మత్తు కల్లు దొరక్క ముగ్గురు మృతి
ధారూరు/బషీరాబాద్/తాండూరు రూరల్: రంగారెడ్డి జిల్లాలో మత్తు కల్లు దొరక్క ముగ్గురు మృతి చెందగా, ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. ధారూరుకు చెం దిన బుడగజంగం దస్తయ్య(35), అతడి కుటుంబీకులు మత్తు కల్లు లభించకపోవడంతో అస్వస్థతకు గురై ఈ నెల 15న తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. మం గళవారం వారు తిరిగి ఇంటికి చేరుకున్నారు. పరిస్థితి విషమించడం తో అదేరోజు రాత్రి దస్తయ్య మృతి చెందగా.. అతని తల్లి రత్నమ్మ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇదే మండలం గట్టెపల్లికి చెందిన కల్తీ కల్లు బాధితురాలు ఇటీవల ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె యాలాల మండలం బానాపూర్ అడవిలో చనిపోవడంతో కుటుం బీకులు బుధవారం మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
అలాగే, బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన పోచమొళ్ల చిన్న నర్సప్ప(45) మంగళవారం రాత్రి ఆయన గ్రామంలోని ఓ దుకాణంలో కల్లు తాగాడు. కల్లులో మత్తు మోతాదు మించడంతో ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో నర్సప్ప కిందపడి చనిపోయాడు. మరో ఘటనలో తాండూరు ఇంద్రానగర్‌కు చెందిన దాసరి సాయికుమార్(30) మత్తు కల్లు లభించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి విం తగా ప్రవర్తిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున అతను ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.