లమెంటు హౌస్‌లో చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. దీంతో చాలామంది నేతలు ఆశ్చర్యపోయారు. చాలా చిన్నవయసులోనే కుటుంబం సహా అన్నింటిని వదులుకుని వచ్చేశాను. కుటుంబ బాంధవ్యాల నుంచి దూరమైపోయాను. ఇప్పుడు కూడా మా అమ్మను కలవడానికి వెళ్లితే ‘ఎందుకు నాకోసం పనులు మానుకుని సమయం వృథా చేస్తుంటావ్’ అంటుంది. నేను ఎవ్వరిపైనా కోప్పడను. కానీ ఎప్పుడైనా నా భావోద్వేగాలు అదుపుతప్పితే ఓ కాగితం తీసుకుని అందులో అసలు కోపం రావడానికి గల కారణం రాస్తాను. ఆ తర్వాత దాన్ని చించేస్తాను. మీ కాపురం ప్రశాంతంగా ఉందిగా.. అక్షయ్ భార్య ట్వింకిల్ తనపై ట్విట్టర్లో విమర్శలు చేయడంపై మోదీ సరదాగా స్పందించారు. ‘ప్రపంచంలో ఏం జరుగుతుందో తెల్సుకునేందుకు సోషల్‌మీడియా చూస్తా. అందులో భాగంగా ట్వింకిల్ ఖన్నా, మీ(అక్షయ్) ట్విట్టర్ ఖాతాలను కూడా ఫాలో అవుతున్నా. ట్వింకిల్ తన కోపాన్నంతా నాపై తీర్చుకుంటూ ఉంటుంది. ఆవిడ నన్ను లక్ష్యంగా చేసుకుంటున్న తీరును బట్టి మీ కాపురం చాలా ప్రశాంతంగా, సజావుగా సాగుతోందని అర్థం చేసుకోగలను. దీనివల్ల మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారని అనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. ట్విట్టర్లో వచ్చే మెమెలను తాను చాలా ఎంజాయ్ చేస్తాననీ, అందులో సృజనాత్మకత అద్భుతంగా ఉంటుందని మోదీ కితాబిచ్చారు. సోషల్‌మీడియా సాయంతో తాను సామాన్యుల ఆలోచనల్ని అర్థం చేసుకోగలనని తెలిపారు. సానుకూలంగా తీసుకుంటా: ట్వింకిల్ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అక్షయ్ కుమార్ కుమార్ భార్య ట్వింకిల్ వెంటనే స్పందించారు. తాను చేసిన విమర్శలపై ప్రధాని కామెంట్లను సానుకూలంగా తీసుకుంటున్నట్లు ట్వింకిల్ తెలిపారు. ‘నేను ఈ వ్యాఖ్యలను సానుకూలంగా తీసుకుంటున్నా. ప్రధాన మంత్రి మోదీకి నేనెవరో తెలియడం మాత్రమే కాదు. ఆయన నా రచనలను కూడా చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ట్వింకిల్ ప్రస్తుతం సామాజిక అంశాలపై వార్తాపత్రికల్లో కథనాలు రాస్తున్నారు. అంతేకాకుండా మిసెస్ ఫన్నీబోన్స్, ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్ అనే పుస్తకాలను ట్వింకిల్ రాశారు. బూట్లకు చాక్‌పీస్ పొడితో పాలిష్.. చిన్నప్పుడు పేదరికం కారణంగా వచ్చిన ఆత్మన్యూనతా భావంతో బాగా కనిపించాలని ఉబలాటపడేవాడ్ని. అందులో భాగంగా నా తెలుపురంగు బూట్లు మరింత తెల్లగా కన్పించేందుకు చాక్‌పీస్ పొడిని వాడేవాడిని. దుస్తులపై మడతలు లేకుండా చేసేందుకు ఓ వంటపాత్రలో నిప్పు కణికలు వేసి ఇస్త్రీ చేసుకునేవాడిని. గుజరాత్ సీఎం బాధ్యతలు స్వీకరించేవరకూ నా దుస్తులను నేనే ఉతుక్కునేవాడిని’ అని తెలిపారు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు తాను చాలా జాగ్రత్తగా ఉంటాననీ, ఎందుకంటే తన వ్యాఖ్యలను వక్రీకరించే అవకాశముందని వెల్లడించారు. వంటింటి చిట్కాలతో చికిత్స.. ప్రస్తుతం జలుబు, దగ్గు, తలనొప్పి వంటి చిన్న సమస్యలకు ఈతరం అలోపతి మందులను ఆశ్రయిస్తోందన్నారు. కానీ తాను మాత్రం వంటింటి చిట్కాలతో