invest in stocks
-
ఆరు వారాల కనిష్టం
వరుసగా ఐదో రోజూ నష్టాలు సెన్సెక్స్ 17 పాయింట్లు డౌన్ 25,007 వద్ద ముగింపు రోజు మొత్తం ఒడిదుడుకులు వరుసగా ఐదో రోజు నష్టాలు కొనసాగాయ్. తొలి నుంచీ స్వల్ప స్థాయిలో లాభనష్టాల మధ్య కదలిన సెన్సెక్స్ కనిష్టంగా 24,892, గరిష్టంగా 25,096ను తాకింది. చివరికి 17 పాయింట్ల క్షీణతతో 25,007 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 7,472- 7,422 మధ్య కదిలి చివరికి 5 పాయింట్లు తక్కువగా 7,454 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఆరు వారాల కనిష్టం! జూన్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 6% నుంచి 5.4%కు తగ్గినప్పటికీ సెంటిమెంట్ మెరుగుపడలేదని నిపుణులు పేర్కొన్నారు. ఇదే విధంగా మే నెలలో పారిశ్రామికోత్పత్తి 19 నెలల గరిష్టం 4.7%కు పుంజుకున్న అంశాన్నీ ఇన్వెస్టర్లు పెడచెవిన పెట్టారని తెలిపారు. ఈ గణాంకాలు గడిచిన శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. కాగా, జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 8.3% నుంచి 7.3%కు బలహీనపడినట్లు సోమవారం(14న) మార్కెట్లు ముగిశాక వెల్లడైంది. * శుక్రవారం అంచనాలకు తగ్గ ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ తాజాగా 3% పతనమైంది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో హెచ్‌యూఎల్, విప్రో 2.5% స్థాయిలో తిరోగమించాయి. * కేజీ డీ6 బ్లాకునుంచి లక్ష్యానికంటే తక్కువగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నందున ఆర్‌ఐఎల్‌పై ప్రభుత్వం 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానాను విధించడంతో షేరు 0.5% నష్టపోయింది. * మరోవైపు హిందాల్కో 4% జంప్‌చేయగా, టాటా పవర్, టాటా స్టీల్, టాటా మోటార్స్ 2.5% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో యాక్సిస్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, భెల్ 1.5% చొప్పున లాభపడ్డాయి. * ఎఫ్‌పీఐలు రూ. 558 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ సంస్థలు రూ. 332 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి. ట్రేడైన షేర్లలో 1,690 నష్టపోతే, 1,126 లాభపడ్డాయి. -
కొత్త ఏడాదిలో తొలి లాభం
కొత్త ఏడాదిలో ఐదురోజులపాటు వరుస నష్టాలు చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం తొలిసారిగా లాభపడ్డాయి. స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 36 పాయింట్లు ఎగిసి 20,729 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 6,174 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎంపికచేసిన పీఎస్‌యూ, ఫార్మా, ఆటో షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలుచేశారు. కోల్ ఇండియా, గెయిల్, సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-3%ర్యాలీ జరిపాయి. టాటా పవర్, కెయిర్న్ ఎనర్జీ, ఎన్ఎండీసీ, పీఎన్బీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 1-2% మధ్య పెరిగాయి. ప్రధాన బ్యాంకింగ్ షేర్లన్నీ మందకొడిగా ట్రేడయినా, ప్రత్యేక డివిడెండ్ ప్రకటిస్తున్నాయన్న వార్తలతో మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు 4-8% మధ్య భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి. ఎఫ్ఐఐలు రూ. 79 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 88 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లలో లాంగ్ బిల్డప్... మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లలో భారీ నగదు కొనుగోళ్లతో పాటు ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున లాంగ్ బిల్డప్ జరిగింది. అన్నిటికంటే అధికంగా 8 శాతం ర్యాలీ జరిపిన సిండికేట్ బ్యాంక్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 14.28 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 61.08 లక్షల షేర్లకు పెరిగింది. అలహాబాద్ బ్యాంక్ ఫ్యూచర్ ఓఐలో 17.22 లక్షల షేర్లు (34 శాతం), యూనియన్ బ్యాంక్ ఫ్యూచర్లో 13.72 లక్షల షేర్లు (15 శాతం), ఐడీబీఐ బ్యాంక్ ఫ్యూచర్లో 9.52 లక్షల షేర్లు (11 శాతం), బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్లో 15.08 లక్షల షేర్లు (24 శాతం), కెనరా బ్యాంక్ ఫ్యూచర్లో 5.74 లక్షల షేర్ల (9.5 శాతం) చొప్పున యాడ్ అయ్యాయి. అయితే నిఫ్టీ 50 షేర్లలో భాగమైన స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్యూచర్లలో ఓఐ తగ్గింది. బీవోబీ 2 శాతం పెరిగినప్పటికీ, ఎస్బీఐ స్వల్పంగా తగ్గింది. -
ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ఇరాన్ డీల్‌తో ఇన్వెస్టర్లలో వెల్లువెత్తిన ఉత్సాహం ఒక్కరోజులోనే చల్లారిపోయింది. మంగళవారం తిరిగి ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 111 డాలర్లకు పెరగడంతో ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లు కోల్పోయి 20,425 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 6,059 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరో రెండు రోజుల్లో నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండటం, శుక్రవారం క్యూ2 జీడీపీ డేటా వెల్లడికానుండటంతో చాలావరకూ లాంగ్ పొజిషన్లను ఇన్వెస్టర్లు స్క్వేర్‌ఆఫ్ చేసుకున్నారని, మార్కెట్ క్షీణతకు ఇది కూడా ఒక కారణమని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. ప్రధాన ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కూడా బలహీనంగా ముగిసాయి. క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన ఆయిల్ రిఫైనరీ షేర్లు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు 5-6 శాతం పడిపోయాయి. చమురు ఉత్పాదక షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంకింగ్ షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-4 శాతం మధ్య తగ్గాయి. ప్రపంచ ఇన్వెస్టర్లు ట్రాక్‌చేసే మోర్గాన్ స్టాన్లీ ఇండెక్స్ నుంచి తొలగించిన కారణంతో కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనీటెక్లు 5-8 శాతం మధ్య పతనమయ్యాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) తిరిగి రూ. 339 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరిపారు. దేశీయ సంస్థలు రూ. 357 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. ఆర్ఐఎల్ కౌంటర్లో భారీ రోలోవర్స్... రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేరు 8 వారాల కనిష్టస్థాయి రూ. 841 వద్ద ముగియడం, ఈ షేరు సాంకేతికంగా కీలకమైన 830-840 మద్దతు శ్రేణి వద్దవుండటంతో డిసెంబర్ డెరివేటివ్ సిరీస్‌కు మంగళవారం రోలోవర్స్ భారీ జరిగాయి. నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 10 లక్షల షేర్లు కట్‌కాగా, డిసెంబర్ సిరీస్‌లో 23 లక్షల షేర్లు యాడ్కావడం విశేషం. ఈ నెల సిరీస్ ముగియడానికి మరో రెండురోజులు సమయం వున్నా, ఇప్పటికే డిసెంబర్ సిరీస్ ఆర్ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో బిల్డప్ 80.24 లక్షల షేర్లకు చే రింది. నవంబర్ సిరీస్ ప్రారంభంకావడానికి రెండు రోజుల ముందు.... అంటే అక్టోబర్ 29న నవంబర్ కాంట్రాక్టు బిల్డప్ 58 లక్షల షేర్లవర కే వుండేది. షేరు కీలక మద్దతుస్థాయిని సమీపించడంతో అటు షార్ట్, ఇటు లాంగ్ రోలోవర్స్ పెరగడాన్ని డిసెంబర్ బిల్డప్ సూచిస్తున్నది. సమీప భవిష్యత్తులో ఆర్ఐఎల్ ప్రస్తుత మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వచ్చే నెలలో ర్యాలీ జరపవచ్చని, మద్దతును కోల్పోతే వేగంగా పతనంకావొచ్చన్నది ఈ భారీ బిల్డప్ అంతరార్థం. కేజీ డీ6 క్షేత్రంలో మరో బావిని రిలయన్స్ మూసివేయడంతో అత్యంత కనిష్టస్థాయికి గ్యాస్ ఉత్పత్తి పడిపోయిందని, వచ్చే ఏప్రిల్ నుంచి రెట్టింపు గ్యాస్ ధరను గ్యారంటీ మొత్తాన్ని తీసుకుని ఆర్ఐఎల్కు వర్తింపచేస్తామంటూ కేంద్ర పెట్రో మంత్రి ప్రకటించడం వంటి అనుకూల, ప్రతికూల వార్తలు తాజాగా వెలువడ్డ నేపథ్యంలో ఈ బిల్డప్ జరగడం గమనార్హం.