రెండ్రోజుల్లో జలుబును తగ్గించుకుంటానని తెలిపారు. ‘‘ఒకవేళ నాకు జలుబు వస్తే గోరువెచ్చటి నీళ్లు తాగుతా. అందులో ఏమీ కలుపుకోను. అలాగే రెండ్రోజుల పాటు ఉపవాసం ఉంటాను. ఇలాంటప్పుడు ఆవ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఆవనూనెను కొద్దిగా వేడిచేసి నిద్రపోయేముందు ముక్కులో రెండు చుక్కలు వేసుకోవాలి. కొంచెం మంటగా అనిపించినా జలుబు, ముక్కు దిబ్బడ రెండ్రోజుల్లో తగ్గిపోతుంది. అలాగే నాకు కాళ్ల నొప్పులు వస్తే అస్సామీ సంప్రదాయ వస్త్రం ‘గమోచా’ను కాలికి గట్టిగా చుట్టేస్తా. ఎంతటి భరించలేని నొప్పి అయినా కొద్దిసేపటికే తగ్గిపోతుంది’’ అని మోదీ వివరించారు. -
అంతా నాటకమే!
‘తన పేరుని వింటే, కీర్తిని కంటే.. కడలి చరుచు చప్పట్లే’ అని ఓ సినిమాలో రజనీకాంత్‌ని వర్ణిస్తాడు రచయిత. నిజమే... రజనీకాంత్‌కి, సముద్రానికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఆయన సినిమాలు కలెక్షన్ల సునామీలు సృష్టిస్తాయి. ఆయన అభిమాన సంద్రం గురించి చెప్పక్కర్లేదు. స్క్రీన్ మీద ఎగసిపడే కెరటాలాంటి ఎనర్జీ రజనీకాంత్ సొంతం. కానీ వ్యక్తిగతంగా సముద్రమంత లోతు, ప్రశాంతంగా ఉన్నప్పుడు సముద్రంలో కనిపించే నిశ్శబ్దం, నిర్మలత్వం రజనీలో అగుపిస్తాయి. ఇన్నేళ్ల తన సినీ ప్రస్థానం, త్వరలో ప్రారంభించబోయే రాజకీయ ప్రస్థానం గురించి ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు రజనీకాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విశేషాలు మీ కోసం.. ► వయసుని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు. అదే ఎనర్జీ, అదే ప్యాషన్. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది? కెరీర్ స్టార్టింగ్‌లో యాక్టింగ్‌ని బ్రతుకు తెరువు కోసం ఎంచుకున్నాను. నటుడిగా నిలదొక్కుకున్న తర్వాత మా అవసరాలన్నీ తీరిపోయాక యాక్టింగ్‌ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. చాలా ఎంటర్టైనింగ్గా అనిపించేది. ఒకవేళ జస్ట్ ప్రొఫెషన్‌లా భావించి ఉంటే బరువుగా, బాధ్యతగా అనిపించేదేమో. కానీ అదో ఆటలా అనిపిస్తోంది. అందుకే ఎనర్జీ వస్తుందనిపిస్తోంది. ► ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు? కామెడీ సినిమాలు. కామెడీ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సెట్లోకి వెళ్లినప్పుడు కామెడీ సీన్ ఉంది అని చెప్పగానే ఎగిరి గంతేయాలి అనిపిస్తుంటుంది. వేరే వాళ్లను నవ్వించడం చాలా కష్టం. సిచ్యువేషనల్ కామెడీ చాలెంజింగ్‌గా అనిపిస్తుంటుంది. ► లైఫ్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లో కండక్టర్‌గా కూడా వర్క్ చేశారు. ఇప్పుడేమో సూపర్ స్టార్. జీవితాన్ని చూసే విధానంలో ఏదైనా మార్పు కనిపించిందా? తొలినాళ్లలోనే కష్టాలు, బాధలు ఉండేసరికి ప్రస్తుతం లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను అనిపిస్తోంది. చేదు రుచి తెలిస్తే తీపిని ఇంకా ఆస్వాదించగలం. అలాగే బాధను అనుభవించాకే సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ► కండక్టర్ నుంచి యాక్టింగ్‌లోకి ఎలా రావాలనుకున్నారు? చాలా పాత కథ, పెద్ద కథ. షార్ట్‌గా చెబుతా. కర్ణాటకలో బస్ కండక్టర్‌గా పని చేసేవాణ్ణి. ప్రతి సంవత్సరం యానివర్శరీ సెలబ్రేషన్స్‌కు ఏదో ఓ నాటకం వేయాలి. నేను దుర్యోధనుడి పాత్ర చేయాలనుకున్నాను. నేను ఎన్టీ రామారావుగారి అభిమానిని. ఆయన్ను బాగా ఇమిటేట్ చేసేవాణ్ణి. అప్పుడు నా స్నేహితుడు ప్రోత్సహించాడు. మా అన్నయ్య కూడా ఎంకరేజ్ చేయడంతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడ బాలచందర్‌గారు పరిచయం అయ్యారు. తర్వాత మీకు తెలిసిందే. ► యాక్టింగ్‌లో మీ రోల్ మోడల్ ఎవరు? శివాజీ గణేశన్‌గారు. ఆయన్ను బాగా ఇమిటేట్ చేసేవాణ్ణి. ‘ఆల్రెడీ శివాజీ గణేశన్‌గారు ఉన్నప్పుడు మళ్లీ ఇమిటేట్ చేయడం దేనికి?’ అని బాలచందర్‌గారు నాతో అన్నారు. నాలో స్పీడ్‌ని గమనించారు ఆయన. ‘ఇది నీ ఒరిజినాలిటీ. నీ స్టైల్, నీ ట్రేడ్‌మార్క్’ అన్నారు. అలా నాకంటూ ఓ ప్రత్యేక స్టైల్ ఏర్పరచుకున్నాను. ► సిగిరెట్ ఎగరేసి నోటితో పట్టుకునే స్టైల్ మీ ట్రేడ్‌మార్క్ మేనరిజాల్లో ఒకటి. ఎక్కడ నేర్చుకున్నారు? హిందీ సినిమాల్లో శత్రుఘ్న సిన్హా ఫస్ట్ టైమ్ చేశారు. దాన్ని కొంచెం మార్చి కొత్తగా చేశాను. కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయ్యాను. ► మీలో స్వాగ్ (ఒకలాంటి స్టైల్) ఉందంటుంటారు. అది కూడా అలవర్చుకున్నదేనా? అది అలవర్చుకున్నది కాదు. నాలో సహజంగానే ఉంది. అందరూ నన్ను స్టైలిష్‌గా ఉన్నాడు అంటుంటారు. బహుశా అందుకేనేమో. ► ఇంత సుదీర్ఘ కెరీర్లో మీరు నేర్చుకున్నదేంటి? తెలుసుకున్నదేంటి? అంతా నాటకమే అని తెలుసుకున్నాను (పెద్దగా నవ్వుతూ). ► మీ సినిమాల ద్వారా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటారా? నేను ఎంటర్టైనర్ని. రజనీకాంత్ సినిమా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ముందు వాళ్లందర్నీ ఎంటర్టైన్ చేయాలి. ఒకవేళ స్క్రిప్ట్‌లో వీలుందంటే కచ్చితంగా మెసేజ్ చెప్పాలనుకుంటా. ► కరుణానిథి, యంజీఆర్లు తమ సినిమాల ద్వారా రాజకీయాలను చెప్పారు. మీరు కూడా అది ఫాలో అవుతారా? రాజకీయాలు, సినిమా రెండూ వేరు వేరు. ఫస్ట్ నుంచి కూడా ఈ రెండింటినీ కలపకూడదని నిర్ణయించుకున్నాను. కొన్ని సందర్భాల్లో డైలాగ్స్ చెబుతుంటాం. దాన్ని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటున్నారన్నది మనం ఆపలేం. అది కూడా కావాలని చేయం. కొన్ని సార్లు జరుగుతుంటాయి. ► యంజీఆర్ తన జీవితం ద్వారా ఏం చెప్పారని అనుకుంటున్నారు? సినిమా హీరో కూడా ప్రజలను పరిపాలించగలడు అని చెప్పారు యంజీఆర్. ► ఆయన మీకు రోల్ మోడలా? సినిమా నుంచి రాజకీయాల వైపు వెళ్లాలనుకునే ఎవరికైనా ఆయన తప్పకుండా రోల్ మోడల్‌గా ఉంటారు. ► యంజీఆర్గారి నుంచి నేర్చుకున్న విషయం? ఆయన సహాయ గుణం. పేదవాళ్లను ఆయన ఆదరించిన తీరు గొప్పది. రాజకీయ నాయకుడు అయిన తర్వాత మాత్రమే కాదు సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనది సహాయం చేసిన చేయి. ► జయలలిత గారి గురించి, ఆవిడ పరిపాలన గురించి? పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడను. కానీ పురుషాధిక్య ప్రపంచంలో తన ధైర్యం, పట్టుదల, ఒంటరిగా అన్నింటినీ ఎదుర్కోవడం... అది అభినందించవలసిన విషయం. ► మీకు, ఆవిడకు మధ్య గతంలో చిన్న డిస్ట్రబెన్స్‌లు నెలకొన్నాయి. ఆ తర్వాత మళ్లీ కలుసుకున్నారా? మా అమ్మాయి పెళ్లికి జయలలితగారు వచ్చారు. ► కమల్‌హాసన్‌గారు, మీరు రైవల్స్? ఎందుకంటే ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వెళ్తున్నారు కదా? రైవల్సా? పోటీదారులం అని కూడా అనను. కమల్‌హాసన్ నా ఆçప్త మిత్రుడు. ఒక సీరియల్‌కి నాకు డైలాగ్ డెలివరీ నేర్పించాడు కమల్. ఇప్పటికీ నా ఆప్తమిత్రుడే. ► మీరు సినిమాల్లో విలన్‌గానూ కనిపించారు. స్మోకింగ్, డ్రింకింగ్ కూడా చేశారు. అదేమైనా మీ పబ్లిక్ పర్సనాలిటీకి ఇబ్బంది అనుకుంటున్నారా? నా సినిమాలు, నా జీవితం రెండూ వేరు వేరు. రెండింటినీ ఎందుకు కలపాలి? సినిమాల్లో యాక్ట్ చేయడానికి డబ్బులు ఇస్తారు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని చేయాలి. రాజకీయాల్లోకి వస్తే నేను నాలానే ఉంటా. రాజకీయాల్లో కొత్త విధానాలు కొత్తదనం తీసుకు రావాలనుకుంటున్నాను. ఆరోగ్యం పరంగా అంత బాగాలేను. ఈ వయసులో రాజకీయాల్లోకి రావడం అంత సులువు కూడా కాదు. ► ఈ మధ్య మీ ఆరోగ్యం బావుండటం లేదు? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాని గురించి అసలు పట్టించుకోం. కానీ అస్వస్థతకు గురైనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ► సినిమాలకు, రాజకీయాలకు తేడా ఏంటి? ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాలేదు. నాకున్న చిన్నపాటి అనుభవంతో చెబుతున్నాను.. రాజకీయాలు చాలా చాలా కష్టం. నేను ఇందాక చెప్పినట్టు అంతా డ్రామా... గేమ్. సినిమాల్లో ఒక నిర్మాత, దర్శకుడు, కథా రచయిత.. ఇలా చాలా మంది ఉంటారు. కానీ రాజకీయాల్లో అన్నీ మనమే. ► సినిమాల్లో సూపర్ ఫాస్ట్‌గా ఉన్నారు. కానీ రాజకీయాల విషయానికి వస్తే చాలా స్లోగా ఉన్నారు. రాజకీయాలు చాలా డేంజరెస్ ఆట. నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడాల్సిన ఆట. ► ‘మీటూ’ ఉద్యమం మీద మీ అభిప్రాయం? ఈ ఉద్యమం చాలా మంచిది. కానీ దీన్ని తప్పుగా ఉపయోగించకూడదు. ► మీ జీవితంలో మీ భార్య లత పోషించిన పాత్ర గురించి? వైఫ్‌గా నా పిల్లల్ని, వాళ్ళ బాధ్యతల్ని, మా ఇంటినీ అన్నీ తనే చూసుకుంటుంది. కేవలం భార్య మాత్రమే కాదు స్నేహితురాలు, నా ఫిలాసఫర్‌గా కూడా ఉంటుంది. ► మారుతున్న టెక్నాలెజీ గురించి? ఆడియన్స్ కొత్త కొత్త ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నారు. టెక్నాలజీ మార్పుని మనం ఎవ్వరం ఆపలేం. మనం వాటì కి అలవాటు పడటమే. ఎన్ని ప్లాట్‌ఫామ్‌లు వచ్చినా కూడా కంటెంట్ బావుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. ► రాజకీయాలను, సినిమాలను సమాంతరంగా కొనసాగిస్తారా? ప్రేక్షకులు నన్ను స్క్రీన్ మీద చూడాలనుకున్నంతవరకు, నా ఒంట్లో ఓపిక ఉన్నంతవరకూ నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. ► మీరు చేసిన సినిమాల్లో మీ ఫేవరేట్? ‘బాషా, అలెక్స్ పాండ్యన్ (తమిళ చిత్రం ‘మూండ్రు ముగమ్’లో చేసిన పాత్రల్లో ఓ పాత్ర), శ్రీ రాఘవేంద్ర’ ఈ మూడు సినిమాల్లో నటుడిగా బాగానే చేశాను అనిపిస్తుంది. ‘పేట్టా’లో రజనీ -
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి.. ఆశన్నగారి జీవన్‌రెడ్డి
సాక్షి, ఆర్మూర్: ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రశ్న: నియోజకవర్గంలో మీ హయాంలో అభివృద్ధి ఎంత వరకు సాధించారు? జవాబు: సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సహకారంతో నాలుగున్నరేళ్ల కాలంలో 2,500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. ప్ర: నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఏమిటి? జ: వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు 52 వేల మంది లబ్ధిదారులకు పింఛన్ల రూపంలో నెలకు ఐదు కోట్ల 91 లక్షల రూపాయల చొప్పున నాలుగున్నరేళ్లలో 250 కోట్లు చెల్లించాం. బీడీ కార్మికులకు జీవన భృతిని అందజేస్తున్నాం. 3,500 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూపంలో రూ.24 కోట్లు, 3,540 మంది యాదవులకు రూ.32 కోట్లతో గొర్రెలు పంపిణీ చేశాం. ప్ర: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? జ: మిషన్ కాకతీయలో భాగంగా 148 చెరువులకు రూ.51 కోట్లతో మరమ్మతులు చేపట్టి 14,350 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశాం. నిజాంసాగర్ కాలువల మరమ్మతులకు రూ.38 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.15 కోట్లు, అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.105 కోట్లు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.148 కోట్లు, గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరణకు రూ.23 కోట్లు మంజూరు చేశాం. రూ.404 కోట్లతో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ప్ర: ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలు ఏమిటి? జ: ఆర్మూర్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం పని చేస్తున్నా. అందులో భాగంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. ప్ర: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? జ: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గ్రామాల్లోని ప్రజల వద్దకు ప్రచారానికి వెళ్తే అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్‌ను ఆధారం చేసుకొని జరిగితే ప్రస్తుత ఎన్నికలు సంక్షేమ, అభివృద్ధి పథకాలే కేంద్రంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపించనున్నాయి. నందిపేట మండలంలోని లక్కంపల్లి సెజ్ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం నుంచి రూ.109 కోట్లు, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ జాతీయ రహదారి అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు, లెదర్ పార్క్ అభివృద్ధికి రూ.పది కోట్లు మంజూరు చేయించాం. 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 13 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేయించాం. 12,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాముల నిర్మాణానికి రూ.ఏడు కోట్లు, 40 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.ఆరు కోట్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలల నిర్మాణానికి రూ.117 కోట్లు, ఉమ్మెడ వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.110 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి 144 కోట్లు, రూ.33 కోట్లతో సీసీ రోడ్లు, రూ.8.4 కోట్లతో శ్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టాం. సిద్ధుల గుట్ట అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశాం. ఆలూర్, నందిపేట బైపాస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయించా. -
ఆ ముగ్గురికీ ముఖాముఖి ప్రశ్నలు?
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఆ దాడికి ముందు తనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, వదిలిపెట్టారని చెప్పిన పంజాబ్ ఎస్పీ సల్వీందర్‌ను నాలుగో రోజైన గురువారం సైతం ప్రశ్నించింది. ఆయనతో పాటు కిడ్నాపైనట్లు చెప్తున్న వంట మనిషిని.. వారిద్దరూ కిడ్నాప్‌కు గురయ్యేముందు సందర్శించినట్లు చెప్తున్న దర్గా సంరక్షకుడు సోమ్రాజ్ను ప్రశ్నించింది. కిడ్నాప్ పూర్వాపరాలకు సంబంధించి ఎస్పీ చెప్తున్న మాటల్లో పొంతన లేకపోవటం.. ముగ్గురు చెప్తున్న అంశాలూ పరస్పర విరుద్ధంగా ఉండటంతో మరింత స్పష్టత కోసం సల్వీందర్‌సింగ్, మదన్‌గోపాల్, సోమ్‌రాజ్‌లు ముగ్గురినీ కలిపి కూర్చోబెట్టి ప్రశ్నిస్తామని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. తాను పంజ్ పీర్ దర్గాకు తరచుగా వెళ్లేవాడినని ఎస్పీ చెప్తుంటే.. పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు తొలిసారిగా ఆయన ఆ దర్గాకు రావటం చూశానని, అంతకుముందు ఎన్నడూ రావటం చూడలేదని సోమ్రాజ్ చెప్తున్నాడు. ఎస్పీకి నిజనిర్ధారణ పరీక్ష నిర్వహించే అంశంపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. దీనానగర్ దాడితో పోలికలు... ఇదిలావుంటే.. పంజాబ్‌లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి.. దానికి కొన్ని నెలల ముందు అదే రాష్ట్రంలోని దీనానగర్‌లో ఒక పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రదాడికి పోలికలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. గత ఏడాది జూలై 27న సైనిక దుస్తుల్లో భారీ ఆయుధాలతో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు దీనానగర్‌లో ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సుపై బుల్లెట్ల వర్షం కురిపించటంతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. వారి దాడిలో ఒక ఎస్పీ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా పోలీసు బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ హతమయ్యారు. ఈ కేసును పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిని ఎన్ఐఏకు అప్పగించేందుకు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌బాదల్ ఇటీవల నిరాకరించారు.